ఈ భామ పేరును కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్…బ్రిటిష్ – ఇండియన్ అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే అమీ జాక్సన్ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ పిక్ టైంలోనే ఇంగ్లాండ్‌కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపింది.మూడేళ్లు అతనితో లివింగ్ రిలేషన్ కొనసాగించిన అమీ జాక్సన్…పెళ్లికి ముందే అతనితో ఓ బిడ్డను కూడా కనేసింది.కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సహజీవనంలో అభిప్రాయభేదాలు రావడంతో ప్రియుడు జార్జ్‌కు గుడ్ బై చెప్పేసింది. కొంతకాలం సింగిల్‌గా ఉన్న అమీ జాక్సన్ ..మరో వ్యక్తితో రిలేషన్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది.ఎడ్ వెస్ట్‌విక్ అనే బ్రిటిష్ నటుడితో ఈ అమ్మడు రిలేషన్ మెయిన్‌టైన్ చేసింది. మొత్తానికి ఎడ్ వెస్ట్‌విక్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం అమ్మడు రెండోసారి గర్భవతి అయింది. ఈ విషయాన్ని అమీజాక్సన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అమీజాక్సన్ బేబీ బంప్‌తో లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. అయితే అమ్మడు దిగిన బేబీ బంప్‌తో దిగిన ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు అసలు మనిషేనా ఇలా ఎవరైనా ఫొటో షూట్ చేస్తారా అంటూ అమీజాక్సన్‌పై మండిపడుతున్నారు.
https://www.instagram.com/p/DFklbBEoqux/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==