ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Telangana || వందల కోట్ల కథకు కేంద్రమైన DTC… హాట్ టాపిక్ మూడ్ కిషన్

Telangana || వందల కోట్ల కథకు కేంద్రమైన DTC… హాట్ టాపిక్ మూడ్ కిషన్
ADVERTISEMENT

అతడొక సాధారణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ (డీటీసీ). వేతనం నెలకు సుమారు రూ.2 లక్షలు. కానీ, అతని ఆస్తులు మాత్రం అక్షరాలా రూ.350 కోట్లకు పైమాటే. అతని డ్రైవర్‌ వేతనం నెలకు రూ.25 వేలే అయినా.. అతడి ఇల్లు ఓ ఇంద్రభవనమే. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రవాణాశాఖలో డీటీసీగా విధులు నిర్వర్తిస్తున్న మూడ్‌ కిషన్‌నాయక్‌ ఇండ్లపై, అతను గతంలో పనిచేసిన ప్రదేశాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి, నిజామాబాద్‌ కంఠేశ్వర్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. ఏకకాలంలో కిషన్‌కు చెందిన బంధువులు, స్నేహితులు, కారు డ్రైవర్‌ ఇల్లుతో కలిపి 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి భారీ ఎత్తున స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో అధికారికంగా రూ.12.72 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. అయితే, వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.350 కోట్లకు పైనే ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఆర్టీఏ అధికారిని ఏసీబీ సోదాల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై పలువురిని ఏసీబీ ఆరాతీయగా మూడ్‌ కిషన్‌ గురించి తెలిసింది. అతనికి ఓ హోటల్‌లో వాటా మాత్రమే ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. ఆ తర్వాత అతని గురించి లోతుగా అధ్యయనం చేయగా.. రవాణాశాఖలోనే అత్యంగా అవినీతి అనకొండగా పేరుగాంచినట్టు గుర్తించారు. అతని గురించి పూర్తి ఆధారాలు రహస్యంగా సేకరించిన తర్వాత.. మంగళవారం ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న కిషన్‌ నివాసంతోపాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇండ్లను కూడా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నిందితుడు తన సర్వీసు కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడి, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మూడ్‌ కిషన్‌ ఆస్తులపై జరిగిన సోదాల్లో కిలోకు పైగా బంగారం బయటపడింది. బ్యాంకు బ్యాలెన్సు కోటిన్నరకు దగ్గరగా ఉంది. పదుల ఎకరాల్లో వ్యవసాయ భూమి, మరో 10 ఎకరాల వాణిజ్య భూమి, రెండు ప్లాట్లు.. హోటళ్లలో 50 శాతానికి పైగా ఓనర్‌షిప్‌, వ్యాపార సంస్థల్లో వాటాలు, పాలిహౌస్‌లు వెలుగులోకి వచ్చాయి. మూడ్‌ కిషన్‌కు చెందిన స్థిర, చరాస్తులపై ఏసీబీ అధికారులు ఇంకా లోతుగా ఆరా తీస్తున్నారు. బినామీల గురించి కూపీ లాగుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల డాక్యుమెంటెడ్‌ విలువ అధికారికంగా సుమారు రూ.12.72 కోట్లు కాగా.. బహిరంగ మారెట్‌లో రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ)లోని సెక్షన్‌ 13(1)(బీ), 13(2) కింద కేసులు నమోదు చేశారు.

