ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Captain Smith Macher
ADVERTISEMENT

రియల్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు అభినందనలు.

దేశ విదేశాల్లో ప్రజలు , మీడియా పొగడ్తలతో ముంచెత్తున్నారు. హీరో ఆఫ్ ది స్కై అంటున్నారు. ఓ పైలెట్ తన విధులను పవిత్రంగా భావించడం వల్ల పైలెట్ కు మాత్రమే ప్రశంసలు దక్కడం లేదు. దేశ ప్రతిష్ట కు దక్కిన గౌరవమిది. భారత దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిస్తున్న సందర్భానికి కారణమైన పైలెట్ వీరుడు స్మిత్ మచ్చర్ కు అభినందనలు. ఈ వీరుడు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. కత్తితో దాడి జరిగినా తను గాయాలకు గురైనా కర్తవ్యాన్ని వీడకుండా లక్ష్య సాధన కోసం ఆయన అంకుఠిత దీక్షతో ముందుకు సాగారు. చెక్కుచెదరని సంకల్పం ,అచంచల దీక్ష , అవిశ్రాంత పట్టుదల ఇలా పదాల పట్టిక సరిపోదు ఈ సాహసోపేత పైలెట్ గురించి వ్యాఖ్యానించడానికి. వివిధ ఛానెల్స్ , సోషియల్ మీడియాలో , ఆన్లైన్ న్యూస్ సమాచారం మేరకు ఈ సమాచారాన్ని పొందుపరచటం జరిగింది.

వేల అడుగుల ఎత్తులో విమానం దూసుకెళ్తున్న సమయం. కిందికి చూస్తే కనిపించేది భూమి కాదు మేఘాలు. విమానం లో విభిన్నమైన మనస్తత్వం ఉన్న వందమందికి పైగా ప్రయాణికులు . పైలట్‌ చేతుల్లో వందల ప్రాణాలు. అంతా సజావుగా సాగుతున్న వేళ ఊహించని విధంగా ఒక్కసారిగా కాక్‌పిట్‌లోనే దాడి జరిగితే పరిస్థితి ఏలా ఉంటుందో ఉహించడమే కష్టం. అది ప్రమాదం కాదు. కో పైలెట్ దాడి చేస్తే ఎలా ఉంటుంది. అది మరణం కళ్లముందు నిలిచిన క్షణం! అలాంటి క్షణంలో భయపడకుండా బాధ్యతను గుర్తు చేసుకున్న భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యగాథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో జరిగిన సంఘటన ఇది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానంలో 174 మంది ప్రయాణికులున్నారు. ఆకాశం లో అప్పటికే చాలా ఏత్తులే ఎగురుతోంది. కో-పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం. విమానం ఒక్కసారిగా ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్లింది. విమానం గణనీయమైన ఎత్తును కోల్పోయింది. పైలట్‌ గాయపడటంతో విమానం ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్లింది. విమానం గణనీయమైన ఎత్తును కోల్పోయింది. వివిధ వర్గాల సమాచారం మేరకు ఘర్షణ సమయంలో విమానం తీవ్రంగా దిగజారింది. విమాన ట్రాకింగ్ సమాచారం ప్రకారం సుమారు 29 సెకన్లలో 30,875 అడుగుల నుంచి 16,750 అడుగులకు పడిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఏదైనా తప్పు జరిగితే లేదా ఒక్క తప్పు నిర్ణయం తీసుకొంటే వందల ప్రాణాలకు చరమగీతమే.పైలెట్ మచ్చార్‌ గాయపడ్డారు.

రక్తస్రావం.భయం. విమానంలో ఆందోళన. కానీ ఆ సమయంలో ఆయన ముందు ఉన్న ప్రశ్న ఒక్కటేనా ప్రాణమా? లేక ఈ విమానంలోని వందల ప్రాణాలా? ఒక పైలట్‌కు కాక్‌పిట్‌ అంటే కేవలం ఉద్యోగ స్థలం కాదు. అది ప్రయాణికుల ప్రాణాల బాధ్యత అప్పగించే స్థానం.ఆ బాధ్యతను మచ్చార్‌ చివరి వరకు మర్చిపోలేదు. కో పైలెట్ తో పరిస్థితిని ఎదుర్కొంటూ కాక్‌పిట్‌ తలుపు తెరుచుకునేలా చేయడంలో మచ్చార్‌ కీలకంగా వ్యవహరించారు. అక్కడి నుంచి ప్రయాణికులు, సిబ్బంది స్పందించారు. దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. భయపడితే ప్రమాదం గెలుస్తుంది.ధైర్యంగా నిలబడితే మనిషి గెలుస్తాడు. ఈ విమానంలో అదే జరిగింది. కెప్టెన్‌ మచ్చర్‌ ధైర్యం కీలకం. అదే సమయంలో కేబిన్‌ సిబ్బంది, ప్రయాణికులు, విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్‌ పైలట్లు కూడా కీలకంగా స్పందించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో ప్రయాణికులు సహకరించారు. విమానాన్ని సురక్షితంగా దించడంలో ఇతర పైలట్లు తమ అనుభవాన్ని వినియోగించారు. ఒకరి ధైర్యం. అందరి సహకారం. వందల ప్రాణాలకు రక్షణగా నిలిచింది. ఇందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. తర్కం లేదు. కాక్ పిట్ తలుపులు తీయడమే ధైర్యం. సాహసోపేతం. బయటనుంచి తలుపులు తీయడం సాధ్యం కాదు.

