ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు
ADVERTISEMENT

*క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా…*

 

చదువులతో పాటు క్రీడల్లోనూ జాతీయ స్థాయికి ఎదుగుతున్న చిన్నారులు.

 

నేటి సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువగా చదువులు, ర్యాంకులు, పోటీ పరీక్షల చుట్టూనే తిరుగుతూ కాలం గడుపుతున్నారు. ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అత్యంత అవసరమైన క్రీడలు, వ్యాయామం పట్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన క్రీడా వసతులు కూడా పరిమితంగానే ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో కూడా అంతంత మాత్రమే వసతులున్నాయి .అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కదిరి పట్టణంలోని సి.ఆర్.సి కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కందికుంట ఇండోర్ స్టేడియం ఎంతోమంది చిన్నారుల కలలకు వేదికగా మారింది. ఇక్కడ కూడా తగిన సౌకర్యాలు లేవు.అయినా పట్టువదలక మెుక్కవోని ధైర్యం తో ముందుకు సాగడం విశేషం. మెంటార్ లేరు . కోచ్ లేరు . తగిన క్రీడా వసతులు లేవు. అయినా పిల్లలు బాడ్మింటన్ లో దూసుకుపోతున్నారు.

 

బుడిబుడి అడుగులతో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన చిన్నారులు నేడు రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో హేమాహేమీలతో పోటీ పడుతూ విజేతలుగా, రన్నరప్‌లుగా నిలుస్తూ కదిరి పేరును దేశవ్యాప్తంగా చాటుతున్నారు. కఠినమైన సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సి.ఆర్.సి కమిటీ సహకారం కలిసి ఈ విజయ గాథను సృష్టిస్తున్నాయి.

 

ఈ క్రీడాకారుల ఎదుగుదలలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందిస్తున్న సహకారం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. జాతీయ స్థాయికి చేరుకున్న క్రీడాకారుల కోచింగ్,కాక్స్, ఇతర క్రీడా అవసరాల కోసం ఆయన వ్యక్తిగతంగా ప్రతి నెల రూ.25,000 ఆర్థిక సహాయం అందిస్తూ యువ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి, ప్రోత్సాహం నిజంగా అభినందనీయం. ఎమ్మెల్యే అందిస్తున్న సహకారం వల్ల ఎంతోమంది చిన్నారులకు నూతన ఉత్సాహం కలుగుతోందని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

అలాగే, ఈ విజయయాత్ర వెనుక నిలిచిన సి.ఆర్.సి కమిటీ సభ్యుల సేవలు కూడా ప్రశంసనీయం. సరైన వేదిక, అవసరమైన సదుపాయాలు, క్రీడా వాతావరణం కల్పిస్తూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటికి తోడు వెంకట హర్షిత్ సాయి తండ్రి నాగభూషణం తన ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వదులుకొని చిత్తశుద్ధితో పిల్లలకు కోచింగ్ ఇస్తూ ప్రోత్సాహం అందించడం విశేషం.

 

*జాతీయ స్థాయిలో మెరిసిన హర్షిత్ వెంకట సాయి*

 

ఇటీవల గోవాలో నిర్వహించిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న అంగజాల హర్షిత్ వెంకట సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. డబుల్స్ విభాగంలో దేశంలో నెంబర్-1 విజేతగా నిలవడమే కాకుండా, భారత ర్యాంకింగ్స్‌లో 4వ స్థానాన్ని సాధించడం విశేషం. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్న హర్షిత్ సాయి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.

 

హర్షిత్ వెంకట సాయి

2022లో బెంగళూరులో నిర్వహించిన పీఎన్‌బీ మెట్లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-9 విభాగంలో ఆల్ ఇండియా విజేత.

2024లో ఒంగోలులో జరిగిన ఏపీ రాష్ట్ర మినీ ఛాంపియన్‌షిప్ అండర్-11విభాగంలో రాష్ట్ర నంబర్-1. మే 2026లో గోవాలో జరిగిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ నేషనల్ టోర్నమెంట్‌లో డబుల్స్‌లో 1వ స్థానం, సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనలిస్ట్.ప్రస్తుతం భారత ర్యాంకింగ్స్‌లో 4వ స్థానం సంపాదించాడు.

హర్షిత్ విజయాల వెనుక అతని తండ్రి నాగభూషణ, తల్లి అందించిన అండదండలు ఎంతో గొప్పవి. పిల్లల ప్రతిభను గుర్తించి, నిరంతరం ప్రోత్సహిస్తూ క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాల్సిందే.

 

*విజయపథంలో కాటం ఈశ్వర్ సాయి*

 

చిన్న వయసులోనే జాతీయ, రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న మరో క్రీడాకారుడు కాటం ఈశ్వర్ సాయి. ముఖ్యంగా డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో అతను చూపుతున్న ప్రతిభ విశేషం. ఈశ్వర్ సాయి

2023లో ఆల్ ఇండియా అండర్-13 విభాగంలో డబుల్స్‌లో రన్నరప్. కర్ణాటక రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లలో పలుమార్లు విజేతగా నిలిచాడు. 2025లో బాలుర సింగిల్స్‌లో రన్నరప్. అండర్-15 విభాగంలో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అనేక టైటిల్స్ సాధించారు.

