ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. దీంతో ఈమెకు హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లినప్పటికీ ఈమె మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు.
అల్లు స్నేహారెడ్డిలో భక్తి భావం కాస్త ఎక్కువ అని చెప్పాలి. నిత్యం పూజలు నోములు వ్రతాలు అంటూ పూజలలో నిమగ్నం అవుతూ ఉంటారు. ఇక రథసప్తమి సందర్భంగా ఈమె తన ఇంట్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తోంది. ఇలా ఈ పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో బన్నీ ఫాన్స్ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో భాగంగా ఈమె పసుపు రంగు చీర కట్టుకొని చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించారు. అలాగే తనతో పాటు తన కుమార్తె అర్హ కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు..
అర్హ సైతం ఎంతో సాంప్రదాయబద్ధంగా పట్టు లంగా ధరించి ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక అల్లు స్నేహారెడ్డి నిత్యం తన భర్త కుటుంబం క్షేమం కోసం పూజ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నటించిన పుష్ప 2 సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ సంతోషాన్ని ఈయన అనుభవించలేకపోయారు ఈ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తన భర్త అరెస్ట్ కావడంతో ఏమాత్రం మనశాంతి లేకుండా పోయింది అందుకే కుటుంబక్షేమం కోసం మనశ్శాంతి కోసం అల్లు స్నేహారెడ్డి ఇలా ప్రత్యేకంగా పూజలు చేశారని తెలుస్తోంది.