ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ(Sanjana Galrani) ‘సోగ్గాడు’ (soggadu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్(Sardar Gabbar Singh) ప్రభాస్(Prabhas)తో బుజ్జిగాడు చిత్రాల్లో నటించి మెప్పించింది. సంజనా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. ఇక కెరీర్ అడపా దడపా చిత్రాలతో కొనసాగుతుండగా.. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే ఈ అమ్మడుకి ఒక బాబు కూడా ఉన్నాడు.
సంజనా సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, సంజనా గల్రానీ సోషల్ మీడియా ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటిస్తూ బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ‘‘కొత్త వెలుగు మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీకు సంతోషాన్ని, శ్రేయస్సును, సమృద్ధిగా విజయాన్ని తీసుకురావాలి. ఈ పండుగ నాకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మా కుటుంబంలోని మా కొత్త సభ్యుడు అతి త్వరలో మాతో చేరాలని మేము ఎదురుచూస్తున్నాము. దయచేసి మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలలో నాపై ఉంచండి. మీలో ప్రతి ఒక్కరికీ బోలెడంత ప్రేమ. ఈ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్నదంతా సాధించండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.