ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ap Liquor Scam: ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి?

Ap Liquor Scam: ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి?
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసింది.

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సిట్ అధికారులు, మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. శనివారం సాయంత్రానికి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన రాజ్ కసిరెడ్డికి తోడల్లుడు అయిన చాణక్య ఇచ్చిన సమాచారం ఆధారంగానే శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే చాలామందికి ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అని సందేహం రావొచ్చు. అయితే, ఈయన రామకృష్ణారెడ్డి కుమారుడు కాదు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని తొండూరు మండలం తుమ్మలపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డికి, రామకృష్ణారెడ్డికి బంధుత్వం ఉన్నప్పటికీ, అది దగ్గరి చుట్టరికం కాదు.

సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల నుంచి ఓ దఫా ఎంపీగా పనిచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆయన పులివెందుల నుంచి తన మకాంను నంద్యాలకు మార్చారు. నంద్యాల కేంద్రంగా మామగారి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అంతేకాకుండా తన సతీమణి సుజలతో కలిసి ఎస్పీవై రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకున్నారు. శ్రీధర్ రెడ్డి 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేనలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. పులివెందుల నేటివిటీ, సజ్జల ఇంటిపేరుతో ఆయన తక్కువ కాలంలోనే జగన్‌కు దగ్గరయ్యారని సమాచారం.

జగన్ ప్రభుత్వ హయాంలో ‘జే బ్రాండ్స్’గా ముద్రపడిన మద్యం బ్రాండ్లు ఎక్కువగా నంద్యాల పరిధిలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రంగానే తయారయ్యాయని ఆరోపణలున్నాయి. లిక్కర్ ముఠా ఇతర కంపెనీల నుంచి సేకరించిన మద్యాన్ని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లోనే తమ ప్రమాణాల మేరకు నాణ్యతను మార్చి ప్యాక్ చేశాడని ఆరోపణలున్నాయి.. ఈ విధంగా మద్యం కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కీలక కేంద్రంగా మారిపోయిందని సిట్ విచారణలో తేల్చిందని సమాచారం.

మద్యం పాలసీ రూపకల్పన, ఆయా బ్రాండ్ల ఎంపిక, కంపెనీల నుంచి ముడుపుల ఖరారు, వాటిని స్వీకరించడం, గమ్యస్థానాలకు తరలించడం వంటి అనేక కార్యకలాపాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ భావిస్తోంది. ఈ దందాలో రాజ్ కసిరెడ్డికి ఏ మేర పాత్ర ఉందో, శ్రీధర్ రెడ్డికి కూడా అంతే కీలక పాత్ర ఉందని సిట్ తమ దర్యాప్తులో అనుమానిస్తోంది. తాజా అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.

Tags: #AntiCorruption#APCorruption#APLiquorScam#LiquorMafia#SajjalaSridharReddy#ScamAlert#SITArrest
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Anasuya Bharadwaj: గ్లామర్ డోస్‌

Next Post

Chandra Babu: అదే సక్సెస్!

Related Posts

BillGates
Andhra Pradesh

BillGates:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిల్ గేట్స్ – సంజీవని ప్రాజెక్టు సందర్శన, రైతులతో సమావేశం

JDLakshminarayana
Big Story

JDLakshminarayana:సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు కొత్త బాధ్యతలు – మేఘా గ్రూపులో వైస్ ప్రెసిడెంట్‌గా చేరిక

T20WorldCup
Big Story

T20WorldCup:పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం – 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

MahaShivaratri
Big Story

MahaShivaratri:ఇషా ఫౌండేషన్‌లో మహా శివరాత్రి మహోత్సవాలు

JanaSena
Andhra Pradesh

JanaSena:జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం – రూ.2 కోట్లు విరాళంతో తొలి సభ్యుడిగా పవన్ కళ్యాణ్

ap assembly 2026
Big Story

APAssembly2026:రికార్డు స్థాయిలో సంక్షేమం అమలు చేస్తున్నాం – గవర్నర్ ప్రసంగంపై చర్చలో సీఎం చంద్రబాబు

Next Post
Chandra Babu: అదే సక్సెస్!

Chandra Babu: అదే సక్సెస్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

BillGates

BillGates:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిల్ గేట్స్ – సంజీవని ప్రాజెక్టు సందర్శన, రైతులతో సమావేశం

JDLakshminarayana

JDLakshminarayana:సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు కొత్త బాధ్యతలు – మేఘా గ్రూపులో వైస్ ప్రెసిడెంట్‌గా చేరిక

T20WorldCup

T20WorldCup:పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం – 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

MahaShivaratri

MahaShivaratri:ఇషా ఫౌండేషన్‌లో మహా శివరాత్రి మహోత్సవాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info