ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి
ADVERTISEMENT

*ఆధ్యాత్మిక కేంద్రం నుంచి సాంకేతిక ,రక్షణ రంగ కేంద్రంగా మార్పు.*

ఒకప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో వెలుగొందిన పుట్టపర్తి పేరు వినగానే భక్తి, సేవ, మానవతా విలువలు గుర్తుకొచ్చేవి. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో ఈ చిన్న పల్లె(గొల్లపల్లి) అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా (ప్రశాంతి నిలయం) రూపాంతరం చెంది, ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, విదేశీ యాత్రికులు తరలివచ్చే పవిత్ర క్షేత్రంగా నిలిచింది. అయితే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహాసమాధి అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాల ఉత్సాహం కొంత మేర తగ్గిపోవడంతో, ఒకప్పుడు కళకళలాడిన వీధులు నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకున్నాయి. భక్తుల రాక తగ్గడంతో స్థానిక వ్యాపారాల ఊపూ మందగించింది.

అయితే కాలం మళ్లీ పుట్టపర్తి వైపు ఆశాజ్యోతి చూపిస్తోంది. జిల్లా కేంద్ర హోదాతో పరిపాలనా చైతన్యం పెరుగుతుండగా, డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక ఫైటర్ జెట్ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుండటం ఈ నేలకు కొత్త దిశను చూపిస్తోంది. ఆధ్యాత్మికతకు చిరునామాగా వెలిగిన పుట్టపర్తి, ఇకపై సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కూడా కేంద్రబిందువుగా మారబోతోందనే ఆశలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. భక్తి వెలుగులతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ పుణ్యభూమి, రానున్న రోజుల్లో అభివృద్ధి రెక్కలు తొడిగి మరో మహర్దశ వైపు అడుగులు వేయబోతోంది.

భారత రక్షణ రంగ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్న ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి కేంద్రంగా రూపుదిద్దుకోబోతోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సంయుక్తంగా అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ భారీ ప్రాజెక్టు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా, రాయలసీమ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగినదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

16 వేల కోట్ల రూపాయల పెట్టుబడి వేలాది ఉద్యోగాలు.ఈ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA ) ప్రాజెక్టు విలువ సుమారు 15,803 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భారతదేశం స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల సమీకరణ, పరీక్షలు, ధృవీకరణ వంటి కీలక ప్రక్రియలు ఇక్కడే జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా 7,500 మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరోక్షంగా మరో 10వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. లాజిస్టిక్స్ అభివృద్ధి జరుగుతుంది.

భారత వైమానిక, రక్షణ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న బెంగళూరుకు సమీపంలో ఉండటం పుట్టపర్తికి ప్రధాన బలం అయింది. DRDO, ADA వంటి కీలక సంస్థలు బెంగళూరులోనే ఉండటంతో సాంకేతిక సమన్వయం సులభమవుతుందని భావించారు. అంతేకాకుండా, పుట్టపర్తి పరిసరాల్లో విస్తారమైన భూమి, తక్కువ విమాన రద్దీ ఉన్న గగనతలం, ప్రత్యేక ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుకూల వాతావరణం ఉండటం వల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. 

*అనుబంధ పరిశ్రమలకు భారీ అవకాశాలు*

ఒక ఫైటర్ జెట్ తయారీ పరిశ్రమ ఏర్పడటం అంటే కేవలం విమానాల అసెంబ్లింగ్ మాత్రమే కాదు. దానికి అనుబంధంగా వందలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏరోస్పేస్ భాగాల తయారీ. హై ప్రెసిషన్ మెషినింగ్ యూనిట్లు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ తయారీ. రాడార్, సెన్సార్ పరికరాలు. ప్రత్యేక లోహాలు, కంపోజిట్ మెటీరియల్స్ పరిశ్రమలు .

డ్రోన్ టెక్నాలజీ యూనిట్లు.

రక్షణ పరిశోధన ల్యాబ్‌లు.

లాజిస్టిక్స్, గిడ్డంగులు, టెక్ పార్కులు వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశముంది. ఇప్పటికే “డ్రోన్ సిటీ” ఏర్పాటుకు ఎనిమిది కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. 

ఇప్పటివరకు ప్రధానంగా వ్యవసాయం, చిన్న వ్యాపారాలపైనే ఆధారపడ్డ కరవుసీమైన రాయలసీమ ప్రాంతానికి ఇది గేమ్ ఛేంజర్‌గా మారవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారీ పరిశ్రమలు వస్తే రోడ్లు, రైల్వేలు, ఎయిర్ కనెక్టివిటీ అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ వేగవంతం అవుతుంది. ఐటీ, టెక్నికల్ విద్యాసంస్థల విస్తరణ జరుగుతుంది. హోటల్స్, హాస్పిటాలిటీ రంగాల అభివృద్ధి జరుగుతుంది.

