ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Samineni Udaya bhanu :జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉదయభాను

Samineni Udaya bhanu :జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉదయభాను

Oplus_16908288

ADVERTISEMENT

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలని ముందుకు సాగుతున్నారని జనసేన నేత సామినేని ఉదయభాను అన్నారు. తన మీద పవన్ కల్యాణ్ పెట్టిన నమ్మకం నిలబెట్టేలా పని చేస్తానని చెప్పారు. కూటమి పార్టీల నేతల మధ్య ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జన్మోహన్ రెడ్డి తాను పూర్తిగా మారిపోయానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి వచ్చే జగన్ 2.0 వేరుగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల కోసం తాను ఏం చేస్తానో చూపిస్తానని అన్నారు. గతంలో పార్టీ శ్రేణులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని… జగన్ 1.0లో కార్యకర్తలకు గొప్పగా ఏం చేయలేకపోయానని తెలిపారు. జగన్ 2.0పై జనసేన నేత సామినేని ఉదయభాను మాట్లాడారు. జగన్ 2.0 వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జనసేన పార్టీ అధ్వర్యంలో ఈనెల‌16న జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు వస్తారని చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ(సోమవారం) జనసేన నేతలు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఈనెల 16వ తేదీన సమావేశంలో‌ పాల్గొంటారన్నారు. నాగబాబు, నాదెండ్ల ‌మనోహర్, కందుల దుర్గేష్‌లు ఈ సమావేశానికి అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

ప్లీనరీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను తరువాత తాము ఆచరిస్తామన్నారు. ఈ సంసదర్భంగా సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. పంచాయతీ రాజ్ శాఖ పని తీరు ద్వారా దేశంలోనే ఏపీకి గుర్తింపు తెచ్చిన ఘనత పవన్ కల్యాణ్‌దని తెలిపారు. చంద్రబాబు సహకారంతో గతంలో ఎవరూ చేయని విధంగా పనులు చేసి చూపారని అన్నారు. సర్పంచ్‌లకు నిధులు ఇచ్చి వారికి ఒక గౌరవం తెచ్చారన్నారు. గత జగన్ ప్రభుత్వంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పట్టించుకోలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి వారం వారం నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. నేడు సర్పంచ్‌లు అందరూ పవన్ పని తీరుకు అభినందనలు చెబుతున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేనను ప్రజలకు మరింత చేరువ చేస్తామని అన్నారు.చాలామంది వైసీపీ నాయకులు జనసేనలోకి చేరేందుకు వస్తున్నారని తెలిపారు. తనకు ఉన్న అనుభవం, ‌పరిచయాల ద్వారా పార్టీని బలోపేతం చేస్తామన్నారు

తన మీద పవన్ కల్యాణ్ పెట్టిన నమ్మకం నిలబెట్టేలా పని చేస్తానని చెప్పారు. కూటమి పార్టీల నేతల మధ్య ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇద్దరు కలిసి రాష్ట్రం కోసం పని చేస్తున్నారన్నారు. కార్యకర్తల మధ్య అక్కడక్కడ అభిప్రాయ బేధాలు ఉంటే సరి చేస్తామని తెలిపారు. వైసీపీ నుంచి చాలామంది జనసేనలోకి వస్తాం అంటున్నారని చెప్పారు. ఆయా నియోజకవర్గ నాయకులతో మాట్లాడి చేరికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పవన్ కల్యాణ్ చాలా‌ కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి‌ కూడా నిధులు, అనుమతులు రావాల్సిన అంశాలు ఉంటాయన్నారు. అటువంటి కారణాల వల్ల కీలక ఫైల్స్ కొంత ఆలస్యం కావడం సహజమని చెప్పుకొచ్చారు. పవన్ పని తీరును చూసి అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆనాడు ప్రజారాజ్యం కోసం పని చేసిన వారు చాలామంది‌ జనసేనలోకి వచ్చారని గుర్తుచేశారు. చిరంజీవి ఒక వేడుకలో మాట్లాడిన మాటలను వక్రీకరణ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలని ముందుకు సాగుతున్నారన్నారు. కిరణ్ రాయల్ వ్యవహారంపై తమ పార్టీ పరంగా‌ విచారణ జరుగుతుందన్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. తనకు తెలిసి కిరణ్ రాయల్‌పై కుట్రతోనే ఈ అభియోగాలు మోపారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయని సామినేని ఉదయభాను పేర్కొన్నారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sukumar :ఆయన లేకుండా నేను సినిమాలు చేయలేను..!

Next Post

AP : పోలవరం ప్రాజెక్టు – నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమీక్ష

Related Posts

LandScam
Andhra Pradesh

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

Mahanadu2026
Andhra Pradesh

Mahanadu2026:మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన లోకేష్.. గొడ్డలి పార్టీపై చంద్రబాబు ఫైర్

Mahanadu2026
Andhra Pradesh

Mahanadu2026:పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధం.. దేశం ఔరా అనేలా, తెలుగుజాతి మురిసేలా ఘన ఏర్పాట్లు!

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan:రాయలసీమపై పవన్ ఫోకస్.. బాలినేనితో జనసేన కొత్త వ్యూహం

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan:2027 గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. బోటులో ఏర్పాట్లు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Apolitics
Andhra Pradesh

Apolitics::గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ | పూతలపట్టులో సంచలన వ్యాఖ్యలు

Next Post
Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

AP : పోలవరం ప్రాజెక్టు – నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమీక్ష

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PragyaJaiswal

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Recent News

PragyaJaiswal

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info