మూడ్‌ కిషన్‌ దగ్గర కొన్నేండ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఇల్లు చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయినట్టు తెలిసింది. ప్రైవేట్‌ డ్రైవర్‌గా.. అతనికి వచ్చే నెల వేతనం కేవలం రూ.25వేలు మాత్రమే. కానీ అతడి ఇల్లు ఓ విల్లాను తలపించింది. అయితే అతడిని కిషన్‌కు బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. డ్రైవర్‌ పేరు మీదనే ఇన్నోవా క్రిస్టా కారు, హోండా సిటీ కారు ఉన్నట్టు గుర్తించారు. ఆఫీసులో డబ్బులు ముట్టుకోకుండా.. వ్యవహారమంతా డ్రైవర్‌తోనే నిర్వహిస్తాడని బాధితులు చెప్తున్నారు. మేడ్చల్‌, మెహదీపట్నంలో విధులు నిర్వర్తించినప్పుడు.. లంచాల కోసం వాహనదారులను పీక్కుతిన్నాడనే ఆరోపణ ఉంది. ఇదిలా ఉండగా, ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే తమ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అలాగే వాట్సాప్‌ 9440446106, ఫేస్‌ బుక్‌ లేదా ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు.

నిజామాబాద్‌లోని లహరి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో 50 శాతం వాటా
నిజామాబాద్‌లోని రాయల్‌ ఓక్‌ ఫర్నిచర్‌ స్పేస్‌లో 3,000 చదరపు గజాల ఓనర్‌షిప్‌
నిజామాబాద్‌లోని అశోక టౌన్‌షిప్‌లో 2 ప్లాట్లు
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి
నిజామాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్‌ ల్యాండ్‌
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ మండల పరిధిలో 4వేల చదరపు అడుగుల పాలిహౌస్‌, షెడ్‌
రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌
1000.4 గ్రాముల బంగారం, ఆభరణాలు
ఒక హోండా సిటీ కారు
ఒక ఇన్నోవా క్రిస్టా కారు

Tags: #ACB#BreakingNews#CorruptionCase#crimenews#Hyderabad#LawAndOrder#PoliticalNews#SrinivasReddy#Telangana#TeluguNews#ViralNewsacbcaseacbdspbreakingtelugudtcdtccasehundredsofcroresinternationalhotelmoodkishan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ap Politics | ఏపీలో కొత్త రాజకీయ ప్రయోగాలు… ఓటర్ల నమ్మకం ఎవరికీ?

Next Post

Shambala Movie Review: | మూవీ రివ్యూ – శంబాల

Related Posts

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:ప్రజ్ఞా జైస్వాల్ హాట్ సమ్మర్ స్టైల్ – బికినీ షూట్‌తో సోషల్ మీడియా షేక్

IPL2026
Big Story

IPL2026:లక్నోపై ఢిల్లీ ఘన విజయం – సమీర్ రిజ్వీ సూపర్ ఇన్నింగ్స్‌తో DC జయభేరి

CrimeNews
Crime

CrimeNews:ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదం – 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య, కట్న వేధింపుల ఆరోపణలు

KeralaElections
Big Story

KeralaElections:ఎర్నాకులంలో సీఎం రేవంత్ రెడ్డి దుమ్మురేపిన ప్రచారం – కేరళలో యూడీఎఫ్ విజయం ఖాయం!

Amaravati
Andhra Pradesh

Amaravati:అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – ఏపీ భవిష్యత్తుకు కొత్త దిశ

ChennaiLoveStory
Entertainment

ChennaiLoveStory:ప్రేమకథకు అద్భుత స్పందన, యూత్‌కు ఫేవరెట్ మూవీ

Next Post
Shambala Movie Review:  | మూవీ రివ్యూ – శంబాల

Shambala Movie Review: | మూవీ రివ్యూ - శంబాల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PragyaJaiswal

PragyaJaiswal:ప్రజ్ఞా జైస్వాల్ హాట్ సమ్మర్ స్టైల్ – బికినీ షూట్‌తో సోషల్ మీడియా షేక్

IPL2026

IPL2026:లక్నోపై ఢిల్లీ ఘన విజయం – సమీర్ రిజ్వీ సూపర్ ఇన్నింగ్స్‌తో DC జయభేరి

CrimeNews

CrimeNews:ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదం – 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య, కట్న వేధింపుల ఆరోపణలు

KeralaElections

KeralaElections:ఎర్నాకులంలో సీఎం రేవంత్ రెడ్డి దుమ్మురేపిన ప్రచారం – కేరళలో యూడీఎఫ్ విజయం ఖాయం!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info