ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Revanth Reddy | మిరాకిల్ కాదు.. ప్రజల మద్దతే కాంగ్రెస్ శక్తి: సీఎం రేవంత్

Revanth Reddy | మిరాకిల్ కాదు.. ప్రజల మద్దతే కాంగ్రెస్ శక్తి: సీఎం రేవంత్
ADVERTISEMENT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చర్చకు తెర తీశారు. రోటీన్ కు భిన్నంగా ఆయన వ్యవహరించారని చెప్పాలి. సాధారణంగా వేడుకలు.. పర్వదినాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్యమంత్రులు కాస్తంత మృదువుగా మాట్లాడటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఆయన కాస్తంత హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలకు తావు లేదని.. ఎవరి మతానని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలన్నారు.

మత ప్రాదిపదికన దాడులు చేయాలని చూసిన వారిని.. అలాంటి ఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వం అణిచివేసిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ‘ఇతర మతాల్ని కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో అసెంబ్లీలో చట్టం తెస్తాం. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా.. దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించేలా ఉన్న చట్టాలను కూడా సవరిస్తాం. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తాం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ద్వేషించే వారిని సైతం ప్రేమించాలనన ఏసుక్రీస్తు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచిగా పేర్కొన్న సీఎం రేవంత్.. మరో ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని.. అది వారి హక్కుగా పేర్కొన్న రేవంత్.. అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఓవైపు తియ్యగా మాట్లాడుతూనే.. మరోవైపు మత విద్వేషాల్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారికి వార్నింగ్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

మనసు దోచుకునే మాటల్ని చెప్పటం అందరికి సాధ్యం కాదు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి స్వీట్ మాటలు మాట్లాడటం అరుదైన కాంబినేషన్ గా చెప్పాలి. అందరికి కనిపించే అంశాలు.. అవగాహన ఉన్న అంశాల్ని కనెక్టు చేయటం.. దానికి భావోద్వేగాన్ని రంగరించే టాలెంట్ అందరికి ఉండదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టాలెంట్ వేరే లెవల్ అన్నట్లుగా చెప్పాలి. సందర్భానికి అనుగుణంగా కొన్ని అంశాల్ని ప్రస్తావించి.. అందరూ ఇట్టే కనెక్టు అయ్యేలా మాట్లాడటంలో రేవంత్ ముందుంటారు.

తాను పాల్గొనే ఏ సభలో అయినా.. కార్యక్రమంలో అయినా సరే.. పాత విషయాన్ని కొత్తగా.. సరికొత్తగా.. ఎవరూ గమనించని అంశాల్ని అందరూ గమనించేలా.. మాట్లాడేలా చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించటం ద్వారా చాలా మందికి ఇట్టే కనెక్టు అయ్యేలా చేశారు రేవంత్. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించింది.

ఎల్ బీ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన ఆయన.. వాటి పరిష్కారం గురించి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ నోటి నుంచి వచ్చిన మాట క్రైస్తువులను మాత్రమే కాదు.. కాంగ్రెస్ ను అభిమానించి.. ఆరాధించే వారితో పాటు.. తెలంగాణ ప్రజలు సైతం ఇట్టే కనెక్టు అయ్యే మాట చెప్పారు.

డిసెంబరు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్ గా అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన మాటల్లో అర్థాన్ని ఆయన వివరిస్తూ.. ‘‘తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టిన నెల.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదే’’ అని గుర్తు చేశారు. ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2009లో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏకు చోదకశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది కూడా డిసెంబరులోనే. నిజమే.. తెలంగాణకు.. తెలంగాణ ప్రజలకు.. కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు మిరాకిల్ మంత్ అన్న రేవంత్ మాట నూటికి నూరుపాళ్లు నిజమే. ఇలాంటి కనెక్టింగ్ మాటలు రేవంత్ దగ్గర ఎక్కువే.

Tags: #christmas2025#christmasevent#cmspeech#minorityissues#religiousrespect#religioustolerance#revanthreddy#Telangana#TelanganaCM#TelanganaPolitics#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh | గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న మంత్రి నారాయణ మనమడు

Next Post

Andhra Pradesh | జగన్ జన్మదిన వేళ శుభాకాంక్షలతో స్పందించిన వైఎస్ షర్మిల

Related Posts

SouthActress
Entertainment

SouthActress:గ్రేస్ క్వీన్ ఆశికా రంగనాథ్.మెరుపులు.. స్మైల్‌తో హార్ట్‌లు దోచుకున్న బ్యూటీ

APPolitics
Andhra Pradesh

APPolitics:గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్.. వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు

TelanganaCongress
Big Story

TelanganaCongress:SIR అంశంలో నిర్లక్ష్యం వద్దు.. పని చేయని ఇన్‌ఛార్జీలను మార్చేస్తాం: రేవంత్ రెడ్డి

NEETUG2026
Big Story

NEET UG2026:విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన మాఫియాపై కఠిన చర్యలు ఎప్పుడు?

DemocracyInIndia
Big Story

DemocracyInIndia:భారత ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు ఎవరు? వ్యవస్థల వైఫల్యమా, ప్రజల మౌనమా?

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ
Andhra Pradesh

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

Next Post
Andhra Pradesh

Andhra Pradesh | జగన్ జన్మదిన వేళ శుభాకాంక్షలతో స్పందించిన వైఎస్ షర్మిల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SouthActress

SouthActress:గ్రేస్ క్వీన్ ఆశికా రంగనాథ్.మెరుపులు.. స్మైల్‌తో హార్ట్‌లు దోచుకున్న బ్యూటీ

APPolitics

APPolitics:గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్.. వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు

TelanganaCongress

TelanganaCongress:SIR అంశంలో నిర్లక్ష్యం వద్దు.. పని చేయని ఇన్‌ఛార్జీలను మార్చేస్తాం: రేవంత్ రెడ్డి

NEETUG2026

NEET UG2026:విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన మాఫియాపై కఠిన చర్యలు ఎప్పుడు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info