యువతకు అధిక వేతన ఉద్యోగాలు లభిస్తాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలను కలుపుతూ రక్షణ తయారీ రంగాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA )ప్రాజెక్టు ప్రారంభం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ తయారీ రంగంలో కీలక హబ్‌గా ఎదిగే అవకాశాలు మరింత బలపడ్డాయి. 

సుమారు లక్ష కోట్ల వరకూ దీర్ఘకాలిక పెట్టుబడులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశముందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. ఫైటర్ జెట్ తయారీతో పాటు, ప్రైవేట్ రక్షణ సంస్థలు, విదేశీ భాగస్వామ్య కంపెనీలు, హైటెక్ తయారీ యూనిట్లు కూడా రాబోయే సంవత్సరాల్లో పుట్టపర్తి చుట్టుపక్కల ఏర్పడే అవకాశముంది. 

రాష్ట్ర విభజన తర్వాత పరిశ్రమల విషయంలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా రాయలసీమకు, ఈ ప్రాజెక్టు కొత్త ఆశలు నింపుతోంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన పుట్టపర్తి ఇకపై దేశ రక్షణ సాంకేతిక రంగానికి కొత్త చిరునామాగా మారబోతుందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ దిశగా చర్యలు మొదలయ్యాయి. జెట్ స్పీడ్ వేగంతో ఈ ప్రాజెక్టులు కార్యరూపంలోకి రావాలని ఆశిద్దాం.

*చందమూరి నరసింహ రెడ్డి.*

*ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.*

*కదిరి.*

Tags: #AerospaceHub#AerospaceIndia#AtmanirbharBharat#DefenceCorridor#DefenceManufacturing#DroneCity#FighterJetProject#MakeInIndia#PrasanthiNilayam#RayalaseemaDevelopment#సత్యసాయిబాబా
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

RashmikaMandanna:కాక్‌టైల్ 2 ఈవెంట్‌లో రష్మిక వైరల్ కామెంట్.. నెటిజన్లు ఫైర్!

Next Post

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Related Posts

ZojilaTunnel
Big Story

ZojilaTunnel:MEIL మరో మైలురాయి.. జోజిలా టన్నెల్‌తో హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,
Entertainment

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #
Big Story

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

#MiddleEast, #Iran, #Israel, #Lebanon, #MiddleEastTensions, #IranIsraelConflict, #BreakingNews, #WorldNews, #InternationalNews, #Geopolitics, #GlobalPolitics, #WarAlert,
Big Story

WorldNews:యుద్ధ అంచుల్లో మధ్యప్రాచ్యం.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలతో ప్రపంచ ఆందోళన

#HyderabadPolice, #Hyderabad, #CPCVAnand, #PoliceChecking, #OYORooms, #Lodges, #GuestHouses, #HotelInspection, #HyderabadAlert, #CitySecurity, #CrimeControl, #TelanganaPolice, #PoliceDrive, #SecurityCheck, #BreakingNews, #HyderabadNews, #TeluguNews, #LawAndOrder, #PublicSafety, #HotelRules, #SpecialDrive, #CCTVMonitoring, #SafetyFirst, #TrendingNews, #LatestNews, #HyderabadCity, #PoliceAction, #TelanganaNews, #SecurityAlert, #OYORoomsCheck
Big Story

TelanganaPolice:సీపీ సజ్జనార్ స్పెషల్ డ్రైవ్.. నగర వ్యాప్తంగా హోటళ్లలో సడెన్ చెకింగ్

#CBSE, #CBSEResults, #EducationSystem, #ExamTransparency, #StudentRights, #EducationalReforms, #CBSEControversy, #TrustInEducation, #AnswerSheetIssue, #EvaluationSystem, #DigitalAudit, #EducationNews, #StudentVoices,
National

CBSE-సీబీఎస్ఈపై విశ్వాస సంక్షోభం? నమ్మకమే పరీక్షలో పడింది.!

Next Post
Telangana

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ZojilaTunnel

ZojilaTunnel:MEIL మరో మైలురాయి.. జోజిలా టన్నెల్‌తో హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

#MiddleEast, #Iran, #Israel, #Lebanon, #MiddleEastTensions, #IranIsraelConflict, #BreakingNews, #WorldNews, #InternationalNews, #Geopolitics, #GlobalPolitics, #WarAlert,

WorldNews:యుద్ధ అంచుల్లో మధ్యప్రాచ్యం.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలతో ప్రపంచ ఆందోళన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info