ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉండనున్నాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేయనున్నారు. ఈ విరామం తర్వాత పాఠశాలలు తిరిగి అక్టోబర్ 3న ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు దసరా సెలవులు కొంత భిన్నంగా ఉన్నాయి. వీటికి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉంటాయి. ఈ ప్రత్యేక షెడ్యూల్ మైనారిటీ స్కూళ్ల విద్యార్థులు, సిబ్బందికి వర్తిస్తుంది. అయితే, త్వరలో వీటిలో కొద్దిగా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు మరింత ఎక్కువ రోజులు ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. దసరా సెలవులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు ఉంటాయి. మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలు మూసివేయనున్నారు. ఈ కాలంలో దసరా వేడుకలతో పాటు కుటుంబాలు తమ పిల్లలతో పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు.
తెలంగాణలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ఒక రోజు పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఈ సెలవు దసరా బ్రేక్‌లో భాగం కాదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు ఆ రోజు మూతపడనున్నాయి. అంటే మధ్యలో ఒక రోజు తప్పితే పిల్లల దసరా సెలవులకు మరో రోజు కలిసి రానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీలకు దసరా సెలవులు ఉండటం వల్ల, కుటుంబాలు పర్యటనలు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రణాళికలను ముందుగా సిద్ధం చేసుకోవాలి.ఏపీలో చదివే విద్యార్థులు, తెలంగాణలో చదివే సోదరులు, స్నేహితులు వేర్వేరు తేదీల కారణంగా ఒకే సమయంలో హాలిడేలు పొందకపోవచ్చు. కాబట్టి షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు మార్చుకోవడంతో మీరు మంచి సమయం గడపవచ్చు.