టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కు గత ఏడాది నవంబర్ లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫోటోలు కూడా షేర్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ లో హీరో నాగచైతన్య పెళ్లి.. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో అన్నపూర్ణ స్డూడియోస్ లో జరిగింది.అయితే ఇద్దరు అన్నదమ్ముల పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చైతూ మాత్రమే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2025లో అఖిల్ పెళ్లి ఉంటుందని నాగార్జున ఆ సమయంలో అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తేదీలను అనౌన్స్ చేయలేదు. దీంతో రకరకాల వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.
ఎంగేజ్మెంట్ తర్వాత పలుమార్లు మీడియా కంట పడ్డారు అఖిల్- జైనబ్. చైతూ- శోభిత పెళ్లిలో కనిపించారు. రీసెంట్ గా విదేశాలకు వెళ్తూ ఎయిర్ పోర్టులో తళుక్కుమన్నారు. వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వారిద్దరి పెళ్లి కోసం సమయం ఆసన్నమైందని కొన్ని రోజుల ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కినేని వారసుడి పెళ్లి పనులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అక్కినేని కుటుంబం అధికారికంగా అనౌన్స్ చేయనుందని సమాచారం. జూన్ 6వ తేదీన అఖిల్, జైనబ్ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని వినికిడి. హైదరాబాద్ లోని ఓ ప్యాలెస్ లో గ్రాండ్ గా వారి పెళ్లి జరగనుందని టాక్ వినిపించింది. కానీ అది నిజం కాదట.
అన్నపూర్ణ స్డూడియోస్ లోనే అఖిల్, జైనబ్ వివాహం జరగనుందని సమాచారం. అన్న చైతూ లాగా అఖిల్ కూడా అక్కడే తన తాతయ్య విగ్రహం ఎదురుగా జైనబ్ లో మూడు ముళ్లు వేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారట. జూన్ 8వ తేదీన రాజస్థాన్ లో రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారని టాక్. కాగా, అఖిల్- జైనబ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. జైనబ్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా.. ఆయన, నాగార్జున మంచి ఫ్రెండ్స్ అని సమాచారం. ఆ పరిచయమే అఖిల్, జైనబ్ ను ప్రేమలో పడేలా చేసిందట. ఏదేమైనా ఇప్పుడు అఖిల్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నెలల వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట మళ్ళీ పెళ్లి బాజాలు మోగుతున్నాయి.