ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్: 7 కీలక ప్రశ్నలు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన!

భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్
ADVERTISEMENT

భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశమైంది?

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బిలోటీ గ్రామానికి చెందిన 28 ఏళ్ల భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాలను, పోలీసు వ్యవస్థను, న్యాయవ్యవస్థను కుదిపేస్తోంది. 17 జూన్ 2026న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో గాయపడిన భరత్ భూషణ్ తివారీ అనంతరం ఆస్పత్రిలో మృతి చెందాడు.

“ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే… అది ప్రజాస్వామ్యానికి బలమా? లేక అధికారానికి అసౌకర్యమా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన ఉంది.

బీహార్‌లో 28 ఏళ్ల యువకుడు భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు చెబుతున్న కథనం ఒకటి… కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెబుతున్న కథనం మరోటి. ఒకవైపు ‘ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాం’ అంటున్న పోలీసులు… మరోవైపు ‘లొంగిపోయిన తర్వాత కూడా కాల్చిచంపారు’ అని ఆరోపిస్తున్న కుటుంబం.

ఈ ఘటనతో ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి కావడమే కారణమా? లేక నిజంగానే అతడు ప్రమాదకర పరిస్థితి సృష్టించాడా? వైరల్ అయిన వీడియో నిజంగా ఏమి చెబుతోంది? ఎన్‌కౌంటర్‌లో చట్టపరమైన నిబంధనలు పాటించారా? లేక ఇది న్యాయేతర హత్యగా పరిగణించాల్సిన పరిస్థితా?

ఈ వివాదం అంత తీవ్రరూపం దాల్చడంతో బీహార్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక వ్యక్తి మరణానికి సంబంధించినది కాదు. ఇది రాజ్యాంగం, పోలీసు అధికారాల పరిమితులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఈ నాలుగు అంశాల కూడలిలో నిలిచిన కేసుగా మారింది.

అసలు భరత్ భూషణ్ తివారీ ఎవరు? ఆ రోజు నిజంగా ఏమి జరిగింది? పోలీసులు చెప్పిన కథనంలో నిజమెంత? కుటుంబ సభ్యుల ఆరోపణల్లో వాస్తవమెంత? ఇది విచారణ లో తేలాల్సి ఉంది.

భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ బుల్లెట్ ముందు చట్టమా? చట్టం ముందు బుల్లెట్టా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చట్టం చేతిలో తుపాకీ ఉండొచ్చు కానీ తుపాకీ చేతిలో చట్టం ఉండకూడదు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? సోషల్ మీడియాలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం తప్పా? ఒక వ్యక్తిపై ఆరోపణలు ఉంటే అతడికి కోర్టులో తన వాదన వినిపించే అవకాశం ఉండాలా? లేక పోలీసు బుల్లెట్టే తుది తీర్పా?

ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి దేశం ముందుకు తెచ్చిన ఘటన బీహార్‌లో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్.

ఈ ఘటన ఇప్పుడు కేవలం ఒక ఎన్‌కౌంటర్ వివాదంగా మాత్రమే కాదు… రాజ్యాంగబద్ధమైన హక్కులు, పోలీసు అధికారాల పరిమితులు, మానవ హక్కులు, న్యాయ ప్రక్రియపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

అసలు భరత్ భూషణ్ తివారీ ఎవరు?

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బిలోటీ గ్రామానికి చెందిన 28 ఏళ్ల భరత్ భూషణ్ తివారీ. ఆయన తండ్రి కాశీనాథ్ తివారీ మాజీ పోలీసు కానిస్టేబుల్.

భరత్ పెద్ద రాజకీయ నాయకుడు కాదు. ఏ పెద్ద సామాజిక సంస్థకు నాయకుడు కూడా కాదు. కానీ సోషల్ మీడియాలో ప్రజా సమస్యలను నిరంతరం ప్రస్తావించే స్థానిక యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందాడు. ఫేస్‌బుక్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

గ్రామీణ రహదారులు, వరద బాధితుల సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి కొరత, స్థానిక అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై వీడియోలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేవాడని స్థానికులు చెబుతున్నారు.

