ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AP Politics: క్యూకట్టేలా..!

AP Politics: క్యూకట్టేలా..!
ADVERTISEMENT

ప్రతిపక్ష వైసీపీ రెక్కలూడిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. అవకాశమిస్తే క్యూకట్టేలా ఉన్నారు. వైసీపీ తన వైఖరి వల్లే ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటోంది. ఇటీవల అమరావతిపై సొంత ఛానల్‌లో అక్కసు వెళ్లగక్కడమే అందుకు ఉదాహర ణ. అమరావతి రాజ ధానిపై సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్‌ చేసి వ్యాఖ్య తీవ్ర పరిణామాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు చేసిన పనులు, కొందరు కార్యకర్తలు, అధినేత జగన్‌ వ్యవహార శైలి ఆ పార్టీకి తీవ్ర నష్టం తెచ్చిన సంగతి తెలిసిం దే. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ తుడుచుపెట్టు కుపోయింది. ఇటీవల జరిగిన టీచర్స్‌, పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ ఊసే వినిపించలేదు. దీంతో నేతలతోపాటు, కార్యకర్తలు దిగాలు పడుతున్నారు. దీనికితోడు స్థానిక సంస్థలైన పం చాయతీలు, మునిసి పాలిటీలు, జడ్పీల్లోనూ ఉన్న వైసీపీ ప్రతినిధులు నెమ్మదిగా జారుకుం టున్నా రు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పలువురు జడ్పీటీసీలు, సర్పంచ్‌లు కూటమిలో చేరారు. పిఠాపురంలో వైసీపీ నేత జనసేనలో చేరిపో యారు. తుని మునిసి పాలిటీ టీడీపీ వశమైంది. కొవ్వూరు మునిసిపల్‌ చైర్మన్‌ వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరను న్నారు. నిడదవోలు మునిసిపాలిటీ జనసేనకు దక్కింది. ఇంకా అనేక మంది పార్టీ మారాలని చూస్తున్నా ఇటు ఆమోదం లభించడంలేదు.

ఇటీవల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు ఒక వర్తమానం పంపారు. వైసీపీ నుంచి వచ్చే వారిని ఇష్టానుసారం పార్టీలో చేర్చుకోవద్దని.. ముందు తమకు సమాచారం ఇచ్చి.. ఆమో దం పొందిన తర్వాతే చేర్చుకోవాలని చెప్పడం గమనార్హం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీని వాస్‌ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ల్లో చాలామంది వైసీపీ నేతలు కూటమిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నా రెడ్‌ సిగ్నల్‌ ఉంది. పైగా ఎమ్మెల్యేలకు ఆయా మునిసిపాలి టీలు, స్థానిక సంస్థల్లో అక్రమాలకు పాల్పడి ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్నవారిని చేర్చుకోవ డానికి ఇష్టపడడం లేదు. కొందరు వస్తామన్నా వద్దని చెబుతున్నారు. ఇతరులను లాక్కోవడా నికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. వచ్చే ఏడాది వరకూ స్థానిక సంస్థల ఎన్నిక లకు గడువు ఉంది. కానీ నాలుగేళ్లు పూర్తవ డంతో మునిసిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు, జడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడు తున్నారు. ఎందుకంటే వచ్చే ఫిబ్రవరికి సర్పం చ్‌లకు ఐదేళ్లు నిండిపోతాయి. వచ్చే మార్చి నాటికి మునిసిపల్‌ పాలకవర్గాల గడువూ ముగిసిపోతోంది. 2026 సెప్టెంబరు నాటికి జడ్పీటీసీలకు ఐదేళ్లు పూర్తవుతాయి. ఇంతలో కంగారు ఎందుకనేలా కూటమి నేతలు ఉన్నా రు. ఎక్కువమంది టీడీపీ, జనసేన వైపే మొ గ్గు చూపుతున్నారు. కానీ గ్రీన్‌ సిగ్నల్‌ అంద డం లేదు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచే స్థానిక ఎన్నికల సందడి మొదలు కావచ్చు.

