ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

ChandraBabu: ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌

ChandraBabu:  ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌
ADVERTISEMENT

మ‌హానాడు వేదిక‌గా .. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విశ్వ‌రూపం చూపించారు. రెండో రోజు బుధ‌వారం సాయంత్రం ఆయ‌న పార్టీకి 13వ సారి జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం.. సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగానే.. అనేక కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌ర్నీ వ‌ద‌ల‌బోమ‌ని.. నేర‌స్తుల‌ను క‌ఠినంగా శిక్షించి తీరుతామ‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం అంద‌రికీ తెలిసిందే. వైసీపీ నాయ కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ద్దులు దాటితే శిక్షించి తీరుతామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే.. అంత‌ర్గ‌తంగా చూస్తే మాత్రం మ‌రో కోణం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీలోని సాధార‌ణ నాయ‌కు లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చంద్ర‌బాబు స్థాయి నాయ‌కుడు ఇంత గ‌ట్టి వార్నింగ్ ఇవ్వాల్సిన అవ‌స రం లేదు. పైగా ఇప్ప‌టికే అనేక మంది నాయ‌కులు.. వివిధ కేసుల్లో చిక్కుకుని జైళ్ల‌కు వెళ్లారు. ఈ నేప థ్యంలో ఇప్ప‌టికి ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. చంద్ర‌బాబు అంత సీరియ‌స్ కామెంట్లు చేసే అవ‌కాశం కూడా లేదు. వివిధ కేసుల్లోఉన్న‌వారికి ప్ర‌స్తుతం బెయిళ్లు కూడా రావ‌డం లేదు.

కానీ, చంద్ర‌బాబు వ్యూహం వేరే ఉంది. ఆయ‌న వ్యాఖ్యల వెనుక అంత‌రార్థం కూడా వేరేగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ముగ్గురు నాయ‌కుల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. వీరిలో తొలిపేరు మాజీ సీఎం , వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈయ‌న‌పై ఇప్ప‌టికే మ‌ద్యం కుంభ‌కో ణం కేసు తాలూకు వివాదం ముసురుతోంది. నిజానికి సిట్ చేస్తున్న విచార‌ణ తాలూకు ఫ‌లితంగా జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని తెలిసింది.

ఈ కేసును సిట్ ద్వారా ప‌రిమితం చేస్తే.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేసే వీలుంటుంది. అందుకే.. ఈడీ ద్వారా ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి ఉచ్చు బిగిస్తున్నారు. సో.. బ‌ల‌మైన హెచ్చ‌రిక వెనుక ఇది కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అదేవిధంగా రెండో నాయ‌కుడు.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆది నుంచి ప్ర‌త్య‌ర్థి అయిన పెద్దిరెడ్డిని.. వ‌దిలేది లేద‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, మూడో నాయ‌కుడు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. త‌న ఓట‌మికి స్కెచ్ గీసింది స‌జ్జ‌లేన‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే.. వీరిని దృష్టిలో పెట్టుకునే ఆయ‌న గ‌ట్టి వార్నింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది.ఇంటికి వచ్చా నట్టింటికి వచ్చా అని ఒక పాపులర్ సినిమా డైలాగ్ తెలుగులో ఉంది. అలా వైసీపీ నట్టింటికి మరీ ప్రత్యర్ధి చేసిన గర్జనలు నిజంగానే పొలిటికల్ గా రీసౌండ్ చేశాయి. వైసీపీతో ఢీ కొట్టడం కష్టమని కూటమిని కట్టి టీడీపీ 2024 ఎన్నికలను ఎదుర్కొంది అది ఆనాటి రాజకీయ సన్నివేశం.

ఇపుడు చూస్తే ఏడాదిలో మొత్తం అంతా మారింది అన్నది టీడీపీ పెద్దల భావనగా ఉంది. అందుకే కడపలో ఏకంగా మహానాడు పెట్టి పార్టీ పండుగను అంగరంగ వైభవంగా జరిపారు. అంతే కాదు వైసీపీ ఎక్కడ ఉంది అని చంద్రబాబుతో పాటు అంతా ప్రశ్నించడం విశేషం. ఒక్క కడపలోనే టీడీపీ కూటమికి ఏడు అసెంబ్లీ సీట్లు వచ్చాయని రాయలసీమ మొత్తం మీద వైసీపీకి ఏడు సీట్లు వచ్చాయని చంద్రబాబు తన ముగింపు ఉపన్యాసంతో పొలిక తెస్తూ ఫ్యాన్ రెక్కలు ఊడాయని అన్నారు.