వివాదాలకు కారణమైన పోస్టులు

భరత్ చేసిన కొన్ని పోస్టుల్లో తీవ్రమైన పదజాలం ఉపయోగించినట్లు సమాచారం. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులపై తీవ్ర విమర్శలు చేశాడని చెబుతున్నారు.

పోలీసుల ప్రకారం, కొన్ని వీడియోల్లో అతడు ఆయుధంతో కూడా కనిపించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు బెదిరింపులు చేశాడని కూడా ఆరోపించారు. అయితే ఆయనపై తీవ్రమైన నేరచరిత్ర ఉందని నిర్ధారించే పూర్తి వివరాలను పోలీసులు బహిరంగంగా వెల్లడించలేదు.

మరోవైపు, ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కూడా పోలీసులు పేర్కొన్నారు.

భరత్ భూషణ్ తివారీ తుపాకీతో బహిరంగ ప్రదేశంలో తిరుగుతూ కాల్పులు జరుపుతున్నాడనే సమాచారం అందింది.
దీంతో పోలీసులు, ప్రత్యేక దళం సంఘటన స్థలానికి చేరుకున్నారు.పోలీసులు చెబుతున్న ప్రకారం, భరత్ వారిపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ప్రతికాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

అయితే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూర్తిగా భిన్నమైన కథనం చెబుతున్నారు.వారి వాదన ప్రకారం ఘటన సమయంలో భరత్ ఫేస్‌బుక్ లైవ్ నిర్వహిస్తున్నాడు. ఆ వీడియోలో అతడు తుపాకీని కిందపడేసి లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని వారు చెబుతున్నారు.అతడు ఆయుధాన్ని వదిలేసిన తర్వాత కూడా పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు.

భరత్ తండ్రి కాశీనాథ్ తివారీ కూడా తన కుమారుడిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు లేవని, లొంగిపోయిన తర్వాత కాల్చారని ఆరోపించారు.
ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు.

ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.ఆ వీడియో నిజంగా ఏమి చూపిస్తోంది? అందులో భరత్ పూర్తిగా లొంగిపోయాడా?లేదా వీడియోలో కనిపించని పరిస్థితులు కూడా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం దర్యాప్తు, ఫోరెన్సిక్ విశ్లేషణ, వీడియో ధృవీకరణ తర్వాతే స్పష్టమవుతుంది.

ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కొంతమంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. సంబంధిత పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భోజ్‌పూర్ ఎస్పీ కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో బీహార్ ప్రభుత్వం పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించింది.ఇది సాధారణ శాఖాపరమైన విచారణ కాకపోవడం ఈ కేసు ప్రాధాన్యతను చూపిస్తోంది.

ఎన్‌కౌంటర్‌పై చట్టం ఏమి చెబుతోంది?

భారతదేశంలో పోలీసులు బలప్రయోగం చేయవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే.తక్షణ ప్రాణహాని ఉండాలి. ఆత్మరక్షణ అవసరం ఉండాలి. అవసరమైనంత మేరకే బలప్రయోగం చేయాలి.
ప్రతి కాల్పుపైనా చట్టపరమైన సమీక్ష తప్పనిసరి.

ఒకవేళ లొంగిపోయిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు విచారణలో తేలితే అది న్యాయేతర హత్యగా పరిగణించే అవకాశం ఉంటుంది.

అందుకే ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు గతంలో పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ కేసు కేవలం భరత్ భూషణ్ తివారీ గురించినది కాదు.ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
అదే సమయంలో చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.ఈ రెండింటి మధ్య సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలం.

ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసు నమోదు చేయాలి.అరెస్టు చేయాలి.
కోర్టులో హాజరుపరచాలి.
నేరం చేశాడా లేదా అనేది న్యాయస్థానం నిర్ణయించాలి. అదే ప్రజాస్వామ్య సూత్రం.

