ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

ThimmammaMarrimanu:660 ఏళ్ల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమానులో మూడు రోజుల ఉత్సవాలు

ThimmammaMarrimanu
ADVERTISEMENT

తిమ్మమ్మ మర్రిమాను వద్ద జరుగు తిమ్మమ్మ రధోత్సవంకు రండి తరలి రండి

ప్రపంచ రికార్డు పొందిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న తిమ్మమ్మ మర్రిమాను వద్ద అంత్యంత వైభవంగా భారీగా 3రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి . ఈ నెల 15వ తేది శివరాత్రి రోజున రథోత్సవం జరుగుతుంది. శ్రీ సత్య సాయి జిల్లా నంబలపూలకుంట మండలంలోని గూటిబైలు సమీపంలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద పెద్ద ఎత్తున కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు . రథోత్సవ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయండి.

1989 లో బెంగుళూరు కు చెందిన సత్యనారాయణ అయ్యర్ అలియాస్ రిగ్రేట్ అయ్యర్ మెుట్టమెుదట తన కెమెరా లో బంధించి బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన కృషి ఫలితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.

2008 మరియు 2010 మధ్య ఔట్రీచ్ ఎకాలజీ నిర్వహించిన ల్యాండ్‌మార్క్ ట్రీస్ ఆఫ్ ఇండియా సర్వే, దేశవ్యాప్తంగా ఉన్న మర్రి చెట్ల విస్తీర్ణం కొలిచింది . భారతదేశం లోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఏడు మర్రి చెట్ల ఉన్నట్లు గుర్తించారు . వాటిలో తిమ్మమ్మ మర్రిమానును అన్నింటికంటే పెద్దదని వారు ధృవీకరించారు. ఈ చెట్టు ఎనిమిది ఎకరాలలో 6,869 ఊడలతో విస్తరించి ఉందని మరియు 660 పైగా సంవత్సరాల వయస్సు ఉందని స్థానిక అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ మహా వృక్షాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుండి కూడా సందర్శకులు వేలాదిగా వస్తుంటారు.

మర్రిమాను కిందికి వెళ్తే ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ మర్రిఊడ కనిపిస్తుంది. ప్రతీ ఊడ చెట్టు మొదలు గానే అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరితో భూమంతా ఆక్రమించిన మహా వటవృక్షం సందర్శకులకు కనువిందు చేస్తుంది . మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. పార్క్ నిర్మించాలని , ఇంకా ఇతరత్రా అభివృద్ధి పనులు నిర్వహించాలని 27 ఎకరాల భూమిని రైతులనుంచి1997-98లో సేకరించారు . తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు. ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద వివరాలు ఇలా ఉన్నాయి. “తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ వేంకటప్ప, మంగమ్మలకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసుకొన్నట్లు ఇక్కడి వారు చెబుతున్నారు.

విష్ణువు బెరడుగా, బ్రహ్మ దేవుడు వేర్లుగా మరియు శివుడు కొమ్మగా కలిసిన ప్రదేశం అని ఆ తిమ్మమ్మ మరిమాను చెట్టులో ముగ్గురు దేవతలు నివసిస్తున్నారని చెబుతారు. అందుకే ఈ చెట్టును త్రిమూర్తీయం అని చెబుతారు.
సంతానం కోసం ప్రార్థించే జంట ఈ ప్రదేశాన్ని సందర్శించి ‘తిమ్మమ్మ’ను అంకితభావంతో పూజిస్తే, వారికి సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు.

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి.
పుట్టపర్తి, కదిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం , ప్రజాకవి కటారుపల్లి యోగివేమన సమాధి , తిమ్మమ్మ మర్రిమాను , ములకలచెరువు సమీపంలోని సోంపల్లెలో చారిత్రాత్మకమైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం,హార్సిలీ హిల్స్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. నేషనల్ హైవే జంక్షన్ కొక్కంటి నుంచి తిమ్మమ్మ మర్రిమాను వరకు అక్కడి నుంచి కదిరి హైవే వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేయాలి . అలాగే రాయచోటి హైవే నుంచి రెక్కమాను వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేయాలి. కదిరి , తిమ్మమ్మ మర్రిమాను ,కటారుపల్లె వద్ద అన్ని రకాల వసతులతో రిసార్ట్ లను , తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఉన్న 27ఎకరాలలో ఏకోపార్క్ ను నిర్మించాలి . ఈశ్వరమలై కొండలో ట్రెక్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కటారుపల్లె లో థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలి. కదిరి దేవరచెరువు వద్ద పార్క్ నిర్మించి చెరువులో బోటింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు వారి కృషి ఫలించి మంచి అభివృద్ధి జరగాలని ఆశిద్దాం.

Tags: #AndhraTourism#DevotionalVibes#EcoTourism#guinnessworldrecord#HeritageOfAndhra#IncredibleIndia#IndianCulture#Kadiri#Rathotsavam#Rayalaseema#SacredTree#Shivaratri#SpiritualIndia#SriSathyaSaiDistrict#TempleFestival#ThimmammaMarrimanu#VisitAndhra#WorldsLargestTree
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

CMRevanthReddy:కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు

Next Post

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

Related Posts

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP
Andhra Pradesh

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

BRS MLCs Suspension
Big Story

BRS MLCs Suspension: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Next Post
APNews

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?

Ayurveda Treatment

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info