వైసీపీ పని అయిపోయింది అని కూడా అన్నారు. క్యాడర్ అంతా కలసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్ కూడా దొరకదని ఆయన గంభీరంగా చెప్పుకొచ్చారు. వైసీపీ సోదిలో కూడా లేదన్నది మహానాడులో టీడీపీ నాయకుల నుంచి మంత్రుల దాకా అంతా అంటున్న మాట. ఇలా ఎందుకు అంతా అన్నారంటే వైసీపీకి మొదటి నుంచి రాయలసీమనే అన్ని రకాలుగా ఆదుకుంటూ వచ్చింది. 2014లో మెజారిటీ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. 2019లో చూస్తే కేవలం మూడు సీట్లు తప్ప మిగిలిన 49 సీట్లూ వైసీపీ పరం అయ్యాయి కర్నూల్, కడపలలో అయితే స్వీప్ చేసి పారేసింది వైసీపీ.

అలాంటిది గిర్రున అయిదేళ్ళు తిరగకుండానే వైసీపీకి మొత్తం రాయలసీమలో ఏడు సీట్లు వచ్చాయంటే నగుబాటే అని అంటున్నారు. దానికి కారణం ఏమిటో వైసీపీ వారికి అర్థం కాకపోయినా చంద్రబాబు చెప్పుకొచ్చారు, అహంకారానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారని అన్నరు. ఇక వైసీపీకి మళ్ళీ గెలిచే రోజులు లేవని ధీమా వ్యక్తం చేశారు. కడపలో పదికి పది సీట్లూ ఈసారి గెలుచుకుందామని అన్నారు. అంటే జగన్ పులివెందుల సీటు కూడా తమదే అని టీడీపీ చాలా విశ్వాసం వ్యక్తం చేస్తోంది అన్న మాట.

ఇలా కడపలో నిర్వహిచిన మహానాడు టీడీపీకి అతి పెద్ద బూస్టింగ్ ఇచ్చింది అని అంటున్నారు. ఇక చంద్రబాబు తమ ప్రసంగంలో రాయలసీమ డిక్లరేషన్ ని ప్రకటించారు. రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా అన్నారు. రాయలసీమ విషయంలో రెండవ మాట లేదని చెప్పారు. తాను మొదటి నుంచి సీమ పక్షపాతిని అని ఆయన చెప్పుకున్నారు. రాయలసీమలో తాగు నీరు సాగునీరుతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేస్తామని అన్నారు. మొత్తానికి కడపలో టీడీపీ మీటింగ్ ఎందుకు అన్న చర్చ అయితే మొదట్లో వచ్చింది. దానికి మూడు రోజుల మహానాడు గట్టి బదులు ఇచ్చింది అని అంటున్నారు వైసీపీకి ఏ మాత్రం రాజకీయ బలం ఉన్నట్లుగా అనిపించినా దాని పునాదుల మీదనే దెబ్బ పడేలా 140 ఎకరలా సువిశాల స్థలంలో టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ పసుపు పార్టీలో పరవశాన్ని కలుగచేసింది. అదే సమయంలో ఇంతటి పసుపుదనంలో వైసీపీ అడ్రస్ ఎక్కడో వెతుక్కోమని టీడీపీ గట్టి సవాల్ నే విసిరింది. మరి దీనికి ధీటైన సమాధానం వైసీపీ వైపు నుంచి ఇప్పట్లో ఉంటుందా అన్నదే ప్రశ్న.

నారా చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతీయుడు అన్న ప్రశ్న బహుశా ఆయన టోటల్ రాజకీయ జీవితంలో ఎదురుకాలేదు. అలా ఆయన తన రాజకీయాన్ని నిర్మించుకున్నారు అని చెప్పాలి. ఆయన ఒక ప్రాంతానికి ఒక సామాజిక వర్గానికి పరిమితం కాదలుచుకోలేదన్నది ఆయన మార్క్ ఫిలాసఫీగా కూడా చెబుతారు. అది ఆయనకు రాజకీయంగా చాలా సార్లు అడ్వాంటేజ్ అయింది. కొన్ని సార్లు డిస్ అడ్వాంటేజ్ అయింది.

ఇదిలా ఉంటే చంద్రబాబు నిఖార్సు అయిన రాయలసీమ బిడ్డ. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారి పల్లెలో జన్మించారు. అలా బాబును సీమ వాసి గానే చెప్పాలి. అయితే ఆయనకు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటున్న వైఎస్సార్ కుటుంబానికే సీమ బిడ్డ ఇమేజ్ దక్కుతూ వస్తోంది. వైఎస్సార్ ని సీమ జనాలు ఎంతగానో ఆదరించారు. అదే వరుసలో జగన్ ని కూడా సమాదరించారు.

