జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి చెందారు. దీంతో పోలీసు శాఖలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా డీసీఆర్బీలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తున్నారు. అయితే చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి చెందారు. దీంతో పోలీసు శాఖలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా డీసీఆర్బీలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తున్నారు. అయితే చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఎస్ఐ శ్వేత జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ఎస్ఐ కొక్కుల శ్వేత సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది.గతంలో పలు స్టేషన్లలో ఎస్ఐగా శ్వేత పనిచేశారు. అయితే కోరుట్ల ఎస్ఐగా పనిచేస్తుండగా సస్పెండ్‌కు గురయ్యారు. ఓ దంపతుల గొడవల్లో తలదూర్చారు. అయితే భార్య ముందే ఎస్ఐ శ్వేత చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ శ్వేతపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో మెుదట్లో శ్వేతను ఏఆర్‌కు అటాచ్ చేశారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.