రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఎన్నికల సంఘమే ఓటు దొంగలను రక్షిస్తోంది
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో కేంద్ర ఎన్నికల సంఘం భాగమైందని ఆయన మండిపడ్డారు.
🔹 రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చూపించిన వివరాల ప్రకారం –
-
కర్ణాటకలో బయట రాష్ట్రాల ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఆరోపించారు.
-
బలంగా ఉన్న కాంగ్రెస్ బూతులలోనే ఎక్కువగా ఓట్లను తొలగించారని తెలిపారు.
-
ఆలంద్ నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు వేలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయని అన్నారు.
-
“గోదా బాయ్” అనే పేరుతోనే 12 ఓట్లు తొలగించారని ఉదాహరణ ఇచ్చారు.
🔹 రాహుల్ గాంధీ ప్రధాన వ్యాఖ్యలు:
-
“నేను చేస్తున్న ఆరోపణలకు 100% ఆధారాలు ఉన్నాయి.”
-
“ఫేక్ లాగిన్ ద్వారా ఓట్లు తొలగించారు.”
-
“కర్ణాటక, మహారాష్ట్ర, యుపి, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరుగుతోంది.”
-
“సీఐడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కానీ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదు.”
-
“ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంస్థలు పనిచేయడం లేదు, అందుకే నేను ప్రజల ముందుకు వస్తున్నాను.”
🔹 ఆయన డిమాండ్:
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ల దొంగల్ని రక్షించకూడదని, వెంటనే కర్ణాటక సీఐడీకి పూర్తి సమాచారం ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు.
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం
ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది .
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.














