అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్టార్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల. తమ పెళ్లి కారణంగా తాను ఒప్పుకున్న ప్రాజెక్టులకు బ్రేక్ ఇచ్చింది ఈ నటి. ఇక ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న శోభిత, ఎట్టకేలకు తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుంది.
వైవిధ్యమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా ఆమె ఓకే చేసిన ఓ ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ షూటింగ్ సెట్‌లో జాయిన్ అయిన శోభిత చాలా ఎనర్జిటిక్‌గా కనిపించిందని.. ఆమె తన పార్ట్ షూటింగ్‌ను కూడా అంతే ఎనర్జీతో చేస్తున్నట్లు తెలుస్తోంది.
అటు నాగచైతన్య పెళ్లి తర్వాత ‘తండేల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘తండేల్’ నిలిచింది. ఇప్పుడు శోభిత కూడా పెళ్లి తర్వాత తన వర్క్‌ను స్టార్ట్ చేయడంతో అభిమానులు ఆమె నుంచి ఎలాంటి సినిమా రానుందా అని ఆసక్తిగా చూస్తున్నారు