ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు

Crime:జంట హత్యల కుట్ర భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు
ADVERTISEMENT

* ఇద్దరు నిందితులు అరెస్టు
* రూ. 3 లక్షల నగదు, 3 వేటకొడవళ్లు, కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం

* రూ. 23 లక్షల సుఫారీకి మాట్లాడి రూ. 3 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి మిగితా రూ. 20 లక్షలు హత్యల తర్వాత చెల్లించేలా ఒప్పందం

అనంతపురం :

* జంట హత్యలు చేయడం కోసం కారు, 3 వేట కొడవళ్లు, రూ. 3 లక్షలు ముట్టజెప్పుతున్న సమయంలో ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భగ్నం చేసిన పోలీసులు

* జంట హత్యల కుట్రను భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు

* జిల్లా ఎస్పీ ఆదేశాలు… కళ్యాణదుర్గం డీఎస్పీ సూచనలతో వివరాలు వెల్లడించిన రాయదుర్గం సి.ఐ

** అరెస్ట్ నిందితుల వివరాలు :

1) మురారి దామోదర్ గౌడ్, వయస్సు 47 సం., కేరేకొండాపుర (కే.కే.పుర) గ్రామం, మొలకాల్మురు తాలుకా, చిత్రదుర్గం జిల్లా, కర్ణాటక రాష్ట్రము

2) మూడుముళ్ళ మారుతి @ మారుతి రెడ్డి, వయస్సు 30 సంలు, మెచ్చిరి గ్రామం, రాయదుర్గం మండలం.

** నేపథ్యం :

ప్రస్తుతం అరెస్టయిన ఇద్దరిలో ప్రధాన నిందితుడైన మురారి దామోదర్ గౌడ్, మధుసూదన్ గౌడ్ లు అన్నదమ్ములు. వీరికి సుమారు రూ. 12 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. తన అన్న మధుసూదన్ గౌడ్ ను మరియు అతని కొడుకైన భార్గవ్ ను కడతేర్చితే రూ. 12 కోట్ల ఆస్తి తనకే దక్కుతుందని ఆశపడ్డాడు. సదరు ఆస్తి విషయంలో గత కొన్నేళ్లుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో వారం కిందట భార్గవ్ స్వయాన చిన్నాన్న అయిన దామోదర్ గౌడ్ ను స్వగ్రామంలోని వీధుల్లో చెప్పుతో కొట్టాడు. అవమానం ఒకవైపు… ఆస్తి దక్కించుకోవాలనే దురాశ వెరసి మధుసూదన్ గౌడ్ ను, భార్గవ్ ను కడతేర్చాలని భావించాడు.

** రూ. 23 లక్షల సుఫారీ కుదుర్చుకుని… అడ్వాన్సుగా రూ. 3 లక్షలు, మారణాయుధాలు సమకూర్చి

తన అన్న, అన్న కొడుకులను ఎట్టి పరిస్థితుల్లో చంపాలని దామోదర్ గౌడ్ భావించి రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన మారుతీరెడ్డిని సంప్రదించాడు. ఈ మారుతీరెడ్డి గతంలో జరిగిన మెచ్చిరి ఆదికేశవులు హత్య కేసులో నిందితుడు కావడంతో అతనినీ ఆశ్రయించాడు. తండ్రీ, కొడుకులను కిడ్నాప్ చేసి హత్యే చేసేందుకు రూ. 23 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో రూ. 3 లక్షల నగదు అడ్వాన్స్ గా ఇవ్వడంతో పాటు హత్య చేసేందుకు అవసరమైన 3 వేట కొడవళ్లు సమకూర్చేలా మాట్లాడుకున్నారు. మిగితా రూ.20 లక్షలు కడతేర్చాక చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

** రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని… జంట హత్యల కుట్ర భగ్నం చేసి

ఒప్పందం ప్రకారం రూ. 3 లక్షలు నగదు… కడతేర్చేందుకు వినియోగించే 3 వేటకొడవళ్లు మరియు కారులను మారుతీ రెడ్డికి దామోదర్ గౌడ్ ముట్టజెప్పేందుకు మెచ్చిరికి బయలుదేరాడు. ఈ సమాచారంరాయదుర్గం సి.ఐ జయనాయక్ కు రావడంతో జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో తన సిబ్బందితో కలిసి బృందంగా వెళ్లారు. రాయదుర్గం మండలం పల్లేపల్లి గేట్ వద్ద కారు, 3 వేట కొడవళ్లు, రూ. 3 లక్షల నగదును దామోదర్ గౌడ్ మెచ్చిరి మారుతీరెడ్డికి అందజేస్తుండగా ఈ పోలీసు బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జంట హత్యల కుట్రను భగ్నం చేశారు. అంతేకాకుండా వీరి నుండీ 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు.

* జిల్లా ఎస్పీ ప్రశంస : జంట హత్యల కుట్రను చాకచక్యంగా భగ్నం చేసిన రాయదుర్గం సి.ఐ జయనాయక్ మరియు ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు

Tags: #anantapur#crimenews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 Hyderabad : అమెరికన్లే లక్ష్యంగా సైబర్ మోసాలు.. ఎక్కడంటే?

Next Post

బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!

Related Posts

HoneyTrap
Big Story

HoneyTrap:అనంతపురంలో హనీ ట్రాప్ గ్యాంగ్ కలకలం – ‘లేడీ డాన్’ రంగమ్మ అరాచకాలు బట్టబయలు

#BangaloreCrime, #Rajajinagar, #CrimeNews, #LoveTragedy, #ShockingNews, #IndiaCrime, #BreakingNews, #PoliceInvestigation, #CrimeStory, #EmotionalCrime, #SafetyAwareness, #NewsUpdate
Crime

CrimeStory:బెంగుళూరులో షాకింగ్ ఘటన – ప్రేమ పేరుతో కిరాతక హత్య

CrimeNews
Crime

CrimeNews:స్నేహితుల దాడి తర్వాత యువతి ఆత్మహత్య – బర్త్‌డే పార్టీలో ఘోరం

JanaNayagan
Latest

JanaNayagan:జన నాయగన్’ లీక్ కేసులో అరెస్టులు.. సినీ ఇండస్ట్రీ షాక్

CrimeNews
Big Story

CrimeNews:సింగర్ Mangli పై కేసు – పరస్పర ఆరోపణలు, బెదిరింపుల ఫిర్యాదులు, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పూర్తి వివరాలు

CrimeNews
Crime

CrimeNews:ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి విషాదం – 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య, కట్న వేధింపుల ఆరోపణలు

Next Post
బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!

బీజేపీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరిక లాంఛనమేనా!ముహూర్తం ఖరారు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Tollywood

Tollywood:గాయ పడ్డా సింహం ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన Manasa Chowdary

#NitaAmbani, #MukeshAmbani, #LuxuryLifestyle, #AcquaDiCristallo, #RichLifestyle, #ViralNews, #LuxuryWater, #AmbaniFamily, #HighLife, #CostliestWater, #TrendingNow, #IndiaRichest, #Reliance, #LuxuryLiving, #SocialMediaBuzz

Nita Ambani:₹50 లక్షల నీటి బాటిల్! అంబానీ కుటుంబ రాయల్ లైఫ్ స్టైల్‌పై ప్రపంచం ఆశ్చర్యం

GoogleAIHub

GoogleAIHub:విశాఖలో గూగుల్ క్లౌడ్ AI హబ్ శంకుస్థాపన – రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌కు టెక్ భవిష్యత్

RevanthReddy

RevanthReddy:తెలంగాణలో మహిళల భద్రతకు భారీ అడుగు – స్పందన టీమ్‌ల ప్రారంభం | సీఎం Revanth Reddy కీలక ప్రకటన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info