వేకువ ఝామును మంచు పూలు మిలమిల మెరిసాయి. కానీ ఈ దృశ్యంలో జాన్వీ కపూర్ మంచి ముత్యమల్లే మెరుస్తోంది. మెరుపు లాంటి జాన్వీ కుర్రకారు గుండెల్లో భడభాగ్నిని రాజేస్తోంది. ఈ సుందరమైన దృశ్యం కేన్స్ 2025 ఉత్సవాల్లో కనిపించింది.
మొట్టమొదటి సారి జాన్వీ కపూర్ కేన్స్ లో ఆరంగేట్రం చేసింది. కేన్స్ లో తాను నటించిన ‘హోమ్ బౌండ్’ స్క్రీనింగ్ లో ఈ అద్భుతమైన లుక్ తో కనిపించింది. జాన్వీ ఈ కొత్త రూపంతో మతులు చెడగొడుతోంది. చూడటానికి కొంచెం సింపుల్ గా ఉన్నా కానీ, ముత్యాలు బీడ్స్ తో ఈ పొడవాటి లెహంగాను సర్వాంగ సుందరంగా డిజైనర్ మలిచారు.
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని దీనిని డిజైన్ చేసారు. ఈ లుక్ లో గ్రేస్ ఉంది. గ్లామర్ ని సాంప్రదాయ బద్ధంగా ఎలివేట్ చేసే నైపుణ్యం కనిపించింది. ధడక్ తో ఆరంగేట్రం చేసిన జాన్వీ సహనటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కేన్స్ 2025లో సందడి చేస్తుండడం విశేషం. అతడు విశాల్ జెత్వా కూడా జాన్వీతో పాటు కేన్స్ లో సందడి చేస్తూ కనిపించారు. ఈ ముగ్గురూ కేన్స్ 2025 లో ‘హోమ్ బౌండ్’ ప్రపంచ ప్రీమియర్ కోసం ఆత్రుతగా కనిపించారు.
ఈ ఉత్సవాల్లో జాన్వీ కపూర్ గురూజీ, ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు. కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ భాగస్వామి అయిన బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా కూడా ఈ ఉత్సవాలలో సందడి చేసారు.
జాన్వీతో సోదరి ఖుషీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా బృందంలో చేరారు. వారి స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ కూడా సందడి చేయడం హాట్ టాపిగ్గా మారింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ ప్రచారానికి మిత్రలు అంతా ఏకమవ్వడం విశేషం.