మునిసిపల్‌ పాలకవర్గాలకు 2021 మార్చి 10న ఎన్నికలు జరిగాయి. 18వ తేదీన చాలా ప్ర మాణ స్వీకారాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 18తో పాలకవర్గాలకు నాలుగేళ్లూ నిండిపోయా యి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల లో వైసీపీ అప్రజాస్వామికం, దౌర్జన్యంగా వ్యవ హరించడంతో అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీ పీ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో అధికారం వైసీపీ వశమైంది. మొత్తం 12 మునిసిపాలిటీల్లో అప్పట్లో టీడీపీకి 50 మంది కౌన్సిలర్లు, జన సేనకు 18 మంది, బీజేపీకి 8, కాంగ్రెస్‌కు ఒకటి, వైసీపీకి 319 వచ్చాయి. వీరిలో ఇప్పటికే చాలా మంది పార్టీ మారారు. గ్రామ పంచాయతీలకు 2021 ఫిబ్రవరి 9 నుంచి 21వ తేదీ వరకూ ఎన్నికలు 4 దశల్లో జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీ పీకి 805, టీడీపీ, మిత్రపక్షాలకు 143 సర్పంచ్‌ పదవులు లభించాయి. 805 మందిలో ఇప్పటికే చాలామంది కూటమిలో చేరారు. జడ్పీ ఎన్ని కలకు 2021 ఏప్రిల్‌ ఒకటో తేదీనే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు కేవలం 8వ తేదీనే పోలింగ్‌ జరిగేటట్టు ప్రకటించడం వివాదాస్ప దమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కనీ సం నాలుగు వారాలు గడువుతో ఎన్నికల నోటిఫి కేషన్‌ ఇవ్వాలి. కేవలం ఒకటో తేదీనే నోటిఫికే షన్‌ ఇచ్చి 8న పోలింగ్‌ తేదీ అని చెప్పడంతో ఇబ్బంది అయింది. అయినా వైసీపీ మొండిగా ఎన్నికలు నిర్వహించింది. కోర్టు వివాదాల నేప థ్యంలో 2021 సెప్టెంబరు 19న ఫలితాలు ప్రక టించారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ జడ్పీసీలంతా స్తబ్దుగా ఉన్నారు. జిల్లాలు విడిపోయినా.. జడ్పీ విభజన జరగలేదు. ఇప్పటికే చాలామంది జడ్పీటీసీలు కూటమిలో చేరగా, కొందరు జడ్పీటీసీలు సైలెంట్‌ అయ్యా రు. ప్రస్తుతం కూటమి నేతలతో టచ్‌లో ఉన్నా రు. పార్టీ మారేందుకు సిద్ధమంటున్నారు.

Tags: #AmaravatiCapital#AndhraNews#AndhraPradeshPolitics#APpolitics#ChandrababuNaidu#EastGodavari#JanasenaWave#KommireddySrinivas#LocalBodyElections#MunicipalityElections#pawankalyan#PoliticalAnalysis#PoliticalCrisis#PoliticalSwitch#PoliticalUpdates#SarpanchResignations#Tdp#TDPJSPAlliance#Ysrcp#YSRCPExit#YSRCPFailures#ZPTCElectionsJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Anasuya: గ్లామరస్ లుక్స్..!

Next Post

Allu Arjun: ఎప్పుడూ గర్వపడేలా

Related Posts

AyeshaKhan
Entertainment

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028
Big Story

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Vinayaka Immersion Tragedy
Big Story

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Revanth Reddy Assembly Speech
Big Story

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Tirumala Development
Andhra Pradesh

Tirumala Development: తిరుమల-తిరుపతికి చంద్రబాబు భారీ ప్రణాళికలు.. నెట్‌జీరో నుంచి స్కైవాక్ వరకు కీలక నిర్ణయాలు

Disha Salian Case
Big Story

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Next Post
Allu Arjun: ఎప్పుడూ గర్వపడేలా

Allu Arjun: ఎప్పుడూ గర్వపడేలా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AyeshaKhan

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Vinayaka Immersion Tragedy

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Revanth Reddy Assembly Speech

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Recent News

AyeshaKhan

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Vinayaka Immersion Tragedy

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Revanth Reddy Assembly Speech

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info