భరత్ భూషణ్ తివారీ కేసు ఒక వ్యక్తి మరణం గురించిన కథ మాత్రమే కాదు.ఇది రాష్ట్రానికి ఉన్న అధికారానికి హద్దులు ఏమిటి? ప్రజాస్వామ్యంలో న్యాయ ప్రక్రియకు ప్రత్యామ్నాయం ఉందా?
అనే ప్రాథమిక ప్రశ్నలను మన ముందుంచుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే ప్రతి అధికారం కూడా చట్టానికే లోబడి ఉండాలి.

చట్టం చేతిలో తుపాకీ ఉండొచ్చు కానీ తుపాకీ చేతిలో చట్టం ఉండకూడదు.ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అసలు బలం బుల్లెట్ కాదు రాజ్యాంగంపై ప్రజలకు ఉండే విశ్వాసం.

చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి.

Tags: #BharatBhushanTiwari#Bihar#BiharNews#BreakingNews#Constitution#crimenews#Encounter#HumanRights#IndiaNews#JudicialInquiry#Justice#LatestNews#Law#NationalNews#NewsUpdate#Politics#TeluguNews#ViralVideo#భరత్_భూషణ్_తివారీPolice
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులా? జూన్ 28-29న కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం.. శక్తికాంత్ దాస్‌కు ఛాన్స్?

Next Post

విద్య, వైద్యం ప్రాథమిక హక్కులుగా కాకుండా వ్యాపార సంస్థలుగా ఎందుకు మారాయి. బాధ్యులెవరు?

Related Posts

Karnataka Religious Politics
Big Story

Karnataka Religious Politics: దక్షిణాది మత రాజకీయాల్లో కర్ణాటక ఎందుకు ప్రత్యేకం?

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute
Big Story

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

Vinayaka Immersion Tragedy
Big Story

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Disha Salian Case
Big Story

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

BRICS Summit 2026
Big Story

BRICS Summit 2026: జిన్‌పింగ్ అసౌకర్యం నుంచి కాంగ్రెస్ నేతల భిన్నాభిప్రాయాల వరకు.. అసలు కథేంటి?

TVK Congress Alliance
Big Story

TVK Congress Alliance : కొత్త చిచ్చు.. 2029 ప్రధాని అభ్యర్థిపై విజయ్ వర్సెస్ రాహుల్ గాంధీ?

Next Post
విద్య

విద్య, వైద్యం ప్రాథమిక హక్కులుగా కాకుండా వ్యాపార సంస్థలుగా ఎందుకు మారాయి. బాధ్యులెవరు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Warangal Development

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Tirumala Laddu Ghee Case, Tirupati Laddu Ghee Case, Tirumala Laddu Controversy, Tirupati Laddu Controversy, TTD Ghee Case, CBI SIT Tirumala Laddu, CBI Investigation Tirupati Laddu, Tirumala Ghee Adulteration Case, Tirupati Laddu Latest News, TTD Latest News, Tirumala Laddu CBI Investigation, Tirupati Ghee Case, ED Investigation TTD, Tirumala Laddu Case 2026, Andhra Pradesh News, Tirupati News Today

Tirumala Laddu Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు.. సీబీఐ దర్యాప్తులో ఏమి తేలింది?

Chandrababu Kuppam Tour, Chandrababu Kuppam News, Kuppam News Today, Chandrababu Naidu Kuppam, Kuppam Development Works, Chandrababu DSC Comments, Mega DSC News, AP Mega DSC, DSC Sports Quota, AP Teachers News, Chandrababu Assembly Challenge, Kuppam Development Projects, Kuppam RDO Office, Kuppam ASP Office, PM Kusum Solar Project, Kuppam Solid Waste Management Plant, AP Politics, Andhra Pradesh Politics, TDP News, YSRCP News, Chandrababu Latest News, AP CM Chandrababu News

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో సమాధానం ఇస్తాం’

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info