68వ జాతీయ పాఠశాల క్రీడల్లో అండర్-14 బాలుర విభాగంలో రన్నరప్.

అండర్-17 విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ లో 35 స్థానంలో నిలిచాడు.కర్నాటక

అండర్ 19 విభాగంలో మిక్స్ డ్ డబుల్స్ లో రన్నరప్. ఈశ్వర్ సాయి నిరంతర కృషి, తండ్రి కాటం కిరణ్ పట్టుదల అతడిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని క్రీడాభిమానులు , శ్రేయోభిలాషులు విశ్వసిస్తున్నారు.

 

*ప్రతిభతో ఆకట్టుకుంటున్న మురారి వెంకట్*

 

కదిరి నుంచి జాతీయ స్థాయికి ఎదుగుతున్న మరో ప్రతిభావంతుడు మురారి వెంకట్. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తన ఆటతీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు.

మురారి వెంకట్ 2022లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ రాష్ట్ర స్థాయి అండర్ 14విభాగంలో 3వ స్థానం.

2023లో ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి 1వ స్థానంలో నిలిచారు. 2023లో జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-14విభాగంలో 5వ స్థానంలో నిలిచారు. 2025లో ఏపీ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో 3వ స్థానం.2026లో ఆల్ ఇండియా ర్యాంకింగ్స్‌లో 35వ స్థానం సంపాదించాడు. తండ్రి విజయ్ కుమార్ ప్రోత్సాహం , వెంకట్ మురారి సాధన , అంకితభావం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.

 

క్రీడలను ప్రోత్సహిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజంతయారౌతుంది.

చదువులతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని కదిరి చిన్నారులు నిరూపిస్తున్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాదు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

సి.ఆర్.సి కమిటీ అందిస్తున్న వేదిక, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందిస్తున్న ఆర్థిక సహాయం కలిసి నేటి చిన్నారులను రేపటి జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

వారిని వెన్నంటి నిలబెడుతున్న తల్లిదండ్రులకు అభినందనలు.

క్రీడల అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి, సి.ఆర్.సి కమిటీ సభ్యులకు క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కదిరి నుంచి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.

 

*కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం*

 

జిల్లా కలెక్టర్‌, యువజన మరియు క్రీడా శాఖ అధికారులు కదిరి పట్టణంలో మరింత మెరుగైన క్రీడా వసతులు కల్పించి, యువ క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిమిత వనరులతోనే క్రీడాకారులు విశేష విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, సరైన ఇండోర్ స్టేడియాలు, ఆధునిక కోర్టులు, శిక్షణా సదుపాయాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, నిపుణులైన కోచ్‌లు, ప్రయాణ భత్యాలు వంటి సౌకర్యాలు కల్పిస్తే కదిరి క్రీడారంగంలో ఒక ప్రత్యేక కేంద్రంగా నిలిచే సామర్థ్యం ఉంది.

 

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలంటే ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా ముందుకు రావాలి. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా యువత భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా భావించి ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

 

ఇప్పటికే సి.ఆర్.సి కమిటీ, తల్లిదండ్రులు, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందిస్తున్న సహకారం ఫలితంగా కదిరి చిన్నారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగురవేసే క్రీడాకారులు కదిరి నుంచే వెలువడటం ఖాయం అని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

చందమూరి నరసింహరెడ్డి. జర్నలిస్ట్.

ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.

కదిరి.

APSports
Tags: #AndhraPradesh#APSports#Badminton#BadmintonChampions#Champion#CRCCommittee#EshwarSai#Fitness#HarshithSai#IndianBadminton#IndianSports#Journalism#Kadiri#KadiriPride#KadiriSports#KadiriYouth#KandikuntaVenkatPrasad#MurariVenkat#NationalLevel#RuralTalent#Sports#SportsDevelopment#SportsInspiration#SportsKids#SportsSpirit#SubJuniorBadminton#TeluguMedia#TeluguNews#YoungChampions#youthpower
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Next Post

IPL2026:ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం.. 55 పరుగుల తేడాతో బెంగళూరు చిత్తు

Related Posts

Southern Zonal Council 2026
Big Story

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics
Andhra Pradesh

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev
Big Story

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident
Big Story

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Disha Patani Success Story
Entertainment

Disha Patani Success Story: రూ.500తో ముంబైకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దిశా పటానీ

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం? 117 సీట్లపై రేవంత్ రెడ్డి ధీమా

Next Post
IPL2026

IPL2026:ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం.. 55 పరుగుల తేడాతో బెంగళూరు చిత్తు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Southern Zonal Council 2026

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Recent News

Southern Zonal Council 2026

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info