ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Syria: హత్యలను కప్పిపుచ్చడం కోసం ప్రభుత్వం ఎం చేసిందంటే..?

Syria: హత్యలను కప్పిపుచ్చడం కోసం ప్రభుత్వం ఎం చేసిందంటే..?
ADVERTISEMENT

బషర్‌ అల్‌ అసద్‌.. సిరియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడినట్టు పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో దారుణం తెరపైకి వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ హత్యలను దాచిపెట్టేందుకు సామూహిక సమాధిని తరలించిందని పేర్కొంది.

అవును… సిరియా అధ్యక్షుడిగా అసద్ ఉన్న సమయంలో జరిగిన హత్యలను దాచిపెట్టేందుకు సుమారు రెండేళ్లపాటు మృతదేహాలను ట్రక్కుల్లో తరలించారని రాయిటర్స్ వెల్లడించింది. మిలిటరీ సహాయంతో ఓ రహస్య ఆపరేషన్‌ నిర్వహించిందని పేర్కొంది. దానికి ‘ఆపరేషన్ మూవ్ ఎర్త్’ అని పేరు పెట్టారని.. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ ఆపరేషన్ వెలుగులోకి వచ్చిందని తెలిపింది.

ఈ సందర్భంగా సిరియాలో అతిపెద్ద సామూహిక సమాధుల్లో ఒకటైన కుతైఫాను తవ్వి.. అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ధుమైర్ పట్టణం వెలుపల ఉన్న ఎడారి ప్రాంతానికి మృతదేహాలను తరలించారని, అక్కడ మరో సామూహిక సమాధిని సృష్టించారని ఆ కథనం వెల్లడించింది. ఈ దారుణాలు 2019 నుంచి 2021 వరకు జరిగాయని పేర్కొంది. ఈ సమయంలో… మృతదేహాలను తరలించడానికి రెండేళ్లుగా జరిగిన ప్రయత్నం గురించి తెలిసిన సుమారు 13 మంది ప్రత్యక్ష సాక్షులతో రాయిటర్స్ మాట్లాడినట్లు తెలిపింది. ఇదే క్రమంలో… సంబంధిత అధికారులు సమర్పించిన పత్రాలను సమీక్షించడంతోపాటు వందలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినట్లు పేర్కొంది. ఈ దారుణాలను అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ప్రభుత్వానికి తెలియజేసింది!

ధుమైర్ ఎడారిలోని ఈ సమాధి 2 కిలోమీటర్ల పొడవుతో కనీసం 34 కందకాలతో సిరియా అంతర్యుద్ధం సమయంలో సృష్టించబడిన అత్యంత విస్తృతమైన సమాధులలో ఒకటి అని రాయిటర్స్ తెలిపింది. ప్రత్యక్ష సాక్షులు, కొత్త స్థలం కొలతలను బట్టి అక్కడ సుమారు పదివేల మందిని ఖననం చేయవచ్చని సూచిస్తున్నాయని రాసుకొచ్చింది! ఫిబ్రవరి 2019 నుండి ఏప్రిల్ 2021 వరకు సుమారు ప్రతి వారంలో నాలుగు రాత్రులు.. మట్టి, మానవ అవశేషాలతో నిండిన ఆరు నుండి ఎనిమిది ట్రక్కులు కుతయ్ఫా నుండి ధుమైర్ ఎడారి ప్రదేశానికి ప్రయాణించాయని ఆపరేషన్‌ లో పాల్గొన్న సాక్షులు తెలిపారని తెలిపిన రాయిటర్స్.. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలు ఈ రహస్య ప్రదేశానికి వచ్చాయో లేదో మాత్రం నిర్ధారించలేకపోయింది!

అసద్ ప్రభుత్వం గురించి ఈ తరహా వార్తలు గతంలోనూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అతడి హయాంలో చేపట్టిన ‘మిషినరీ ఆఫ్‌ డెత్’ ఘోరాల్లో 2013 నుంచి సుమారు లక్ష మందికి పైగా కనిపించకుండా పోయారని, చనిపోయేవరకు వారిని చిత్రవధ చేశారని గతంలో యూఎస్‌ కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్‌ రాప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు అసద్ పాలనలోని అధికారులు సైతం అత్యంత కర్కశంగా వ్యవహరించేవారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… జైల్లోని ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవారట.

Tags: #Assad#BreakingNews#CrisisInSyria#Geopolitics#GlobalCrisis#GlobalNews#HumanRights#InternationalAffairs#InternationalNews#MassGraves#MiddleEast#MoveEarthOperation#PeaceAndJustice#ReutersInvestigation#SyriaConflict#SyriaCrisis#UNReports#WarCrimes#WorldNews#WorldUpdates
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Malika Arora: కొత్త స్టెప్పులు నేర్చుకునేలా..!

Next Post

CM ChandraBabu:మరోసారి పవర్ కోసం

Related Posts

Bhagyashri Borse
Entertainment

Bhagyashri Borse: లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే సందడి.. “గుంటూరు బంగారమ్స్.. మనం హిట్ కొట్టేసాం రా!”

Nara Lokesh
Andhra Pradesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy
Big Story

Revanth Reddy: అమర రాజా, అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ రైజింగ్ 2047కు భారీ ఊపు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

One Nation One Election
Big Story

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

EGovernance
Andhra Pradesh

EGovernance:సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఈ-ఆఫీస్ వ్యవస్థతో సుపరిపాలనకు మరింత వేగం

Telangana
Big Story

Telangana:తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాలు.. ఆదిలాబాద్, మామునూరు అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

Next Post
CM ChandraBabu:మరోసారి పవర్ కోసం

CM ChandraBabu:మరోసారి పవర్ కోసం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Bhagyashri Borse

Bhagyashri Borse: లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే సందడి.. “గుంటూరు బంగారమ్స్.. మనం హిట్ కొట్టేసాం రా!”

Nara Lokesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy: అమర రాజా, అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ రైజింగ్ 2047కు భారీ ఊపు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

One Nation One Election

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info