ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Telangana:మానవత్వం మంటకలిసిన వేళ.. కన్నబిడ్డలున్నా అనాథగా అంతిమయాత్ర!

#Humanity, #HumanValues, #ParentsRespect, #RespectParents, #FamilyValues, #SocialResponsibility, #HumanRelations, #ElderlyCare, #ParentsLove, #HeartBreakingIncident, #Jangaon, #TelanganaNews, #Telangana, #SocialAwareness, #News7Telugu
ADVERTISEMENT
Telangana

మానవత్వం మంటకలిసిన వేళ. కన్నబిడ్డలున్నా అనాథగా అంతిమయాత్ర!

పేగుబంధాలకంటే పైసలే ఎక్కువయ్యాయా? తల్లిదండ్రుల రుణం తీర్చలేని బిడ్డలు.. మానవత్వానికే మాయని మచ్చ!

మానవత్వం మంటకలిసిపోతోంది. పేగుబంధాలు పైసల బంధాలుగా మారిపోతున్నాయి. కనిపెంచిన తల్లిదండ్రులే కడుపున పుట్టిన బిడ్డలకు భారమవుతున్నారు. ఆస్తులు పంచుకునే సమయంలో కావాల్సిన తల్లిదండ్రులు.. చివరి శ్వాస విడిచినప్పుడు మాత్రం ఎందుకు అక్కర్లేకుండా పోతున్నారు? జన్మనిచ్చిన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా మనసు రాని బిడ్డలున్న ఈ సమాజంలో మానవత్వం ఎక్కడ బతికున్నట్లు?

తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో చోటుచేసుకున్న నాగబండి పుష్పనీల (70) మరణ ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. భర్త రామచంద్రం గతంలోనే మరణించగా, అనారోగ్యంతో బాధపడుతున్న పుష్పనీల చివరకు కన్నుమూశారు. ఆమెకు ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. వారిలో ఒకరు ఇప్పటికే మరణించారు. తల్లి మరణవార్తను ఫోన్ ద్వారా తెలియజేసినా కుమారుడు, ఇద్దరు కుమార్తెలు అంత్యక్రియలకు హాజరు కాలేదు. మృతదేహాన్ని చూసేందుకు ఇద్దరు కుమార్తెలు, వారి భర్తలు వచ్చినప్పటికీ అంతిమ సంస్కారాల బాధ్యత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని వార్తా కథనాలు వెల్లడించాయి.

కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు చేతులు రాలేదా?

పేగు తెంచుకుని జన్మనిచ్చిన తల్లి.. కడుపు నింపి పెంచిన తల్లి.. తమ భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ధారపోసిన తల్లి.. చివరకు చనిపోయినప్పుడు ఆమెకు చివరి వీడ్కోలు పలికేందుకు కూడా బిడ్డలకు మనసు రాకపోవడం ఎంతటి దౌర్భాగ్యం! తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారి అవసరాలను పట్టించుకోకుండా, వారు మరణించిన తర్వాత కనీస అంత్యక్రియల బాధ్యత కూడా నిర్వర్తించకపోవడం మానవ సంబంధాల పతనానికి నిదర్శనం.

ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఆస్తి పంపకాల దగ్గర బంధుత్వాలు గుర్తుకొస్తాయి. కానీ తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన సమయంలో మాత్రం బాధ్యతలు గుర్తుకురావా? తల్లిదండ్రుల కష్టార్జితంపై హక్కులు కావాలి.. కానీ వారి చివరి రోజుల్లో బాధ్యతలు వద్దా? ఇదేనా నేటి కుటుంబ విలువలు?

గ్రామస్తులే బిడ్డలయ్యారు.. రక్తసంబంధాలు మాత్రం రాతిబండలయ్యాయి!

కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది మానవత్వంతో స్పందించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హిందూ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కన్నబిడ్డలు చేయాల్సిన కర్మను గ్రామస్తులు చేయడం నిజంగా హృదయవిదారకం. రక్తసంబంధం లేకపోయినా మానవ సంబంధానికి విలువనిచ్చిన గ్రామస్తుల ఔదార్యం అభినందనీయం. అదే సమయంలో కన్నబిడ్డల బాధ్యతారాహిత్యం తీవ్రంగా ఖండించదగినది.

ఈ ఘటన సమాజాన్నికి ఓ ప్రశ్న సంధించింది. ఇలాంటి ఘటనలు మన కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న విలువల సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన పిల్లలు వారిని నిర్లక్ష్యం చేస్తే, సమాజం చూస్తూ ఊరుకోకూడదు.

తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు మాత్రమే కాదు.. బాధ్యతలను కూడా వారసత్వంగా అందించాలి. పిల్లలు కూడా తమను కని పెంచిన తల్లిదండ్రులను చివరి మజిలీ వరకు గౌరవంగా చూసుకోవాలి.

డబ్బు సంపాదించడమే జీవితం కాదు. ఆస్తులు కూడబెట్టడమే అభివృద్ధి కాదు. మనిషిగా బతకడం, మనుషుల మధ్య మానవత్వంతో మెలగడమే నిజమైన సంస్కారం.

గుర్తుంచుకోండి.. ఈరోజు తల్లిదండ్రులను అనాథలుగా వదిలేసే బిడ్డలు, రేపు తమ పిల్లల నుంచి కూడా అదే నిర్లక్ష్యాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. తల్లిదండ్రుల ఆస్తిని పంచుకునే ముందు వారి కన్నీళ్లను పంచుకోండి. వారు బతికున్నప్పుడు సేవ చేయలేకపోతే కనీసం మరణానంతర గౌరవాన్నైనా ఇవ్వండి. కన్నతల్లికి తలకొరివి పెట్టలేని బిడ్డలు ఉన్నత చదువులు చదివినా, ఉన్నత స్థానాలకు ఎదిగినా ప్రయోజనం ఏమిటి?

