ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Borugadda Anil: ఇప్పట్లో కష్టమే?

Borugadda Anil: ఇప్పట్లో కష్టమే?
ADVERTISEMENT

వైసీపీ అధికారంలో ఉండగా, బూతులతో చెలరేగిపోయిన ఆ పార్టీ సానుభూతిపరుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆయనపై నమోదైన కేసులలో వరుసగా బెయిల్ వస్తున్నా, అతడు జైలు నుంచి బయటకు రాకుండా కొత్త కేసులతో మళ్లీ జైలుకు పంపుతున్నారు. దీంతో దాదాపు ఆరు నెలలుగా బోరుగడ్డ జైలులోనే ఉండాల్సివస్తోంది. ఈ నెల 19 సోమవారం నాటికి ఆయనపై నమోదైన సోషల్ మీడియా కేసులు అన్నింటికీ బెయిల్ లభించి జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్ అయినా, గుంటూరు జిల్లాలో ఓ కేసు వెలుగుచూడటంతో మళ్లీ అరెస్టు అయ్యాడు. దీంతో కోర్టు మరో 14 రోజులు రిమాండ్ విధించింది.

గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా బోరుగడ్డ అనిల్ చెలరేగిపోయాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుర్భాషలు ఆడిన ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. వైసీపీతో బోరుగడ్డకు నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా, తాను మాజీ సీఎం జగన్ కు వీరాభిమానిగా బోరుగడ్డ చెప్పుకుంటూ హల్‌చల్ సృష్టించేవాడు. అంతేకాకుండా వైసీపీ ముఖ్య నేతలతో అనుబంధం ఏర్పరుచుకోవడం, వారి డైరెక్షన్ లోనే అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడని కేసులు నమోదయ్యాయి.

వైసీపీ అధికారంలో ఉండగా, బోరుగడ్డను ఎవరూ టచ్ చేయలేకపోయారు. వైసీపీ పెద్దల పరోక్ష సహకారంతో తనకు తిరుగులేదన్నట్లు ప్రవర్తించిన బోరుగడ్డకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి ప్రతికూలంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై దూషణలకు దిగడంతో తొలుత గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బోరుగడ్డపై వరుస కేసులు నమోదవ్వడంతో సుమారు ఆరు నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే గడుపాల్సివస్తోంది. మధ్యలో ఒకసారి మధ్యాంతర బెయిలు వచ్చినా, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడనే ఆరోపణతో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఆ కేసులోనూ బెయిలు రావడంతో సోమవారం బోరుగడ్డ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు.

సోమవారం జైలు నుంచి విడుదలకు నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయడంలో ఆలస్యం జరగడంతో బోరుగడ్డ విడుదల మంగళవారిని వాయిదా పడింది. ఇక మంగళవారం బోరుగడ్డ బయటకు వచ్చేస్తాడనే సమయంలో గుంటూరు పక్కనే ఉన్న కాకాని పోలీసులు బోరుగడ్డపై నమోదైన పెండింగు కేసును బయటకు తీశారు. పెదకాకానిలో తన భూమి సర్వే చేయకుండానే సర్టిఫికెట్ ఇవ్వాలని సర్వేయర్ ను ఆయన బెదిరించినట్లు గతంలో కేసు నమోదైంది. వైసీపీ హయాంలోనే ఈ కేసు నమోదు అయినా, అప్పట్లో ఆయనకు ఉన్న పరపతితో పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం బోరుగడ్డపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో పాత కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దీంతో మరో 14 రోజులు ఆయన జైలులో గడపాల్సిన దుస్థితి ఎదురైంది.
ఇక భవిష్యత్తులోనూ ఆయన అంత సులువుగా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతల అండదండలతో గతంలో చెలరేగిపోయిన బోరుగడ్డ విషయంలో ఇప్పుడు ఏ నేత కూడా బహిరంగంగా సహకరించే సాహసం చేయడం లేదు. ఆయన వీడియోల్లో సభ్యత కనిపించకపోవడం, అతడికి సహకరిస్తే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయంతో ఎవరూ కూడా అతడికి సాయం చేయడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బోరుగడ్డ విడుదల ఇప్పట్లో ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#BorugaddaAnil#pawankalyan#PoliticalControversy#RowdySheet#Tdp#TeluguPolitics#Ycp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Janhvi Kapoor : మంచి ముత్య‌మ‌ల్లే..!

Next Post

Tdp: మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా..?

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

Next Post
Tdp: మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా..?

Tdp: మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info