విమానంలో ప్రయాణికులుగా ఉన్న ఇద్దరు ఇతర ఫ్లైదుబాయ్‌ పైలట్లు కూడా ముందుకు వచ్చారు. వారి సహకారంతో విమానాన్ని నియంత్రించి చివరకు విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఒక భయంకరమైన గగన ప్రయాణం నేలపై ముగిసింది. 174 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విమాన భద్రత అంటే కేవలం యంత్రాల విషయం కాదు.
అది మనుషుల శిక్షణ, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ, ధైర్యం కలయిక.

ఎవరీ పైలెట్?

ఘాట్‌కోపర్‌ నుంచి ఆకాశం వరకు! స్మిత్‌ మచ్చార్‌ కథ కూడా స్ఫూర్తిదాయకమే. ముంబై ఘాట్‌కోపర్‌ ప్రాంతానికి చెందిన ఆయన మొదట విమానయాన రంగంలోకి రావాలని అనుకోలేదు. కుటుంబ వస్త్ర వ్యాపారంలోకి వెళ్లాలనే ఆలోచన ఉండేది. వస్త్ర సాంకేతిక విద్య అభ్యసించారు. విమానయానంపై ఆసక్తితో పైలట్‌ శిక్షణ పొందారు. ఆయన న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో విమాన శిక్షణ పొందారు. స్పైస్‌జెట్‌లో సుమారు పదకొండు సంవత్సరాలు పనిచేశారు. లైన్‌ శిక్షణ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరారు.
దాదాపు 9,750 గంటల విమాన అనుభవాన్ని సంపాదించారు. ఒకప్పుడు వ్యాపారం చేయాలనుకున్న యువకుడు. ఈ రోజు వందల ప్రాణాలకు కాపలాదారుడయ్యాడు.

సినిమాల్లో హీరోలు ఉంటారు. కథల్లో హీరోలు ఉంటారు. కానీ నిజ జీవితంలో హీరోలు ఎలా ఉంటారో మచ్చార్‌ ఘటన మరోసారి చూపించింది.
హీరో అంటే ప్రమాదం లేనప్పుడు ముందుకు వచ్చేవాడు కాదు. ప్రమాదం ఎదురైనప్పుడు తన భయాన్ని పక్కనపెట్టి బాధ్యతను ముందుకు పెట్టేవాడు. కత్తి యుద్దాలు , ముష్టి యుద్దాలు , మల్లయుద్దాలు , కరాటే లాంటి సాహసాలు చేస్తేనే హీరో కాదు. అలాగని వాటిని తక్కువ చేసినట్లు వక్రీకరించకండి. కెప్టెన్‌ మచ్చార్‌ గాయపడిన శరీరంతో పోరాడారు. సమయస్ఫూర్తి తో వ్యవహరించాడు. ప్రయాణం సుఖమయం చేశాడు. నిజమైన హీరో నిలిచాడు. హీరోకు మించిన హీరో అని చెబుతున్నాను. ఇతరులు తమ వంతు బాధ్యత నిర్వర్తించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్‌ మచ్చార్‌ ధైర్యాన్ని ప్రశంసించారు.
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు. ఇది ఒక భారతీయుడి ధైర్యానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు. భారత్ కు దక్కిన గౌరవం. కానీ ఇక్కడితో కథ ముగియకూడదు.
ప్రశంసించడమే కాదు. పాఠం నేర్చుకోవాలి. ఆపదలో ఎలా స్పందించాలి? విమాన సిబ్బందికి అత్యవసర పరిస్థితులపై శిక్షణ ఎలా ఉండాలి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలి. జరగకుండా ఏం చేయాలి. కాక్‌పిట్‌ భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా?ఇలాంటి ప్రశ్నలకు దర్యాప్తు సమాధానం చెప్పాలి. నిజం కోసం దర్యాప్తు అవసరం