బిడ్డలుగా పుట్టడం సహజం.. బాధ్యతగల మనుషులుగా బతకడం సంస్కారం!

నరసింహారెడ్డి చందమూరి .
ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.

Tags: #ElderlyCare#FamilyValues#HeartBreakingIncident#Humanity#HumanRelations#HumanValues#Jangaon#news7telugu#ParentsLove#ParentsRespect#RespectParents#SocialAwareness#SocialResponsibility#Telangana#TelanganaNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

TeluguCinema :ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. మనసును తాకే అద్భుతమైన సినిమా!

Related Posts

#AakasamloOkaTara, #AakasamloOkaTaraMovie, #AakasamloOkaTaraReview, #DulquerSalmaan, #SatvikaVeeravalli, #TeluguCinema, #TeluguMovieReview, #MovieReview, #Tollywood, #TeluguMovies, #InspirationalMovie, #WomenEmpowerment, #FamilyEntertainer, #LatestMovieReview, #News7Telugu
Entertainment

TeluguCinema :ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. మనసును తాకే అద్భుతమైన సినిమా!

#NoVoteForMoney, #VoteValue, #SaveDemocracy, #VoterAwareness, #VillageDevelopment, #FreeAndFairElections, #ElectionReforms, #StopVoteBuying, #IndianDemocracy, #VoterRights, #PeoplePower, #PoliticalAwareness, #ChittoorDistrict, #AndhraPradesh, #Palamaneru, #News7Telugu
Andhra Pradesh

AndhraPradesh :ఓటుకు డబ్బు వద్దు.. గ్రామాన్ని గెలిపించండి! ఓటర్లకు కీలక సందేశం

#DimpleHayathi, #BHOGI, #BHOGIMovie, #Sharwanand, #SampathNandi, #DimpleHayathiInterview, #BHOGIPreReleaseEvent, #Tollywood, #TeluguCinema, #TollywoodUpdates, #MovieNews, #TelanganaSlang, #SharwanandFans, #EntertainmentNews, #News7Telugu
Latest

Dimple Hayathi BHOGI Movie: శర్వా హార్డ్‌వర్క్ చూశా.. డింపుల్ హయాతి ఆసక్తికర వ్యాఖ్యలు

Priyanka Gandhi
Big Story

Priyanka Gandhi: యూపీలో బలమైన స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్.. ఎస్పీతో సీట్ల పంచాయితీ

#YSFamilyPropertyDispute, #YSJagan, #YSSharmila, #JaganSharmila, #YelahankaPalace, #YSFamilyDispute, #AndhraPradeshPolitics, #APPolitics, #YSRFamily, #PoliticalNews, #TeluguNews, #News7Telugu
Big Story

YS Sharmila : జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం.. వైఎస్ కుటుంబంలో రాజకీయ ప్రకంపనలు

#TelanganaCongress, #RevanthReddy, #TelanganaPolitics, #CongressParty, #GandhiBhavan, #CongressGovernment, #TelanganaCM, #CongressNews, #KCR, #BRS, #TelanganaAssemblyElections, #CongressLeaders, #TelanganaDevelopment, #FreeBusScheme, #FineRiceScheme, #TelanganaFarmers, #PalamuruRangareddyProject, #News7Telugu
Big Story

Telangana Congress: వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#Humanity, #HumanValues, #ParentsRespect, #RespectParents, #FamilyValues, #SocialResponsibility, #HumanRelations, #ElderlyCare, #ParentsLove, #HeartBreakingIncident, #Jangaon, #TelanganaNews, #Telangana, #SocialAwareness, #News7Telugu

Telangana:మానవత్వం మంటకలిసిన వేళ.. కన్నబిడ్డలున్నా అనాథగా అంతిమయాత్ర!

#AakasamloOkaTara, #AakasamloOkaTaraMovie, #AakasamloOkaTaraReview, #DulquerSalmaan, #SatvikaVeeravalli, #TeluguCinema, #TeluguMovieReview, #MovieReview, #Tollywood, #TeluguMovies, #InspirationalMovie, #WomenEmpowerment, #FamilyEntertainer, #LatestMovieReview, #News7Telugu

TeluguCinema :ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. మనసును తాకే అద్భుతమైన సినిమా!

#NoVoteForMoney, #VoteValue, #SaveDemocracy, #VoterAwareness, #VillageDevelopment, #FreeAndFairElections, #ElectionReforms, #StopVoteBuying, #IndianDemocracy, #VoterRights, #PeoplePower, #PoliticalAwareness, #ChittoorDistrict, #AndhraPradesh, #Palamaneru, #News7Telugu

AndhraPradesh :ఓటుకు డబ్బు వద్దు.. గ్రామాన్ని గెలిపించండి! ఓటర్లకు కీలక సందేశం

#DimpleHayathi, #BHOGI, #BHOGIMovie, #Sharwanand, #SampathNandi, #DimpleHayathiInterview, #BHOGIPreReleaseEvent, #Tollywood, #TeluguCinema, #TollywoodUpdates, #MovieNews, #TelanganaSlang, #SharwanandFans, #EntertainmentNews, #News7Telugu

Dimple Hayathi BHOGI Movie: శర్వా హార్డ్‌వర్క్ చూశా.. డింపుల్ హయాతి ఆసక్తికర వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info