ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Kishkindhapuri Movie Review: ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ

Kishkindhapuri Movie Review: ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ
ADVERTISEMENT

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్- అనుపమ పరమేశ్వరన్- శాండీ- తనికెళ్ల భరణి- సుదర్శన్- హైపర్ ఆది- శ్రీకాంత్ అయ్యంగార్- భద్రమ్- ప్రేమ- మకరంద్ దేశ్ పాండే తదితరులు

 

సంగీతం: చేతన్ భరద్వాజ్

 

ఛాయాగ్రహణం: చిన్మయ్ సలాస్కర్

 

నిర్మాత: సాహు గారపాటి

 

రచన-దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి

 

రాక్షసుడు తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవల ‘భైరవం’ ఎదురు దెబ్బ తిన్నాడు. అతను తొలిసారిగా హార్రర్ నేపథ్యంలో చేసిన ‘కిష్కింధపురి’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి రూపొందించిన ఈ చిత్రం.. ప్రోమోలతో ఆకట్టుకుంది. మరి సినిమా కూడా మెప్పించిందా? శ్రీనివాస్ కు మంచి విజయాన్నందించిందా? తెలుసుకుందాం పదండి.

 

కథ:

 

కిష్కింధపురి అనే ఊరిలో అనే ఊరిలో ప్రేమికులైన రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్).. మైథిలి (అనుపమ పరమేశ్వరన్).. దయ్యాల పట్ల ఆసక్తి ఉన్న వారిని హాంటెడ్ హౌస్ లకు తీసుకెళ్లి ఘోస్ట్ వాకింగ్ టూర్లు నిర్వహిస్తుంటారు. ముందే సిద్ధం చేసుకున్న సెటప్ లతో తమ క్లైంట్లను థ్రిల్ చేస్తుంటారు. ఐతే ఒక సందర్భంలో సువర్ణమాయ అనే మూతపడ్డ రైల్వే స్టేషన్ కు ఒక టీంను తీసుకెళ్లిన ఈ జంటకు అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడికి వెెళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దానికి కారణం అక్కడున్న విశ్రవ పుత్ర (శాండీ) అనే దయ్యం అని తెలుస్తుంది. ఇంతకీ ఆ విశ్రవ పుత్ర కథేంటి.. తనెందుకు దయ్యంగా మారాడు.. మరి ఆ దయ్యం ఆట కట్టించడం రాఘవ్-మైథిలిలకు సాధ్యమైందా లేదా అన్నది మిగతా కథ.

 

కథనం-విశ్లేషణ:

 

హార్రర్ థ్రిల్లర్స్ అనగానే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఒక బృందం.. దయ్యాల పట్ల ఆసక్తితోనో లేదంటే ఏదైనా వేరే పని మీదో ఒక హాంటెడ్ హౌస్ కు వెళ్తారు. అక్కడ నిద్ర పోతున్న దయ్యాన్ని రెచ్చగొట్టి లేపుతారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ బృందంలో ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అప్పుడు ఆ టీంలోని మిగతా వాళ్లు ఆరాలు తీయడం మొదలుపెడితే దయ్యం కథ తెలుస్తుంది. ఆ తర్వాత అష్టకష్టాలు పడి ఆ దయ్యానికి అడ్డు కట్ట వేసి అక్కడ్నుంచి బయటపడతారు. చాలా వరకు ఈ లైన్లోనే ఈ కథలు సాగుతుంటాయి. ఇక్కడ దయ్యం వెనుక నేపథ్యం ఎంత కొత్తగా రాసుకున్నారు.. కథలో ట్విస్టులు ఎంత బాగా పేలాయి.. ప్రేక్షకులను ఎంతగా ఆశ్చర్యపరిచారు అన్న దాన్ని బట్టి ఆ కథ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ మూడు విషయాల్లోనూ ‘కిష్కింధపురి’కి మంచి మార్కులే పడతాయి. దయ్యం బ్యాక్ స్టోరీ సినిమాలో అతి పెద్ద హైలైట్. దీంతో పాటు ఉత్కంఠ రేపే కథనం.. కొన్ని మలుపులు కూడా తోడవడంతో ‘కిష్కింధపురి’ థ్రిల్లింగా మారింది. కొన్ని లోపాలున్నప్పటికీ.. అక్కడక్కడా లాజిక్స్ కొండెక్కేసినప్పటికీ… ఒక హార్రర్ థ్రిల్లర్ నుంచి ఆశించే అంశాలకు ఇందులో లోటు లేదు.

