నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు కొడుతుంది. ప్రస్తుతం అమ్మడు అడుగు పెడితే వెయ్యి కోట్ల కలెక్షన్లు రావడం గ్యారంటీ అన్న టాక్ మొదలైంది. కెరీర్ మొదట్లో తను చేసిన సినిమాలు రూ.100కోట్లు వసూలు చేస్తే.. ప్రస్తుతం తాను నటించిన ప్రతి సినిమా వెయ్యి కోట్లు కొల్లగొడుతున్నాయి. దీంతో అమ్మడు నిర్మాతల పాలిట లక్కీ గార్ల్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక మందన్నా పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారింది.`యానిమల్`, `పుష్ప` సినిమాలతో ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక `ఛావా` సక్సెస్ తో రష్మిక ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. శంభాజీ మహారాజ్ భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.
ఎంతో మెచ్యుర్డ్ పెర్పార్మెన్స్ తో నటిగా మరోసారి తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి అమ్మడు ట్రాన్స్ ఫర్మేషన్ చూస్తే తానెంత గొప్ప హీరోయిన్ అన్నది అర్థం అవుతుంది. `యానిమల్` రొమాంటిక్ రోల్..`పుష్ప సినిమాలో మాస్ అప్పియరెన్స్ అంతకు ముందు సినిమాల్లో పాత్రలను పరిశీలిస్తే రష్మిక డే బై డే ఎంత షైన్ అవుతుందో అర్థం అవుతుంది. ఇక ఛావా సినిమాలోని ఏసుబాయి పాత్రతో నటనలో పీక్స్ కు చేరింది. ఈ విషయంలో బాలీవుడ్ నటి అలియాభట్ ని కూడా పక్కకు నెట్టేసిందనే చెప్పుకోవచ్చు. రష్మిక ట్రాన్సపర్మేషన్ , నటన చూస్తుంటే? ఇప్పట్లో అమ్మడికి పోటీగా మరో హీరోయిన్ తయారు కావడం అన్నది అసాధ్యంగానే అనిపిస్తోంది.
బాలీవుడ్ లో అలియాభట్ ని బీట్ చేస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం సాయిపల్లవి వరుస విజయాలతో దూసుకపోతుంది. తన నేచురల్ నటన ఏంటో ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. తను రష్మిక పోటీ ఇస్తుందేమో చూడాలి. ఆమె ప్రస్తుతం`రామాయణం`లో సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత తానెంత గొప్ప నటి అన్నది ప్రూవ్ అవుతుంది. వస్తే పోటీగా సాయి పల్లవి రావాలి? తప్ప మరో హీరోయిన్ కు ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఈలోగా రష్మిక మరిన్ని సినిమాలో పాన్ ఇండియాలో పాతుకుపోవడం ఖాయం.