సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీయ శరణ్ మొన్నటిదాకా వరుస సినిమాల్లో రాణించారు. ఎలాంటి పాత్ర అయినా సరే శ్రీయ చేయగలదు అనిపించుకుంది. సినిమాలో కీలక పాత్ర అది ఎంత తక్కువ నిడివి ఉన్నా సరే చేసే హీరోయిన్ గా శ్రీయ శరణ్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే పెళ్లి తర్వాత కాస్త దూకుడు తగ్గినా తన కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టదు శ్రీయ శరణ్. అమ్మడు ఈమధ్య తెర మీద కనిపించడం మానేసింది. సౌత్ లో ఛాన్స్ లు తగ్గగా హిందీలో ఛాన్స్ లు అందుకుంటుంది.
2022 లో RRR లో అజయ్ దేవగన్ పక్కన చేసిన శ్రీయ అదే ఇయర్ లో బాలీవుడ్ లో తడ్క, దృశ్యం 2 సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కన్నడలో ఉపేంద్ర తో చేసిన కబ్జా సినిమాలో నటించింది అమ్మడు. అదే ఏడాది మ్యూజిక్ స్కూల్ అంటూ మరో హిందీ సినిమా చేసింది. ఐతే ఇవేవి అమ్మడికి మళ్లీ అవకాశాలు తెచ్చి పెట్టలేదు. ఐతే రీసెంట్ గా సూర్య రెట్రో సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది శ్రీయ శరణ్. అది కూడా అంత క్లిక్ అవ్వలేదు. ఐతే శ్రీయ శరణ్ తాజాగా తేజ సజ్జా చేస్తున్న మిరాయ్ సినిమాలో సర్ ప్రైజ్ చేయనుందని తెలుస్తుంది. తేజా సజ్జా మిరాయ్ లేటెస్ట్ టీజర్ చూసి ఆడియన్స్ అవాక్కవుతున్నారు. హాలీవుడ్ సినిమా రేంజ్ విజువల్స్ తో అదరగొట్టారని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తుంది. ఐతే ఈ సినిమా టీజర్ లో శ్రీయ శరణ్ కనిపించింది.
టీజర్ లో ఆమెను ఉంచారంటే కచ్చితంగా ఆమెది ఇంపార్టెంట్ రోల్ అనే తెలుస్తుంది. తేజా సజ్జా లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. టీజర్ లో విజువల్స్ అదుర్స్ అనిపించగా సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉందనిపిస్తుంది. హనుమాన్ సినిమా తర్వాత తేజా సజ్జా పాన్ ఇండియా లెవెల్ లో చేయబోతున్న సినిమా మిరాయ్. ఈగల్ తో అంచనాలను అందుకోలేకపోయిన కార్తీక్ ఘట్టమనేని ఈసారి మిరాయ్ తో సత్తా చాటనున్నాడు. మిరాయ్ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. తేజా సజ్జా, మంచు మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా ఉంది.