 

హార్రర్ థ్రిల్లర్స్ లో కొన్ని సినిమాలు పూర్తిగా భయపెట్టడం.. థ్రిల్ చేయడం మీద దృష్టిసారిస్తాయి. కొన్ని చిత్రాలు దీన్నుంచి నవ్వులు పంచే ప్రయత్నమూ చేస్తుంటాయి. ‘కిష్కింధపురి’ పూర్తిగా మొదటి కోవలోనే సాగుతుంది. ఏమాత్రం డీవియేషన్ లేకుండా పూర్తిగా ప్రేక్షకులను భయపెట్టడం.. థ్రిల్ చేయడం మీదే ఈ సినిమా ఫోకస్ చేసింది. ఆరంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉండడం వల్ల కథ ఊపందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పైగా హార్రర్ చిత్రాల రొటీన్ ఫార్మాట్ నే ఇది అనుసరించడంతో ఒక దశ వరకు మామూలుగానే అనిపిస్తుంది. హార్రర్ సినిమాల్లో ఎక్కువగా ఆడ దయ్యాలనే చూస్తాం. ఇది కూడా ఆ బాపతులాగే అనిపిస్తుంది. కానీ ప్రేక్షకుల అంచనాకు భిన్నమైన తెరపైకి రావడం ‘కిష్కింధపురి’లో తొలి మలుపు. తమిళ డ్యాన్స్ మాస్టర్ శాండీని ఆ పాత్రకు ఎంచుకోవడం.. తన అవతారం.. స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నీ కూడా ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. ఆ పాత్ర ప్రవేశం నుంచి కథనం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. అక్కడ్నుంచి చివరి వరకు కిష్కింధపురిలో థ్రిల్స్ కు లోటు ఉండదు.

 

ముందే అన్నట్లు ‘కిష్కింధపురి’లో దయ్యం బ్యాక్ స్టోరీనే అతి పెద్ద హైలైట్. ఇందులో దయ్యం కంటే.. శాండీ పాత్ర దయ్యంగా మారడానికి ముందు దాన్ని ప్రెజెంట్ చేసిన తీరే ప్రేక్షకులను ఎక్కువగా భయపడుతుంది. దాదాపు అరగంట సాగే ఆ ఎపిసోడ్ ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. రేడియో స్టేషన్ నేపథ్యం కూడా కొత్తగా అనిపించి ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ముగిసి వర్తమానంలోకి వచ్చాక కూడా కథనం మంచి ఊపుతోనే సాగుతుంది. ఐతే హాంటెడ్ హౌస్ కు వెళ్లిన బృందంలో ముగ్గురు చనిపోయాక.. మిగతా వాళ్ల వ్యవహారం పూర్తిగా వ్యవహారం పక్కకు వెళ్లిపోయి ఫోకస్ అంతా హీరో హీరోయిన్ల మీదికి వెళ్లిపోవడంతో కొంచెం థ్రిల్ తగ్గింది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్సయ్యాయి. పకడ్బందీ బ్యాక్ స్టోరీ తర్వాత దయ్యం పాత్ర ఊహించుకున్నంత బలంగా కనిపించదు. కానీ ‘కిష్కింధపురి’లో ఏ దశలోనూ కథనం నెమ్మదించదు. సన్నివేశాలు రయ్యిన పరిగెడుతూనే ఉంటాయి. చివరి వరకు ట్విస్టులు కొనసాగడం.. థ్రిల్స్ కు లోటు లేకపోవడం.. భారీతనంతో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ హార్రర్ థ్రిల్లర్ అని చెప్పలేం కానీ.. రెండు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి థ్రిల్ చేయడంలో ‘కిష్కింధపురి’ విజయవంతమైంది.

