షార్ట్‌టైమ్‌లోనే స్టార్‌డమ్‌ను అందుకున్న నటి శ్రీలీల. గుంటూరు కారం సినిమాతో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. తండ్రి తనను స్వీకరించకపోవడం నుంచి ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకోవడం వరకూ ఆమె జీవితం ఆశ్చర్యకర ఘటనలతో నిండిపోయింది. డాక్టర్ కావడమే కాకుండా, ఇప్పుడు ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ భారీ అవకాశాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది.
అలా మొదలైన సినీ ప్రయాణం
2019లో కన్నడ చిత్రం కిస్ ద్వారా హీరోయిన్‌గా శ్రీలీల రంగప్రవేశం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కావడంతో ఆమెకు టాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. రామ్‌తో స్కంద, బాలకృష్ణతో భగవంథ్ కేసరి, రవితేజతో ధమాకా సినిమాలు ఆమెను మాస్ ఆడియెన్స్‌కు దగ్గర చేశాయి. ఇప్పుడు ఆమె శివకార్తికేయన్‌తో పారాశక్తి అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది.
కెరీర్ టర్నింగ్ పాయింట్
2024లో మోస్ట్ హైప్ కలిగిన సినిమాల్లో ఒకటైన గుంటూరు కారంలో మహేష్ బాబుతో జతకట్టిన శ్రీలీలకు ఇది కెరీర్ టర్నింగ్ ప్రాజెక్ట్ అయింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా స్పేస్ లేకపోయినా, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్‌గా క్లాస్. మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవ్వడంతో, శ్రీలీల మార్కెట్ మరింత పెరిగింది.
పుష్ప 2 – “కిసిక్” సాంగ్ తో నేషనల్ క్రేజ్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2లో “కిస్సిక్” అనే స్పెషల్ సాంగ్‌కు శ్రీలీల చేసిన డాన్స్, గ్లామర్ ప్రెజెంటేషన్ ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఈ సాంగ్ చూసి ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ ఎంట్రీ- కార్తిక్ ఆర్యన్‌తో రొమాంటిక్ డ్రామా
శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నారు. ఆమె తొలి హిందీ చిత్రం అనురాగ్ బసు దర్శకత్వంలో, కార్తిక్ ఆర్యన్ సరసన రూపొందనుంది. టైటిల్ ఇంకా నిర్ణయించకపోయినా ఇది ఓ డీప్ లవ్ స్టోరీగా ఉండబోతుందట. శ్రీలీలకి ఇది మరో లెవల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లిక్కయితే అమ్మడు బాలీవుడ్‌లో కూడా మరింత బిజీగా మారే అవకాశం ఉంది.
డాక్టర్‌గా కెరీర్ – సామాజిక సేవా సంకల్పం
ఆడిషన్స్ షూటింగ్స్‌కి మధ్య చదువుని కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయని శ్రీలీల, 2021లో హైదరాబాద్‌లోని అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందింది. ఆమె తల్లి స్వర్ణలత ప్రసిద్ధ గైనకాలజిస్ట్ కావడంతో, అమె ప్రేరణతో వైద్యవృత్తిలోకి అడుగుపెట్టింది. సినిమాలు చేస్తూనే అవసరమైనప్పుడు మెడికల్ కాంప్‌లలో సేవలందిస్తుండటం గొప్ప విషయం.
ఇద్దరు దివ్యాంగ పిల్లల దత్తత
2022 ఫిబ్రవరిలో శ్రీలీల ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు, గురు, శోభిత అనే ఇద్దరు చిన్నారులను చూసి కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే వారిని దత్తత తీసుకుని జీవితాంతం వారికి సహాయపడాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించిన శ్రీలీలపై అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.
తండ్రి గుర్తించకపోయినా
అయితే, శ్రీలీల తల్లి స్వర్ణలతకు ఒకప్పుడు వ్యాపారవేత్త సురపనేని సుభాకరరావుతో పెళ్లి జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. ఆ విడాకుల తర్వాతే శ్రీలీల పుట్టింది. దీంతో సురపనేని సుభాకరరావు 2018లో మీడియాతో మాట్లాడుతూ శ్రీలీల తన కూతురు కాదని స్పష్టం చేశారు.తండ్రి ఆదరించని గతం, చదువు, డాక్టరేట్, సామాజిక బాధ్యతలు, సినిమాల్లో క్రేజ్ అన్నిటినీ ఒకేసారి బ్యాలెన్స్ తో నెరవేర్చిన శ్రీలీల కథ ఈ తరం అమ్మాయిలకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తోందని చెప్పవచ్చు. ఆమెలోని నటి మాత్రమే కాదు, మానవతా హృదయం, పట్టుదల, డెడికేషన్ ఆమెను కొత్త తరం ఐకాన్‌గా నిలబెట్టాయి. పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న ఆమె ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.
https://www.instagram.com/p/DLRo5XXztkV/?igsh=ZjFkYzMzMDQzZg==