• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Thandel : ‘తండేల్’ మూవీ రివ్యూ

Thandel : ‘తండేల్’ మూవీ రివ్యూ

‘తండేల్’ మూవీ రివ్యూ

నటీనటులు: నాగచైతన్య-సాయిపల్లవి-దివ్య పిళ్లై-ఆడుగలం నరేన్-కరుణాకరన్-పృథ్వీ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: శ్యామ్ దత్

కథ: కార్తీక్

నిర్మాత: బన్నీ వాసు

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందూ మొండేటి

‘లవ్ స్టోరీ’ తర్వాత నాగచైతన్య-సాయిపల్లవి కలయికలో తెరకెక్కిన చిత్రం.. తండేల్. గీతా ఆర్ట్స్ బేనర్లో చందూ మొండేటి ఈ చిత్రాన్ని రూపొందించాడు. మంచి పాటలు.. చక్కటి ప్రోమోలతో విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకున్న చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రాజు (నాగచైతన్య) శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కుర్రాడు. సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అతడి కుటుంబానికి తరతరాలుగా వస్తున్న వృత్తి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అతనూ అదే పని చేస్తాడు. ఈ క్రమంలో జాలరుల బృందానికి నాయకుడైన తండేల్ అవుతాడు. అతడికి సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. ఆమెకూ అతనంటే అంతే ఇష్టం. కానీ సముద్రంలో వేటకు వెళ్లే వాళ్ల ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో రాజును ఆ పని మానేయమని అడుగుతుంది సత్య. కానీ అందుకతను ఒప్పుకోడు. ఓ సందర్భంలో సత్య ఎంత పట్టుబట్టినా వినకుండా వేటకు వెళ్తాడు. ఈ క్రమంలో అతను.. తన బృందం పాకిస్థాన్ అధికారులకు చిక్కుతారు. మరి అక్కడి నుంచి రాజు బృందం తప్పించుకుందా లేదా.. అతణ్ని బయటికి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలేంటి.. చివరికి రాజు-సత్య కలిశారా లేదా అన్నది మిగతా కథ

కథనం-విశ్లేషణ: చూడ్డానికి చక్కగా అనిపించే ప్రేమ జంట.. నిజంగా వీళ్లిద్దరూ ప్రేమికులా అనిపించేలా వారి మధ్య పండిన కెమిస్ట్రీ.. మంచి ఫీల్ ఉన్న ప్రేమ సన్నివేశాలు.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు.. అందమైన విజువల్స్.. ప్రేమికుల మధ్య బలమైన సంఘర్షణకు దారి తీసే ఒక సమస్య.. దాని చుట్టూ ఒక డ్రామా.. ఒక ప్రేమకథ పండడానికి ఇంతకంటే ఏం కావాలి? ‘తండేల్’లో ఇవన్నీ ఉన్నాయి. ‘తండేల్’ గురించి చిత్ర బృందం చెప్పింది ఏదీ అతిశయోక్తి కాదనిపించేలా సాగే ప్రథమార్ధం.. ఈ చిత్రాన్ని బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలబెట్టడానికి బలమైన పునాది వేసేట్లే కనిపిస్తుంది. కానీ ఈ ప్రేమకథకు దేశభక్తి కోణం జోడించి దీని రీచ్ పెంచడానికి చేసిన ప్రయత్నం అందుకు ఉపయోగకపడకపోగా.. లవ్ స్టోరీలో ఉన్న ఫీల్ ను కొంచెం దెబ్బ తీసి ‘తండేల్’ స్థాయిని తగ్గిస్తుంది. సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అనుకున్న పాకిస్థాన్ ఎపిసోడ్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడం ‘తండేల్’కు మైనస్. అయినా సరే.. దాన్ని మరిపించే ప్లస్సులు ఈ సినిమాలో ఉన్నాయి.