బహుశా ఆ ధైర్యంతోనే జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు అనుకోవాలి. ఏపీలో అతి ప్రధానమైన రీజియన్ గా ఉన్న సీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి. రాజకీయంగా దాంతో రాయలసీమ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైఎస్సార్ రాజకీయ జీవితానికి కూడా సీమ అతి ముఖ్యమైంది. జగన్ కి కూడా అలాగే 2011లో పార్టీ పెట్టిన నాటి నుంచి 2019 దాకా ఏకంగా ఎనిమిదేళ్ళ పాటు ఆదుకుంటూ వచ్చింది.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే సీమ వాసిగా ఆయనా క్లెయిం చేసుకోవాలని పెద్దగా ఆరాటపడలేదు, జనాలు కూడా ఆయన విషయంలో అంతగా ఆలోచించలేదు. ఇక బాబు హయాంలో తెలుగుదేశం సీమలో అద్భుతమైన విజయాలు అయితే నమోదు చేయలేదు. ఎన్టీఆర్ హయాంలో మాత్రం సీమ ఆయన వెన్నంటి ఉంది. కానీ 2024లో తొలిసారి చంద్రబాబు నాయకత్వానికి సీమ పట్టం కట్టింది. అది కూడా అలా ఇలా కాదు బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని అప్పగించింది. సీమ సైతం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడంతోనే జగన్ కి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కి ప్రతిపక్ష హోదాకు కూడా అందకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఎన్నికల ఫలితాలతో ఒక ముఖ్య సందేశం ఉంది అని అంటున్నారు. సీమకు మేలు చేసే విషయంలో సీఎం గా అయిదేళ్ళ పాటు ఉన్నా జగన్ చేసింది పెద్దగా లేదని అంటున్నారు. దాంతోనే బాబు వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఈ గెలుపు వెనక సందేశాన్ని జగన్ గ్రహించారో లేదో కానీ బాబు గ్రహించారు అని అంటున్నారు. అందుకే ఆయన గెలిచిన తరువాత ఫుల్ ఫోకస్ సీఎం మీద పెట్టేశారు. కోస్తాంధ్రాలో మొత్తం 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో వైసీపీకి రాజకీయంగా గట్టి పట్టున్నవి లేవనే చెబుతారు. 2019లో ప్రభంజనం వీచి మాత్రమే వైసీపీ గెలిచింది. ఇక జనసేన తో పొత్తు ఉండడంతో గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా ఉంది. అలాగే వైసీపీకి రాజకీయ బలం ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలు కూడా కూటమి దారిలోకి వచ్చేశాయి. అలా 22 సీట్లు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

ఇక మిగిలింది రాయలసీమలోని 52 సీట్లు. వీటిలో కనుక అత్యధిక శాతం సీట్లను గెలుచుకుంటే వైసీపీని డెడ్ ఈజీగా 2029లో ఓడించవచ్చు అన్నదే బాబు మాస్టర్ ప్లాన్. దాంతోనే ఆయన సీమ కోసం అనేక వరాలు ప్రకటిస్తున్నారు. గతానికి భిన్నంగా సీమ బిడ్డ ఇమేజ్ ని ఆయన సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీమ వాసులు అనేక ప్రయోగాలు చేసి అభివృద్ధికి దూరంగా ఉన్నారని చరిత్ర చెబుతోంది. ఈ నేపధ్యంలో సీమ వాసులలో అభివృద్ధి మీద ఆకాంక్ష పెరుగుతోంది. దానిని సరిగ్గా బాబు ఒడిసిపట్టుకున్నారు. ఈ టెర్మ్ లో బాబు కనుక సీమ ప్రగతి కోసం సరైన ప్రణాళికలతో ముందుకు వచ్చి వాటిలో కొన్ని అయినా అమలు చేస్తే వచ్చే ఎన్నికలు వైసీపీకి అంత సులువు కావని అంటున్నారు మొత్తానికి బాబు సీమ బిడ్డ ఇమేజ్ ని సాధిస్తారా లేక జగన్ కి వైఎస్సార్ వారసుడి ట్యాగ్ తో సీమ జనం అండగా నిలుస్తారా అనంది వచ్చే ఎన్నికల్లో తేలనుంది.

Tags: #AndhraPolitics#AndhraPradesh#AndhraPradeshPolitics#APpolitics#Chandrababu#ChandrababuNaidu#JaganMohanReddy#KadapaMahanadu#PoliticalStrategy#RayalaseemaPolitics#Tdp#TDPMahaanadu#TDPMahanadu#TDPvsYSRCP#TeluguNews#YSRCPDefeat#YSRCPWarning
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ys Jagan: పదే పదే అదేనా..?

Next Post

Kavitha: టార్గెట్ ఎవరు..?

Related Posts

RitikaNayak
Entertainment

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026
Big Story

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp
Andhra Pradesh

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029
Big Story

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?
Big Story

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?

APPolitics
Andhra Pradesh

APPolitics:వైసీపీ కాదు గొడ్డలి పార్టీ: ఏపీలో స్థానం లేకుండా చేయాలి – మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు

Next Post
Kavitha: టార్గెట్ ఎవరు..?

Kavitha: టార్గెట్ ఎవరు..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Recent News

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info