ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!
ADVERTISEMENT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రాలుగా విడిపోయినా మిగిలిన ఏ విషయంలోనూ విడిపోలేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు మద్రాస్ తో ఆంధ్రులకు ఎలాంటి సంబంధం ఉండేదో అంతకంటే ఎన్నో రెంట్లు ఎక్కువ అనుబంధం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడూ కొనసాగుతోంది! దీంతో.. ఇరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రెండు కుటుంబాలు, అందులోని ఆడపడుచులకు సంబంధించిన ఆసక్తికర చర్చ హాట్ టాపిక్ గా మారింది.

అవును… రాజశేఖర్ కుమార్తె షర్మిల, చంద్రశేఖర్ కుమార్తె కవిత లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి! ఉమ్మడి రాష్ట్ర రాజకీయంలో వైఎస్సార్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు.. తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ లేకుండా ఊహించలేమని కొంతమంది చెబుతారు. అలాంటి ఉద్దండులకు వీరు ముద్దుల కుమార్తెలు!

ఇదే సమయంలో.. వీరిద్దరూ నోరు మాట్లాడటం మొదలుపెడితే.. తమ తండ్రుల గురించే మాట్లాడతారు. వీరిద్దరికీ వారిద్దరే హీరోలు. వీరి రాజకీయ భవిష్యత్తుకు వారే అన్నీ! వారి వారి తండ్రుల పేర్లే వీరి బలాలూ, బలగాలు! కట్ చేస్తే… ఇద్దరికీ వారి వారి అన్నలే విలన్లు! ఇన్ని సమపోలికలు ఉన్న వీరికి రాజకీయంగా ఓ అతిపెద్ద వ్యత్యాసం ఉంది! అదేమిటంటే… తండ్రి హీరో, అన్న విలన్, ఇద్దరి భర్తల పేర్లు అనీల్! ఈ పోలీకల సంగతి పక్కనపెడితే… తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ పాత్రతో పాటు కవిత పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. ఇద్దరూ ఎవరి స్థాయిలో వారు పోరాడారు! తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ప్రజలను జాగృతం చేసిన చరిత్ర కవిత కు ఉంది.

అయితే.. టీఆరెస్స్ (ప్రస్తుత బీఆరెస్స్) అభివృద్ధిలో కవిత కంటే కేటీఆర్ పాత్ర కాస్త ఎక్కువని చెబుతుంటారు! ప్రధానంగా రెండోసారి అధికారంలోకి రావడంలో! అయితే.. పదవుల విషయంలో కవితకు తండ్రి కేసీఆర్ అయినా, అన్న కేటీఆర్ అయినా ఉన్నంతలో మంచి గౌరవమే ఇచ్చారని చెబుతారు. ఆమె ఎంపీగా పనిచేశారు. టర్వాత ఓటమి పాలైతే ఎమ్మెల్సీ ఇచ్చారు! ఉన్నంతంలో ఆమెకు రాజకీయ పదవులు, అధికారిక ప్రోటోకాళ్లు దూరం కాకుండానే చూసుకున్నారు కేసీఆర్, కేటీఆర్ అని చెబుతారు! ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం అయితే బీఆరెస్స్ కు, కేసీఆర్, కేటీఆర్ లకు పెద్ద తలనొప్పులే తెచ్చిపెట్టిందని చెబుతారు!

కట్ చేస్తే… వైసీపీ విజయంలో, జగన్ జైల్లో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి చెల్లెల్లు షర్మిల సుమారు 16నెలలు పార్టీకి చేసిన సేవ గొప్పదనే చెప్పాలి! నాడు ఆమె ఆ స్థాయిలో ధైర్యం చేసి ముందుకు సాగకపోతే.. పార్టీకి పునాదుల సమయంలోనే ఊహించని స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యేవని చెబుతారు! అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు దక్కింది ఏమిటి? వారి వ్యక్తిగత కుటుంబ అస్తుల సంగతి కాసేపు పక్కనపెడితే.. జగన్ ఆమెకు ఎలాంటి పదవులూ ఇవ్వలేదు! అయితే… పదవులన్నీ ఇంట్లో వాళ్లే తీసుకోకూడదని వైసీపీ వాళ్లు సమర్థించుకున్నా… షర్మిలకు ఎలాంటి పదవి ఇచ్చినా అది ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరానికీ అవకాశం ఇవ్వదు! జగనన్న వదిలిన బాణంపై ఆమెకు ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఐడెంటిటీ ఉంది!

