ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది.
ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది.సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది.
ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య గురించి గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.కొన్ని వైబ్‌సైట్స్ ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు కథనాలతో పాటు, అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారంటూ గతంలో ఐశ్వర్య రాయ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్.. చిన్నారిని గౌరవంగా చూడాలని, ఆరోగ్యానికి సంబధించిన తప్పు వార్తలను పబ్లిష్ చేయరాదని మండిపడింది. సంబంధిత కంటెంట్ ను తొలగించాలని గూగుల్, యూట్యూబ్‌తో సహ.. పలు వెబ్‌సైట్‌లకు ఢిల్లీ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికి కొన్ని మీడియాల్లో ఆరాధ్య కంటెంట్ అలాగే ఉంచడంతో మరోసారి బచ్చన్ ఫ్యామిలీ కోర్టు తలుపులు తట్టింది.తన ఆరోగ్యంపై కొన్ని వెబ్సైట్స్ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, తక్షణమే వాటిని తొలగించేలా ఆర్డర్స్ ఇవ్వాలంటూ.. ఆరాధ్య కోర్టుకెక్కింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్ట్ మార్చి 17కు కేసును వాయిదా వేసింది.