 

నటీనటులు:

 

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్లో తొలి హార్రర్ థ్రిల్లర్లో మెప్పించాడు. ప్రథమార్ధం వరకు అతడి పాత్ర.. నటన మామూలుగానే అనిపిస్తాయి. కానీ ద్వితీయార్ధంలో కీలక సన్నివేశాల్లో అతను ఆకట్టుకున్నాడు. దయ్యం తనలోకి ఆవహించాక వచ్చే సన్నివేశాల్లో శ్రీనివాస్ నటన హైలైట్. తన ఆహార్యం ఈ పాత్రకు బాగా కుదిరింది. అనుపమ పరమేశ్వరన్ కు కూడా బాగా పెర్ఫామ్ చేసే స్కోప్ దొరికింది. దయ్యం ఆవహించినపుడు ఆమె నటన భయపెడుతుంది. ఐతే సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ మాత్రం శాండీనే. అతణ్ని చూస్తే ప్రేక్షకులు వణికిపోయేలా నటించాడు. తన గెటప్ కూడా భలేగా కుదిరింది. ఇదొక భిన్నమైన హార్రర్ థ్రిల్లర్ గా మారడంలో తన పాత్రే కీలకం. సహాయ పాత్రల్లో సుదర్శన్.. హైపర్ ఆది ఓకే అనిపించారు. చిన్న పాత్రలో తనికెళ్ల భరణి ఆకట్టుకున్నారు. ప్రేమ.. శ్రీకాంత్ అయ్యంగార్.. భద్రమ్.. మకరంద్ దేశ్ పాండే.. వారి వారి పాత్రల్లో బాగానే చేశారు.

 

సాంకేతిక వర్గం:

 

హార్రర్ సినిమాల్లో సాంకేతిక విభాగాల పనితీరు ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ విషయంలో ‘కిష్కింధపురి’ టెక్నీషియన్స్ అందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. కెమెరామన్ చిన్మయ్ సలాస్కర్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా బాగా చేశారు. ఇక సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. పాటలు సోసోగా అనిపిస్తాయి. తొలి పాట సినిమాలో అనవసరం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. హార్రర్ సినిమాలకు అవసరమైన సెటప్ అంతా బాగా కుదిరింది. ఇక దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి.. రైటింగ్ దగ్గరే మార్కులు కొట్టేశాడు. రేడియో స్టేషన్ నేపథ్యంలో దయ్యం కథను బలంగా.. కొంచెం కొత్తగా రాసుకున్నాడు. ఆ కథ వరకు టేకింగ్ కూడా బాగుంది. అతను కొంచెం లాజిక్కుల మీద దృష్టిపెట్టాల్సింది. ఆరంభ సన్నివేశాలను ఇంకొంచెం మెరుగ్గా.. భిన్నంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ఓవరాల్ గా తన పనితనానికి మంచి మార్కులే పడతాయి.

 

రేటింగ్ – 3/5

Tags: #AnupamaParameswaran#BellamkondaSreenivas#CinemaReview#FilmReview#Kishkindhapuri#KishkindhapuriMovie#KishkindhapuriReview#NewMovieReview#ShineScreens#telugucinema#TeluguMovies#tollywood#TollywoodMovies#TupakiReviewEntertainmentMoviereview
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nepal: నేపాల్ మంత్రుల జీవితం త‌ల‌కిందులు

Next Post

Andhra Pradesh: నమ్మకమైన నేస్తంగా..!

Related Posts

Adarsha Kutumbam Movie Review
Entertainment

Adarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ కథలో కొత్తదనం ఏదీ?

Peddi Controversy, Janhvi Kapoor, Peddi Movie, Tollywood News, Bollywood News, Women Representation in Cinema, Telugu Cinema News, Movie Controversy, Cinema Industry, Koffee With Karan Season 9, News7Telugu
Entertainment

Peddi Controversy: మహిళల చిత్రీకరణపై జాన్వీ కపూర్ పశ్చాత్తాపం.. అప్పుడే గట్టిగా ప్రశ్నించాల్సిందా?

Preethi Pagadala, Preethi Pagadala 418, 418 Movie, 418 Telugu Movie, Telugu Cinema, Tollywood News, Telugu Actress, Prashanth Neel, Mythri Movie Makers, Kirtan Nadagouda, Horror Thriller, Telugu Movie Updates, Preethi Pagadala Movies, Instagram Influencer, Telugu Entertainment News, Patang Movie, OTT Updates, Tollywood Actress, Telugu Film Industry, News7Telugu
Entertainment

Preethi Pagadala : ప్రీతి పగడాలకు టాలీవుడ్‌లో కొత్త గుర్తింపు.. ‘418’ విజయంతో మరింత క్రేజ్!

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu
Entertainment

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

Comrade Kalyan Review
Entertainment

Comrade Kalyan Review:శ్రీవిష్ణు నవ్వించారా? సినిమా ఎలా ఉంది?

