ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan: రైతుల కుటుంబాలలో దీపావళి కాంతులు

Pawan Kalyan:  రైతుల కుటుంబాలలో  దీపావళి కాంతులు
ADVERTISEMENT

ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఒక భారీ హామీని ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే కాకినాడ సీజ్ అవార్డు భూములను తిరిగి రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆయన చెప్పారు. అయితే ఇపుడు ఆ హామీని ఆయన నెరవేర్చుకుని లబ్దిదారులైన రైతుల కుటుంబాలలో ముందే దీపావళి కాంతులు తీసుకుని వచ్చారు.

కాకినాడ సీజ్ భూములు ప్రస్తుతం రైతుల ఆధీనంలో ఉన్నాయి. వారు సాగు చేసుకుంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కాకినాడ సెజ్ పేరు మీదనే ఉంది. దాంతో వారు ప్రభుత్వ పధకాలకు ఏ విధంగానూ అర్హులు కాలేకపోతున్నారు. భూములకు తామే నిజమైన హక్కుదారులమని చెప్పేందుకు ఏ విధమైన డాక్యుమెంట్లు వారి వద్ద లేవు. దాంతో ఆర్థిక సాయం ప్రభుత్వం ఇచ్చినా వారికి దక్కదు, బ్యాంకులను ఆశ్రయించాలని అనుకున్నా వారి చేతిలో పత్రాలు లేకపోవడం వల్ల రుణం కూడా పుట్టే అవకాశాలు లేవు. ఈ విధంగా రెండు దశాబ్దాలుగా రైతులు వందలాదిగా నానా అవస్థలు పడుతున్నారు తమ గోడు వినమని తమ బాధలు తీర్చమని వారంతా ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నాయి. కానీ ఎవరూ తీర్చలేకపోయారు. ఇన్నాళ్లకు వారికి కూటమి ప్రభుత్వం రూపంలో పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నం తో ఎంతో మేలు జరుగుతోంది.

తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధిలోని భూములు అన్నీ రైతులకు డాక్యుమెంట్ల తో సహా అధికార ముద్రతో దఖలు పడనున్నాయి. ఆ విధంగా రెండు వేల 180 ఎకరాల భూమి రైతుల పరం అవుతోంది. ఈ భూములు 1551 మంది రైతులకు తిరిగి పూర్తి రిజిస్ట్రేషన్ తో దక్కబోతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వీరికి కల్పించిన మరో ఊరట ఏమిటి అంటే రిజిస్ట్రేషన్ రుసుములు ఉండవు, అంతే కాదు స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా ఇస్తున్నారు.
ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల రైతులకు ఈ విధంగా భారీ ప్రయోజనం దక్కనుంది. ఇక రైతుల సమస్యను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళడంతో చంద్రబాబు దీనికి ఆమోదముద్ర వేశారు. దాంతో రైతాంగానికి ఎంతో మేలు జరిగింది అని అంటున్నారు ఈ మేరకు తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేయడంతో రైతాంగం ఫుల్ హ్యాపీస్ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కాకినాడ రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన కన్నబాబు వైసీపీ ప్రభుత్వం హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చూశారు. అయినా సరే కాకినాడ సెజ్ రైతుల సమస్య అయితే పరిష్కారం కాలేదని అంటున్నారు. అప్పట్లో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్ర స్థాయిలో మాత్రం రైతులకు ఏ మాత్రం మేలు జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు రైతుల పేరున రిజిస్ట్రేషన్లు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు అని అంటున్నారు. తమ బిడ్డల పెళ్ళిళ్ళకు లేదా చదువులకు ఈ భూములు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని రైతులు వాపోతున్నారు. తమ పేరున భూములు లేవని అందుకే ఈ దుస్థితి అని వారు అంటున్నారు. ఇదే విషయం వారు ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసి చెప్పుకోవడంతో ఆయన వారి సమస్యల మీద చిత్తశుద్ధిని కనబరచారు. ఇపుడు వారికి పూర్తిగా మేలు జరిగింది అని అంటున్నారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Cm ChandraBabu: విశాఖకు గూగుల్

Next Post

Sonam Bajwa: వాటివల్ల ఎన్నో హిట్ సినిమాల్లో ఛాన్స్ వదిలేసుకున్నాను

Related Posts

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam
Andhra Pradesh

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress
Big Story

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee
Big Story

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Jacqueline Fernandez
Entertainment

Jacqueline Fernandez :గ్లామర్ డోస్ పెంచిన జాక్వెలిన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

IPL2026
Big Story

IPL2026:వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి ఔట్

Next Post
Sonam Bajwa: వాటివల్ల ఎన్నో హిట్ సినిమాల్లో ఛాన్స్ వదిలేసుకున్నాను

Sonam Bajwa: వాటివల్ల ఎన్నో హిట్ సినిమాల్లో ఛాన్స్ వదిలేసుకున్నాను

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PragyaJaiswal

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info