ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

మధ్య తరగతికి మేలు జరిగే లా ఆదాయ పన్ను సంస్కరణలు..!

మధ్య తరగతికి మేలు జరిగే లా ఆదాయ పన్ను సంస్కరణలు..!
ADVERTISEMENT

కేంద్ర బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. న్యూ ఇన్‌కం ట్యాక్స్ బిల్లు వచ్చే వారంలో పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు.

మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు.మధ్యతరగతి వారికి మేలు జరిగేలా ఆదాయపు పన్ను సంస్కరణలు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఈ సంస్కరణల ద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర మరింత పెరుగుతుంది. ప్రభుత్వం మరియు పన్ను అధికారులు ఈ సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు.

రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీనికి అదనంగా రూ. 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.

అంటే.. క్యాపిటల్ గెయిన్స్ లాంటి ప్రత్యేక ఆదాయాలను మినహాయించి సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే వారు ఎలాంటి పన్ను కట్టాల్సినవసరం లేదు.

వేతన జీవులకైతే, అందుబాటులో ఉన్న రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని కలుపుకుని రూ.12.75 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి ఆదాయపు పన్ను పడదని ప్రభుత్వం చెప్పింది.

ట్యాక్స్ శ్లాబులలోనూ మార్పులు చేశారు. ఎవరు ఎంత పన్ను ప్రయోజనం పొందుతారన్నది బడ్జెట్‌లో వివరించారు.

రూ. 12 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు ఉన్న విధానాలలో రూ. 80 వేల పన్ను చెల్లించాల్సి వచ్చేదని.. కానీ, ఇప్పుడు ట్యాక్స్ రిబేట్ కారణంగా పన్ను చెల్లించాల్సిన అసవరం లేదన్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరం కోసం నిర్మలాసీతారామన్ పన్ను శ్లాబులు ప్రకటించారు.

రూ. 0 – 4 లక్షలు – పన్ను లేదు
రూ. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15 శాతం
రూ. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20 శాతం
రూ. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ. 25 లక్షల పైన 30 శాతం పన్ను

రూ.12 లక్షల ఆదాయం ఉండేవారికి కొత్త పన్ను విధానంలో రూ.80 వేల ప్రయోజనం చేకూరుతుంది. (ప్రస్తుతం ఉన్న రేట్లలో పన్ను చెల్లింపుల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను రేటు జీరోగా మారుతుంది. )

రూ.16 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.50 వేల ప్రయోజనం లభిస్తుంది. (వారికి వర్తించే ఆదాయపు పన్ను రేటు కేవలం 7.5 శాతమే.)

రూ.18 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.70 వేల ప్రయోజనం లభిస్తుంది. (వారికి నిజ ఆదాయపు పన్ను రేటు(ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్) కేవలం 8.8 శాతమే.)

రూ.20 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.90 వేల ప్రయోజనం లభిస్తుంది. (వారికి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 10 శాతమే.)

రూ.25 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.1,10,000 ప్రయోజనం లభిస్తుంది. (వారికి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 13.2 శాతం.)

రూ.50 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.1,10,000 ప్రయోజనం లభిస్తుంది. (వారికి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 21.6 శాతం.)

ఈ ప్రతిపాదనల వల్ల, ప్రత్యక్ష పన్నుల్లో రూ.1 లక్ష కోట్ల రెవెన్యూ వరకు ప్రభుత్వం కోల్పోతుంది.

Tags: #Finance #NirmalaSitaraman #India #IncomeTax #Business#news7telugu
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

యూరిక్ యాసిడ్‌ ఇట్టే తగ్గిపోతుంది.. ఎప్పుడు ఎలా తినాలో తెలుసా?

Next Post

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Related Posts

AP Local Body Elections 2026
Andhra Pradesh

AP Local Body Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?

Nominated Posts
Big Story

Nominated Posts : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం ఎప్పుడు?

Chandrababu Naidu
Andhra Pradesh

Chandrababu Naidu : ‘మీ భూమి–మీ హక్కు’తో రైతుల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Maha Varuna Yagam
Big Story

Maha Varuna Yagam: వర్షాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

NALSAR Students
Big Story

NALSAR Students : సంచలన ప్రశ్న.. న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?

Mahabubabad Crime
Big Story

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Next Post
*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

DC Movie

DC Movie: వామికా గబ్బికి సూపర్ క్రేజ్.. ‘చంద్ర’గా అదరగొట్టిన హీరోయిన్‌కు వరుస భారీ ఆఫర్లు

AP Local Body Elections 2026

AP Local Body Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?

Nominated Posts

Nominated Posts : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం ఎప్పుడు?

Rukmini Vasanth

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Recent News

DC Movie

DC Movie: వామికా గబ్బికి సూపర్ క్రేజ్.. ‘చంద్ర’గా అదరగొట్టిన హీరోయిన్‌కు వరుస భారీ ఆఫర్లు

AP Local Body Elections 2026

AP Local Body Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?

Nominated Posts

Nominated Posts : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం ఎప్పుడు?

Rukmini Vasanth

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info