దీంతో.. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి, ఇప్పుడు అదే పార్టీకి ఏపీ చీఫ్ గా ఉన్నారు! ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక హస్తం గుర్తు తోనే అని ఆమె ఫిక్సైనట్లు కనిపిస్తున్నారు. తన తండ్రి వైఎస్సార్ – కాంగ్రెస్ పార్టీ.. వేరు వేరు కాదనేది ఆమె మాటగా వినిపిస్తుంటుంది! కవిత మాత్రం తమ నాయకుడు కేసీఆరే అని చెబుతున్నారు! ఇలా పైకి ఇద్దరి పరిస్థితి ఒకటే అన్నట్లుగా పైకి కనిపిస్తున్నా.. ఇద్దరి గతం పూర్తి వైవిద్యం, ప్రస్తుతానికి కనిపిస్తున్న రాజకీయ భవిష్యత్తు విభిన్నం అనే చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ సంగతి అలా ఉంటే… ఇక వీరిద్దరి అన్నల విషయానికొస్తే… వారి వారి రాజకీయాలకు చెల్లెల్లు కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపిస్తున్నారనే చెప్పాలి! ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తున్నారనే అంటారు! 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవ్వడానికి షర్మిల మాత్రమే కారణం కాకపోవచ్చు కానీ… ఆమె కూడా ఒక కారణం అని చెప్పి తీరాలనేది చాలా మంది అభిప్రాయం! పైగా… ఆమె అధికార కూటమి ప్రభుత్వంపై పోరాటం అని చెబుతున్నాప్పటికీ… ప్రధానంగా జగన్ పైనే ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ, వ్యక్తిగత పోరాటం అనేది సుస్పష్టం! ఈ విషయంలో ఆమె ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటారు.. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లొని సమీకరణలు మారేవరకూ! ఇక కవిత విషయానికొస్తే… వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఆమె ఎలాంటి అడ్డు అనేది ఆసక్తికర విషయం! వచ్చే ఎన్నికల్లో బీఆరెస్స్ అధికారంలోకి వస్తే కేసీఆర్ మాత్రమే సీఎం అనేది అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు చెబుతున్నారు. కాకపోతే టాప్ 2 కేటీఆర్ అని అంటున్నారు. ఇక్కడే కవిత కు సమస్య అనే విశ్లేషణలు వినిపిస్తుంటాయి! ఈ నేపథ్యంలోనే… జగన్, కేటీఆర్ ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడుకున్నా.. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడినా.. వారిద్దరూ “అ ఆ” సినిమాలోని … “శత్రువులు ఎక్కడో ఉండరన్నా… చెల్లెళ్ళ రూపంలో ఇంట్లోనే ఉంటారు!” అని చెప్పుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు! ఇది (ప్రస్తుతానికి) వారి విషయంలో అయితే నిజమేనా? లేక, డైలాగ్ రివర్సా..??

Tags: #AndhraPradesh#APpolitics#IndianPolitics#Jagan#Kavitha#KCR#KTR#PoliticalDrama#PoliticalLegacy#PowerAndPolitics#Sharmila#SiblingRivalry#SouthIndiaPolitics#Telangana#TelanganaPolitics#TeluguNews#TeluguPolitics#trs#WomenInPolitics#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Naira Banerjee: అందాల విందు!

Next Post

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Related Posts

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?
Big Story

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?

APPolitics
Andhra Pradesh

APPolitics:వైసీపీ కాదు గొడ్డలి పార్టీ: ఏపీలో స్థానం లేకుండా చేయాలి – మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు

RevanthReddy
Big Story

RevanthReddy:తెలంగాణలో 24 లక్షల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు | Revanth Reddy కీలక నిర్ణయం

IPL2026
Big Story

IPL2026:RCB ఘన విజయం | ముంబైపై 18 పరుగుల తేడాతో సెన్సేషన్

VishnuPriya
Entertainment

VishnuPriya:విష్ణుప్రియ వివాదం పూర్తి వివరాలు | సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ కల్చర్ పై పెద్ద చర్చ

APMinisters
Andhra Pradesh

APMinisters:డిజిటల్ గవర్నెన్స్ దిశగా ఏపీ.. సింగపూర్ లో ట్రైనింగ్‌కు మంత్రులు

Next Post
KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?

APPolitics

APPolitics:వైసీపీ కాదు గొడ్డలి పార్టీ: ఏపీలో స్థానం లేకుండా చేయాలి – మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు

RevanthReddy

RevanthReddy:తెలంగాణలో 24 లక్షల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు | Revanth Reddy కీలక నిర్ణయం

IPL2026

IPL2026:RCB ఘన విజయం | ముంబైపై 18 పరుగుల తేడాతో సెన్సేషన్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info