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Next Post

Andhra Pradesh: నమ్మకమైన నేస్తంగా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#TelanganaElectricityBillHike, #TelanganaCurrentBills, #TrueUpCharges, #TGERC, #TGSPDCL, #TGNPDCL, #TelanganaNews, #HyderabadNews, #ElectricityBills, #PowerBillShock, #TelanganaGovernment, #CurrentBillHike, Telangana

Telangana : నవంబర్ నుంచి కరెంట్ బిల్లులకు షాక్.. యూనిట్‌కు 50 పైసలు అదనపు భారం!

#SriSathyaSaiDistrict, #PeacefulElections, #MunicipalElections, #Kadiri, #Puttaparthi, #Hindupur, #Penukonda, #Madakasira, #Dharmavaram, #AndhraPradesh, #APPolitics, #Democracy, #MPTC, #ZPTC, #GramPanchayatElections

Municipal Elections: ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శం కావాలి!

#GyaneshKumarPublicImpeachment, #GyaneshKumar, #RahulGandhi, #MallikarjunKharge, #Congress, #INDIAAlliance, #ElectionCommission, #ChiefElectionCommissioner, #VoteChori, #SIR, #VoterListRevision, #VotingRights, #IndianDemocracy, #ConstitutionOfIndia, #NarendraModi, #AmitShah, #OppositionUnity, #IndianPolitics, #DelhiNews, #ParliamentNews, #PoliticalNews, #BreakingNews, #LatestNews, #TeluguNews

Gyanesh Kumar Public Impeachment: జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. మోదీ, అమిత్ షాకు హెచ్చరిక

#RaptaduSchoolIncident, #RaptaduSchoolAttack, #Raptadu, #Anantapur, #AnantapurNews, #AndhraPradesh, #AndhraPradeshNews, #GirlsSafety, #SchoolSafety, #WomenSafety, #ChildProtection, #StudentSafety, #SocialResponsibility, #Humanity, #YouthAwareness, #EducationSystem, #StopViolence, #JusticeForStudents, #TeluguNews, #BreakingNews

Raptadu School Incident:రాప్తాడు ఘటన సమాజానికి హెచ్చరిక.. బాలికలకు బడిలోనే భద్రత కరువైతే?

Recent News

#TelanganaElectricityBillHike, #TelanganaCurrentBills, #TrueUpCharges, #TGERC, #TGSPDCL, #TGNPDCL, #TelanganaNews, #HyderabadNews, #ElectricityBills, #PowerBillShock, #TelanganaGovernment, #CurrentBillHike, Telangana

Telangana : నవంబర్ నుంచి కరెంట్ బిల్లులకు షాక్.. యూనిట్‌కు 50 పైసలు అదనపు భారం!

#SriSathyaSaiDistrict, #PeacefulElections, #MunicipalElections, #Kadiri, #Puttaparthi, #Hindupur, #Penukonda, #Madakasira, #Dharmavaram, #AndhraPradesh, #APPolitics, #Democracy, #MPTC, #ZPTC, #GramPanchayatElections

Municipal Elections: ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శం కావాలి!

#GyaneshKumarPublicImpeachment, #GyaneshKumar, #RahulGandhi, #MallikarjunKharge, #Congress, #INDIAAlliance, #ElectionCommission, #ChiefElectionCommissioner, #VoteChori, #SIR, #VoterListRevision, #VotingRights, #IndianDemocracy, #ConstitutionOfIndia, #NarendraModi, #AmitShah, #OppositionUnity, #IndianPolitics, #DelhiNews, #ParliamentNews, #PoliticalNews, #BreakingNews, #LatestNews, #TeluguNews

Gyanesh Kumar Public Impeachment: జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. మోదీ, అమిత్ షాకు హెచ్చరిక

#RaptaduSchoolIncident, #RaptaduSchoolAttack, #Raptadu, #Anantapur, #AnantapurNews, #AndhraPradesh, #AndhraPradeshNews, #GirlsSafety, #SchoolSafety, #WomenSafety, #ChildProtection, #StudentSafety, #SocialResponsibility, #Humanity, #YouthAwareness, #EducationSystem, #StopViolence, #JusticeForStudents, #TeluguNews, #BreakingNews

Raptadu School Incident:రాప్తాడు ఘటన సమాజానికి హెచ్చరిక.. బాలికలకు బడిలోనే భద్రత కరువైతే?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info