‘తండేల్’ నిజంగా జరిగిన కథకు కొంచెం డ్రామా జోడించి తీసిన సినిమా. చందూ మొండేటి బృందం ఈ సినిమా తీయడానికి ప్రేరేపించిన అంశం.. పాకిస్థాన్‌ జలాల్లోకి వెళ్లిపోయి ఆ దేశంలో రెండేళ్ల పాటు చిక్కుకుపోయిన శ్రీకాకుళం జాలర్ల బృందం ఎన్నో ప్రయత్నాల తర్వాత స్వస్థలానికి చేరడంలో ఉన్న డ్రామానే. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే విషయమిది. ఈ రియల్ ఎపిసోడ్ చుట్టూ ఓ ఊహాజనిత ప్రేమకథను అల్లి సినిమాగా మలిచింది చిత్ర బృందం. ఐతే అందరి దృష్టినీ ఆకర్షించిన వాస్తవ కథ కంటే.. చందూ అండ్ టీం అల్లిన ప్రేమకథ ఇందులో హైలైట్ కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు చూశాం కానీ.. సముద్ర తీరంలో చేపలు పట్టుకుని బతికే కుటుంబాలకు చెందిన ఓ అబ్బాయి-అమ్మాయి మధ్య తీర్చిదిద్దిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ఎప్పుడూ చూసే ప్రేమ సన్నివేశాలే ఈ బ్యాక్ డ్రాప్ వల్ల భిన్నంగా అనిపిస్తాయి. పాటల్లో.. నేపథ్య సంగీతంలో.. విజువల్స్ లో లవ్ ఫీల్ ఉప్పొంగుతుండగా.. లీడ్ పెయిర్ మధ్య చక్కటి కెమిస్ట్రీ కూడా వర్కవుటై ‘తండేల్’ ప్రేమకథ ప్రేక్షకులను అలరిస్తుంది. తాను చేసే వృత్తిని ఎంతో ఇష్టపడే హీరో.. ప్రమాదకరమైన ఆ వృత్తి వల్ల అతడికి ఏమవుతుందో అన్న భయంతో ఆ పనిని వదిలేయమనే హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సంఘర్షణతో డ్రామా రక్తి కడుతుంది. ఈ సంఘర్షణ ఇలా సాగుతుండగా.. హీరో పాకిస్థాన్లో చిక్కుకోవడంతో కథ మరింత రసకందాయంలో పడ్డట్లవుతుంది.

పాకిస్థాన్ ఎపిసోడ్ ను కొంచెం సెన్సిబుల్ గా డీల్ చేసి ఉంటే.. ‘తండేల్’ స్థాయే వేరుగా ఉండేది. కానీ అక్కడ హీరోయిజం ఎలివేట్ చేయడానికి.. దేశభక్తి యాంగిల్ హైలైట్ చేయడానికి ప్రయత్నించడంతో ‘తండేల్’ రూటే మారిపోయింది. అప్పటిదాకా ఎంతో సున్నితంగా.. వాస్తవికంగా సాగుతున్న కథన శైలిలో ఓవర్ ద టాప్ స్టయిల్లో సాగే పాకిస్థాన్ ఎపిసోడ్ ఇమడలేకపోయింది. ఇంటర్వెల్ నుంచి వేరే సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అటు పాకిస్థాన్లో.. ఇక్కడ ఇండియాలో జరిగే విషయాలేవీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించవు. పనిగట్టుకుని ‘తండేల్’ను చెడగొడుతున్న ఫీల్ కలుగుతుంది. ప…

Tags: #ThandelMovie #ThandelReview #NagaChaitanya #SaiPallavi #TeluguCinema #TeluguFilmReview #EntertainmentBuzz #ThandelMovieReview #Thandel #TollyWood #MovieNews #ThandelReview #TeluguFilmNagar
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

YS Sharmila: చాలా బాధ పడ్డా.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Next Post

Delhi Election Results: 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ విజయం..!

Related Posts

Naira Banerjee: అందాల విందు!
Entertainment

Naira Banerjee: అందాల విందు!

Vidya Balan: రాత్రికి రాత్రే అలా జరిగింది..!
Entertainment

Vidya Balan: రాత్రికి రాత్రే అలా జరిగింది..!

Kareena Kapoor ఇంట‌ర్నెట్ షేక్
Entertainment

Kareena Kapoor ఇంట‌ర్నెట్ షేక్

Bhagyashri Borse: చాలా కాన్ఫిడెంట్ గా
Entertainment

Bhagyashri Borse: చాలా కాన్ఫిడెంట్ గా

Disha Patani: అందాల ఆరబోత!
Entertainment

Disha Patani: అందాల ఆరబోత!

Nidhi Agerwal: వెంకీ సినిమాలో ఛాన్స్
Entertainment

Nidhi Agerwal: సింపుల్‌గా సమాధానం

Next Post
Delhi Election Results: 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ విజయం..!

Delhi Election Results: 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ విజయం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Recent News

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info