Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే మధ్య మధ్యలో పలు రాజకీయ కార్యక్రమాలకి హాజరు అవుతున్నారు. ఇటీవల యోగాంధ్ర కార్యక్రమానికి హాజరైన పవన్ రీసెంట్‌గా మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొని ఉజ్వలమైన ప్రసంగం చేశారు. “మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు” అనే ఆశయాన్ని ప్రతిపాదిస్తూ ధర్మం మార్గంలో ముందుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు. వీరవేల్ మురుగన్ పై ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధించవచ్చని చెప్పారు.
అయితే పవన్ కళ్యాణ్ లుక్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య కుంభమేళాకి వెళ్లిన సమయంలో పవన్ లుక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాని కొద్ది రోజుల నుండి పవన్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. పవన్ బరువు కూడా తగ్గడంతో ఆయన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా వైట్ అండ్ వైట్ పంచె, షర్ట్, బ్లాక్ గాగుల్స్ ధరించి విమానం దిగి నడుచుకుంటూ వస్తుండగా, ఆయన స్వాగ్ చూసి పవన్ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఏమున్నాడురా బాబు అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు పవన్ ఇదే సమయంలో ధరించిన చెప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి.
చూడడానికి చాలా స్పెషల్‌గా ఉన్న ఈ చెప్పులు నిక్ కామ్ బ్రాండ్ కు చెందినవి.వీటి ధర రూ. 7 వేలు. ఈ ధర చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఒక స్టార్ హీరో, డిప్యూటీ సీఎం అయిన పవన్ ఈ మాత్రం ధర ఉన్న చెప్పులు ధరించకపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ , సుజీత్ డైరెక్షన్‌లో సఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ నటించిన ‘హరి హర వీరమల్లు’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను జులై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు.