ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

NewParties:రంగంలోకి మూడు కొత్త పార్టీలు… 2029 ఎన్నికలే లక్ష్యం!

NewParties
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో మరోసారి చర్చకు తెరలేపే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అనేక పార్టీలు ఉన్న ఏపీలో, తాజాగా మూడు కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకోబోతున్నాయన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ పార్టీలు 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తమ లక్‌ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా రెండు ధృవాలుగా విభజించబడ్డాయి. అధికార కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పాలన కొనసాగిస్తుండగా, విపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ, జైభీం, జై భారత్ వంటి పార్టీలు ఇప్పటికే రాజకీయంగా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు పార్టీలు రాబోతున్నాయన్న ప్రచారం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఏబీవీ నాయకత్వంలో కొత్త పార్టీ?

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా చురుకైన ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఆయన ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని, భావసారూప్యం ఉన్న వ్యక్తులతో డిస్కషన్లు పెడుతున్నారని తెలుస్తోంది. 2029 ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువచ్చి, వీలైనంత ప్రభావం చూపాలన్నదే ఆయన లక్ష్యమని అంటున్నారు.

విజయసాయిరెడ్డి సైతం పార్టీ దిశగా?

మరోవైపు, మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీపై ఆలోచనలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకనాటి వైసీపీ మిత్రులను ఆయన సంప్రదిస్తున్నారని, అలాగే సీఎం స్థాయిలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన పెద్దలను ఆకట్టుకుని పార్టీ పెట్టాలన్న యోచనలో ఉన్నారని టాక్. వైసీపీలో నంబర్ టూ స్థానంలో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది. అందువల్ల ఏపీ రాజకీయాలపై పూర్తి అవగాహనతో తన పార్టీని ప్రజల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాయలసీమ కేంద్రంగా మరో పార్టీ?

ఇంకో వైపు రాయలసీమ కేంద్రంగా కొత్త పార్టీ ఏర్పాటవుతుందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఉమ్మడి ఆరు జిల్లాలైన గ్రేటర్ రాయలసీమనే లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ ఏర్పాటవుతుందని అంటున్నారు. ప్రధానంగా రెండు పెద్ద పార్టీలపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడమే ఈ పార్టీ వ్యూహమని సమాచారం. ఈ పార్టీ కనుక బలంగా నిలబడితే, అది వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందా? అన్న చర్చ కూడా సాగుతోంది.

డజన్ పార్టీల సీన్…

మొత్తానికి చూస్తే 2029 నాటికి దాదాపు డజన్‌కు పైగా పార్టీలు రంగంలోకి దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త పార్టీల నాయకత్వాలు తమ వ్యక్తిగత ఇమేజ్‌ని ఫణంగా పెట్టి రాజకీయ ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి. తమకు సొంత సామాజిక వర్గాల్లో ఉన్న అసంతృప్తి తమకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. కొంత ప్రభావం చూపగలిగితే, రేపటి రాష్ట్ర రాజకీయాల్లో తమకూ ఓ గుర్తింపు దక్కుతుందన్న ఆశతో ఈ సాహసానికి దిగుతున్నారని సమాచారం.

డివైడ్ అయిన ఏపీ పాలిటిక్స్

అయితే, ప్రస్తుతం ఏపీ రాజకీయం పూర్తిగా కూటమి వర్సెస్ వైసీపీగా విభజించబడిపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. గెలిచే పార్టీలకే ఓట్లు వేయాలన్న ధోరణి కొత్త పార్టీలకు పెద్ద సవాలుగా మారుతోంది. ఒకప్పుడు ఇండిపెండెంట్లు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఎంతో చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్న రాజకీయ వాస్తవం ఇది.

అయినా సరే, కొత్త పార్టీల పుట్టుకను ఏపీ రాజకీయ చైతన్యానికి ప్రతీకగా చూడాలన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో కొత్త ఆలోచనలు, కొత్త శక్తులు రావడం సహజమేనని, చివరికి ఎవరు నిలుస్తారో, ఎవరు కనుమరుగవుతారో 2029 ఎన్నికలే తేల్చనున్నాయన్నది రాజకీయ వర్గాల మాట.

NewParties
Tags: #2029Elections#ABVenkateswaraRao#AndhraPradeshPolitics#NewParties#RayalaseemaParty#VijaySaiReddy
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

IndianDivas:ముంబయిలో మెరిసిన స్టార్ డివాస్… గ్లామర్‌కు కొత్త అర్థం చెప్పిన సెలబ్రిటీ ఈవెంట్

Next Post

Hyderabad:పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య – హుస్సేన్‌సాగర్‌లో విషాదం

Related Posts

Pink Power Run 3.0
Big Story

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews
Big Story

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI
Big Story

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News
Entertainment

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Warangal Development
Big Story

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Next Post
Hyderabad

Hyderabad:పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య – హుస్సేన్‌సాగర్‌లో విషాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pink Power Run 3.0

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info