తెలంగాణ రాజకీయాలలో కవిత రాసిన లేఖ ఒక్కసారిగా పేను సంచలనాలను సృష్టించింది. దీంతో ఒక్కసారిగా కెసిఆర్ కుటుంబంలో కూడా చీలికలు మొదలయ్యాయని ,కవిత కొత్త పార్టీ పెడుతుందనే విధంగా బిజెపి ,కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత 6 పేజీల లేఖ రాయడం పైన బిజెపి ఎంపీ రఘునందన్ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ అటు రాజకీయంగా రాసిందా? లేకపోతే ఆస్తుల పంచాయతీగా రాసిందా? అనే అనుమానం మొదలవుతోంది అంటూ తెలియజేశారు.ఎమ్మెల్సీ కవిత చెప్పిన చెప్పకపోయినా కూడా తెలంగాణలో బిజెపి పార్టీ బలపడిందని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు కూడా మొదలైందనే విధంగా ఎంపీ రఘునందన్ వెల్లడించారు. కవితను బయటకు పంపించడానికి కేటీఆర్ ,హరీష్ ఇద్దరు కూడా మీటింగ్ అయ్యారు అంటూ రఘునందన్ మాట్లాడారు.. తెలంగాణలో కవిత మరో షర్మిల కాబోతోందనే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేశారు ఎంపీ రఘునందన్. ముఖ్యంగా కవిత రాసినటువంటి లేఖ ఆ రోజే కాంగ్రెస్ పార్టీకి చెందిన పేపర్, టీవీలలో విచ్చలవిడిగా వైరల్ గా మారాయి అంటూ ఎద్దేవా చేశారు.
దీన్ని బట్టి చూస్తూ ఉంటే కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ డ్రామా వెనుక మొత్తాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారేమో అన్నట్లుగా పలువురు నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆ లెటర్ బయట పెట్టింది కేసీఆరా? కవితానా అనే సందేహం ఉన్నదంటూ బిజెపి నాయకులకు కూడా ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కవిత లేక తో బిఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ డ్రామా మొదలయ్యిందనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరు కూడా స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది.ఒకప్పుడు బీఆర్ఎస్ అంటే చాలా సిస్టమెటిగ్గా కేసీఆర్ ఏది చెప్తే అది వినేవారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, అనే విధంగా పార్టీ ఉండేది. ఇప్పుడు కూడా నియమనిబంధనలతో పార్టీ ఉంటుంది. కానీ కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లిందో అప్పటినుంచి ఈ నినాదాన్ని వాడుకొని కాంగ్రెస్ తీవ్రమైన విమర్శలు చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించింది. కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు చాలా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ వంటి వ్యక్తులు ఆమెను పార్టీలో సముచిత ఇవ్వకుండా చేస్తున్నారని కవిత ఆరోపణలు చేస్తూ వస్తోంది. అంతేకాదు ఆమె పార్టీకి చేసిన సేవల గురించి ఒక లేఖ రాసింది.
అలాగే రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ ఈ విధంగానే ప్రవర్తిస్తే కాంగ్రెస్ అంటున్న మాటలు నిజమవుతాయని తెలియజేస్తూ వచ్చింది. షర్మిల ఏ విధంగా అన్నకు ఎదుగుతిరిగిందో, తెలంగాణలో కేసీఆర్ కు సొంత బిడ్డ ఎదురు తిరిగింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్లానేనా? కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతే మరో సారి అధికారంలోకి వస్తుందా? వివరాలు చూద్దాం.. బీఆర్ఎస్ పార్టీలో కవితకు మంచి పేరుంది. ఆమె కంటూ సెపరేట్ కేడర్ కూడా ఏర్పాటు చేసుకుంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప ఇంకెవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడారు. కవిత ఏకంగా పార్టీని నిందిస్తూ కేసీఆర్ పై విల్లు ఎక్కు పెట్టింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం టిపిసిసి చీప్ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది.లేదంటే సపరేట్ పార్టీ పెట్టిన కానీ పూర్తి డ్యామేజ్ బీఆర్ఎస్ కే జరుగుతుంది. అలా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు కూడా తగ్గి, అధికారంలోకి రాకుండా చేయాలనేదే కాంగ్రెస్ ప్లాన్. దానిలో భాగంగానే కవితను కాంగ్రెస్ ఆహ్వానించడం లేదంటే ఆమె సపరేట్ పార్టీ పెట్టేలా ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ట్రాప్ లో కవిత పడింది అంటే తప్పకుండా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని రాజకీయం మేధావులు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఈ గొడవ చిలికి చిలికి ఏ విధంగా మారుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.