వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన సీబీఐ కోర్టు
సునీత పిటిషన్‌ను షరతులతో అనుమతించిన సీబీఐ కోర్టు
సునీత వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు
కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
లోతైన దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తే విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో కోర్టుకు తెలిపిన సీబీఐ
ఈ కేసులో కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆదేశాలను సీబీఐ కోర్టు ఇచ్చింది. మధ్యలో ఆగిపోయిన దర్యాప్తును..కాల్ రికార్డుల వద్ద ఉన్న ఎన్నో అనుమానాలను తీర్చేందుకు దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి దర్యాప్తు వద్దని మొత్తుకున్న నిందితుల ఆశలు నెరవేరలేదు. ఇప్పటి వరకూ దొరికిన వారు చాలని..ఎలాగోలా తప్పించుకోవచ్చని కానీ సూత్రధారులు మాత్రం దొరకకూడదని వారు ప్రయత్నాలు చేశారు. కానీ చట్టాన్ని ఎల్లప్పుడూ తక్కువ అంచనా వేయలేరు. సునీత పోరాటంతో అసలు సూత్రధారులకు గుండెల్లో రైళ్లు పరుగెట్టడం ఖాయమయింది.
సీబీఐ కోర్టు..సీబీఐకి నెల రోజుల గడువు ఇచ్చింది. నిందితుల ఫోన్ కాల్ రికార్డులు, మెసెజుల ఆధారంగా దర్యాప్తును నెలలో పూర్తి చేసి అసలు సూత్రధారులెవరో కనిపెట్టనున్నారు. గతంలో సీబీఐ విచారణ ఆగిపోయే సమయానికి మాజీ సీఎస్ కల్లాం అజేయరెడ్డి .. భయంకరమైన టిప్ సీబీఐ అధికారులకు ఇచ్చారు. వివేకా హత్య గురించి ఉదయం ఆరు గంటలకు బయట ప్రపంచానికి తెలిస్తే.. మొదట భారతికి, ఆ తర్వాత జగన్‌కు తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల మధ్యే తెలిసిందని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహాల సమావేశంలో ఉన్న తమకు జగన్ ఆ విషయం చెప్పారని అజేయకల్లాం సీబీఐకి చెప్పారు. తర్వాత ఆయన మాట మార్చారు. కానీ అప్పటికి ఆయన స్టేట్ మెంట్ రికార్డింగ్ జరిగిపోయింది. కోర్టుకు చేరిపోయింది.
వివేకా హత్య కేసును జగన్ అండ్ గ్యాంగ్ గుండెపోటు..రక్తపు వాంతులుగా నమ్మించాలని చేయని ప్రయత్నాలు లేవు. వివేకా చనిపోయిన విషయాన్ని విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. లోటస్ పాండ్ ప్యాలెస్ ముందు దీనంగా ముఖం పెట్టి గుండెపోటుతో పోయారని చెప్పారు. సాక్షి మీడియాలో అదే ప్రచారం చేశారు. ఆయన బ్యాచ్ అక్కడ సాక్ష్యాలు మాయం చేసింది. గొడ్డలితో నరికినట్లుగా తెలియకుండా కట్లు కట్టారు. పోస్టుమార్టం లేకుండా అంత్యక్రియలకు ప్లాన్ చేశారు. కేసు కూడా వద్దన్నారు. కానీ చివరికి అది భయంకరమైన హత్య అని పోస్టు మార్టం ద్వారా హత్య అని తేలింది. అప్పటి నుంచి చంద్రబాబుపై, టీడీపీపై ఆరోపణలు ప్రారంభించారు. సీఎం అయిన తర్వాత హత్య కేసులో సునీతను,ఆమె భర్తను ఇరికించడానికి ప్లాన్ చేశారు. హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశం ఇవ్వడంతో వారి కుట్రలు పారలేదు.
ప్రస్తుతం దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా లేదు. ప్రభుత్వం వైపు నుంచి సీబీఐకి పూర్తి స్థాయి సహకారం లభిస్తుంది. అందుకే నెల రోజుల్లో నిందితులు . సూత్రధారులు దొరికిపోతారు. అందుకే ఇక నుంచి అసలు సూత్రధారుల హాహాకారాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త కథలతో మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయబోతున్నారు. ఏం చేసినా ఈ నెల రోజులు ఆ నిందితులకు నిద్రలేని రాత్రులు ఉండనున్నాయి. ఆ తర్వాత అసలు సినిమా ప్రారంభమవుతుంది.


