కో-పైలట్‌ ఎందుకు దాడి చేశాడు? అతని ఉద్దేశం ఏమిటి? విమానాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలోకి నెట్టాడా?
భద్రతా వ్యవస్థలో ఏదైనా లోపం జరిగిందా? ఇవన్నీ ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉన్న అంశాలు. వీరత్వాన్ని ప్రశంసిద్దాం. వాస్తవాలను మాత్రం వక్రీకరించొద్దు. సమాజానికి అసలు సందేశం ఈ ఘటన విమాన ప్రయాణం గురించి మాత్రమే కాదు.
మన జీవితాల గురించి కూడా. ప్రమాదం వచ్చినప్పుడు ఎవరో ఒకరు వస్తారని ఎదురు చూడకుండా నేను ఏం చేయగలను? అని నేర్చుకోవాలి. రోడ్డుపై ప్రమాదం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా , ప్రకృతి విపత్తు వచ్చినా , వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైనా సమయస్ఫూర్తితో స్పందించే ఒక్క వ్యక్తి ఎన్నో ప్రాణాలను కాపాడగలడు.
భయం ఉంటుంది.. ధైర్యం కూడా ఉంటుంది. పైలెట్ స్మిత్‌ మచ్చార్‌ మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే.
ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు.
భయం ఉన్నప్పటికీ బాధ్యత నుంచి పారిపోకపోవడం. ఆకాశంలో కత్తి ఎదురైనా కర్తవ్యాన్ని విడిచిపెట్టని ఆ కెప్టెన్‌ తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి మనిషి ప్రాణాన్ని తన బాధ్యతగా భావించాడు. అందుకే ఈ కథ కేవలం ఒక పైలట్‌ కథ కాదు. ఇది మనిషిలోని మంచితనం, ధైర్యం, బాధ్యత ఇంకా చనిపోలేదని చెప్పే కథ.
ఆపదలో ఎవరో ఒకరు కాపాడతారు అని ఎదురుచూడటం కాదు.
మన వంతు బాధ్యత మనమే నిర్వర్తించాలి.
కత్తి గెలవలేదు. భయం గెలవలేదు. బాధ్యత గెలిచింది. సమయస్ఫూర్తి గెలిచింది. మానవత్వం గెలిచింది. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ త్వరగా కోలుకోవాలి. తన బాధ్యతను మర్చిపోనివాడే నిజమైన హీరో. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని స్థిరమైన పరిస్థితిలో ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి.

కో పైలెట్ ఎవరు ?

కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై దాడి చేసిన ఫ్లై‌దుబాయ్ కో పైలట్ ఎవరు ఏమిటి అన్నప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాచారం లభించడం లేదు. కో పైలెట్ ఒమన్ జాతీయుడు అని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంస్థ లో 8నుంచి 9 మాసాలు క్రితం చేరినట్లు చెబుతున్నారు. ఒమన్ పైలట్ ఇజ్రాయెల్ విమానంలో ఎలా ఉన్నాడు? ఇది ఇప్పుడు దర్యాప్తులో మరో ముఖ్యమైన అంశంగా మారింది. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో ఒమన్ పౌరుడు సహ పైలట్‌గా ఎలా నియమితుడయ్యాడు? అతని భద్రతా పరిశీలన ఎలా జరిగింది? విమాన సిబ్బంది నియామకానికి సంబంధించిన నిబంధనలు పాటించబడ్డాయా? అనే ప్రశ్నలను ఇజ్రాయెల్ అధికారులు పరిశీలిస్తున్నారు. సహ పైలట్‌కు ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. అలాగే అతని పూర్తి పేరు కూడా అధికారులు విడుదల చేయలేదు. అతని పూర్తి గుర్తింపు ఏమిటి? అతని గత ఉద్యోగ చరిత్ర ఏమిటి?
ఫ్లైదుబాయ్‌లోకి అతను ఎలా ఎంపికయ్యాడు?అతని నేపథ్య పరిశీలనలో ఏమైనా హెచ్చరిక సంకేతాలు కనిపించాయా? అతని వైద్య, మానసికపరిస్థితి ఎలా ఉంది? ఆయుధం కాక్‌పిట్‌లోకి ఎలా చేరింది? అతనికి ఎవరైనా సహకరించారా? ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందా? వ్యక్తిగత విభేదమా?విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చే ప్రయత్నమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సౌదీ, యూఏఈ, ఇజ్రాయెల్, ఒమన్ భద్రతా సంస్థల సంయుక్త దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతాయి. అంత వరకు సంఘటన ఎందుకు జరిగింది అన్నది ప్రశ్నార్థకంగా ఉంటుంది.

నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.

Tags: #AviationNews#CaptainSmithMacher#DubaiToTelAviv#Flydubai#FZ1073#IndianPilot#IndianPilotHero#PilotHero#PilotNews#RealHero#SmithMacher#TabukLanding
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Next Post

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Related Posts

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Essential Commodity Prices
Big Story

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie
Entertainment

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Bhagat Singh
Big Story

Bhagat Singh: భగత్ సింగ్ తాత్విక వారసత్వం.. నేటి సమాజానికి ఆయన సందేశం

RevanthReddy
Big Story

RevanthReddy: సైమన్ గో బ్యాక్‌.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్‌: సీఎం రేవంత్ రెడ్డి

Palle Panduga 3.0
Andhra Pradesh

Palle Panduga 3.0: రూ.11,085 కోట్లతో పల్లెల్లో అభివృద్ధి జోరు.. రోడ్లు, డ్రైనేజీ,భారీగా అభివృద్ధి పనులు

Next Post
Telangana Cabinet

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana Cabinet

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Recent News

Telangana Cabinet

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info