ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

SLBC Tunnel Collapse : కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

SLBC Tunnel Collapse : కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
ADVERTISEMENT

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద SLBC సొరంగం కూలి 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. గత నెల 22న ఉదయం 8 గంటల ప్రాతంంలో 40 మంది కార్మికులు పని చేసేందుకు లోపలికి వెళ్లగా.. సొరంగం పైకప్పు కూలిపోయింది. మెుత్తం 32 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా.. 8 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు. చిక్కుకున్నవారిలో టన్నెల్ బోర్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభించింది. మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నెల రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు. అధికారులు, సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా.. వారి ఆచూకీ మాత్రం దొరకడం లేదు.

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్, సింగరేణి, హైడ్రా సహా.. దేశంలోని అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. దాదాపు 1000 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగం మెుత్తం పొడవు 14 కి.మీ కాగా.. 13.85 కి.మీ దగ్గర టన్నెల్ పైకప్పు కూలిపోయింది. మట్టి, రాళ్లు, భారీగా పేరుకుపోయిన బురద, సిమెంట్ దిమ్మెలు, నీరు, టీబీఎం శిథిలాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. నిమిషానికి దాదాపుగా 5 వేల లీటర్ల నీరు ఊరుతుండటంతో అందులోని మట్టి గట్టిగా మారింది. టన్నెల్ లోపల మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో సహాయక చర్యలు జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు.

అయితే టన్నెల్ ప్రమాదానికి సంబంధించిన తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 22న సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. లోపల పరిస్థితులు చూస్తేంటే ఎక్కువసేపు వారి బతికి ఉండే అవకాశం లేదని.. దాదాపు 7 నిమిషాల్లోనే అంతా అయిపోయి ఉంటుందని అంటున్నారు. బురద వల్ల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. వారిని బయటకు తీయటం అసాధ్యమని.. ఈ మేరకు నేడు 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై వివరాలు వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సమీక్ష అనంతరం టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం కీలక ప్రకటన చేసే ఛాన్సుంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచినందున మృతదేహాలు కూడా లభించడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

ఇకపై కూలీల అనవాళ్లు గుర్తించటానికి మాత్రమే సహాయ చర్యలు కొనసాగిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పేందుకు నివేదిక రూపొందించినట్టు తెలిసింది.

ర్యాట్‌హోల్‌ మైనర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, సింగరేణి, ఆర్మీ సహా కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి వచ్చిన క్యాడవార్‌ డాగ్స్‌ సాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరుపగా టీబీఎం(టన్నెల్‌ బోర్‌ మెషిన్‌) ఆపరేటర్‌ గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహం లభించింది. మిగిలిన ఏడుగురి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోపాటు నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌, ఎస్పీ, ఎస్‌ఎల్‌బీసీ అధికారులు పాల్గొననున్నారు.

ఘటనలో చిక్కుకున్న వారి కోసం ర్యాట్‌హోల్‌ మైనర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, సింగరేణి, ఆర్మీ సహా కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి వచ్చిన క్యాడవార్‌ డాగ్స్‌ సాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరుపగా టీబీఎం(టన్నెల్‌ బోర్‌ మెషిన్‌) ఆపరేటర్‌ గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహం లభించింది. మిగిలిన ఏడుగురి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోపాటు నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌, ఎస్పీ, ఎస్‌ఎల్‌బీసీ అధికారులు పాల్గొననున్నారు.

ఎనిమిది మంది మృతిచెందినట్టు అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. నెల రోజులుగా మృతదేహాలు బురదలో కూరుకుపోయినందున ఇప్పటికే కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఇదే విషయం నేడు అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మృతదేహాలను గుర్తించి వెలికితీయటానికి మరింత సమయం పట్టనున్నదని, ఇకపై మృతదేహాల కోసం కాకుండా, చనిపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకే తమ చర్యలు కొనసాగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉన్నది.

బాధిత కుటుంబాలు తమవారి కోసం నెల రోజులుగా టన్నెల్‌ వద్దే పడిగాపులు కాస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన అరుదైనది కావడంతో దేశమంతా సొరంగం వైపే చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మృతదేహాలను కూడా ఇవ్వలేమని అధికారులు నివేదించే ఆలోచనతో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందా? లేక మృతదేహాల ఆనవాళ్లు దొరికే వరకు సస్పెన్షన్‌ కొనసాగిస్తుందా? వేచి చూడాల్సిందే.

Tags: #IndiaNews#Irrigation#SearchOperations#SLBC#Srisailam #Revanth#Telangana#TgGovt#TunnelCollapse
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Allu Arjun : దుబాయ్‌లో అల్లు అర్జున్

Next Post

Mahesh Babu: కొత్త లుక్‌ లో మ‌హేష్ బాబు

Related Posts

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP
Andhra Pradesh

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

BRS MLCs Suspension
Big Story

BRS MLCs Suspension: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Next Post
Mahesh Babu: కొత్త లుక్‌ లో మ‌హేష్ బాబు

Mahesh Babu: కొత్త లుక్‌ లో మ‌హేష్ బాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ayurveda Treatment

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Recent News

Ayurveda Treatment

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info