ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Anakapalle: అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది మృతి..మరికొందరికి గాయాలు

Anakapalle: అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది మృతి..మరికొందరికి గాయాలు
ADVERTISEMENT

అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన జరిగింది.బాణాసంచా తయారీలో ఉపయోగించే రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. చాలా బాణాసంచా తయారీ కేంద్రాలలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించరు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.బాణాసంచా తయారీ ప్రక్రియ గురించి సరైన శిక్షణ లేని కార్మికులు ప్రమాదాలకు కారణం కావచ్చు. రసాయనాలను ఎలా కలపాలి, వాటిని ఎలా నిల్వ చేయాలి అనే విషయాలపై వారికి తగినంత జ్ఞానం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నాణ్యత లేని లేదా కల్తీ చేసిన ముడి పదార్థాలను ఉపయోగించడం వల్ల రసాయన చర్యలు సరిగా జరగక పేలుళ్లు సంభవించవచ్చు. తయారీలో ఉపయోగించే యంత్రాలు పాతవిగా ఉండటం లేదా వాటికి సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అవి పనిచేసేటప్పుడు నిప్పులు లేదా వేడిని పుట్టించవచ్చు. ఇది ప్రమాదానికి దారితీయవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు వివరిస్తున్నారు.

బాణాసంచా తయారీ కేంద్రాల దగ్గర లేదా లోపల కాగితాలు, చెక్కలు వంటి తేలికగా మండే పదార్థాలు ఉంటే.. చిన్న నిప్పురవ్వ పడినా వెంటనే మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. విద్యుత్ వైరింగ్‌లో సమస్యలు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రసాయనాలు వేడెక్కి పేలే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు.తయారీ, నిల్వ ప్రాంతాలను వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. భవనాలు అగ్ని నిరోధక పదార్థాలతో నిర్మించాలి. సులువుగా బయటకు వెళ్లడానికి తగినన్ని నిష్క్రమణ మార్గాలు ఉండాలి. పనిచేసే ప్రదేశంలో తగినంత స్థలం ఉండాలి. రద్దీగా ఉండకూడదు. విద్యుత్ వైరింగ్, ఇతర పరికరాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పేలుడు పదార్థాలను నిర్వహించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే నియమించాలి. పని చేసే సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించాలి. (అగ్ని నిరోధక దుస్తులు, చేతి తొడుగులు, కళ్లద్దాలు). పేలుడు పదార్థాల తయారీ, నిర్వహణ కోసం నిర్దిష్టమైన, సురక్షితమైన విధానాలను అనుసరించాలి.

అనకాపల్లి జిల్లా(Anakapalle District) కోటవురట్ల మండలం కైలాసపట్నం(Kailashpatnam)లో బాణసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing center)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu)దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి శ్రీమతి అనితతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ‘‘అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది.’’ అనే విషయాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

కాగా అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమింది మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు అప్పికొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దాడి రామలక్ష్మి, దేవర నిర్మల, పురంపాప, గుంపిన వేణుబాబు, శానవెల్లి బాబూరావు, చదలవాడ మనోహర్‌గా గుర్తించారు. వీరంతా కూలి పనికి వచ్చారు. బాధితుల్లో తూర్పుగోదావరి జిల్లకు చెందిన వారి ఎక్కువగా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags: #Anakapalle#AnakapalleFireTragedy#AndhraPradeshNews#BreakingNews#FireAccident#FireAccidentUpdate#FireDisaste#FireMishap#PrayForAnakapalle#PublicSafety#RescueOperations#TragicIncidentr #APNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

PM Modi:భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం

Next Post

RR vs RCB: 4వ విజయంతో పాయింట్ల పట్టికను మార్చేసిన బెంగళూరు..

Related Posts

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam
Andhra Pradesh

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress
Big Story

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee
Big Story

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Jacqueline Fernandez
Entertainment

Jacqueline Fernandez :గ్లామర్ డోస్ పెంచిన జాక్వెలిన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

IPL2026
Big Story

IPL2026:వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి ఔట్

Next Post
RR vs RCB: 4వ విజయంతో పాయింట్ల పట్టికను మార్చేసిన బెంగళూరు..

RR vs RCB: 4వ విజయంతో పాయింట్ల పట్టికను మార్చేసిన బెంగళూరు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PragyaJaiswal

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info