ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

YCP: షర్మిలపై ఎదురుదాడి!

YCP: షర్మిలపై ఎదురుదాడి!
ADVERTISEMENT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.తనతో పాటు తన భర్త అనిల్, బంధువులు, దగ్గరి వాళ్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్వయంగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారని అన్నారు. ట్యాపింగ్ ఆడియో ఒకటి తనకు వినిపించారని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌ పై విచారణకు ఎక్కడికైనా వస్తానని.. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కే కుట్ర జరిగిందని ఆరోపించారు. కేసీఆర్, జగన్ కలిసి ఫోన్ ట్యాపింగ్ ప్లాన్ చేశారని షర్మిల ధ్వజమెత్తారు.ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా విషయంగా అనిపించిందని పేర్కొన్నారు షర్మిల. అందుకే ఆ విషయాలను అప్పట్లో బయట చెప్పలేకపోయానని వివరించారు. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించారని మండిపడ్డారు.

షర్మిల చేసిన ఈ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఘాటుగా బదులిస్తోంది. దీనిపై పలువురు నాయకులు స్పందిస్తోన్నారు. వైవీ సుబ్బారెడ్డి పేరు రావడం, ఆయనపై ఆరోపణలు చేయడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోన్నారు. షర్మిలపై ఎదురుదాడికి దిగుతున్నారు.ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పేరును ప్రస్తావించడం పట్ల వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని అప్పటి ఏపీ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని గుర్తు చేశారు.

అప్పట్లో వైఎస్ జగన్‌, షర్మిలకు సంబంధాలు ఇలా ఉండేవి కావని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ ను ట్యాప్‌ చేసి కేసీఆర్‌ ప్రభుత్వం ఇక్కడి ముఖ్యమంత్రికి ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందా? లేదా? అన్నది తనకు తెలియదని పేర్కొన్నారు. టీడీపీకి సంబంధించిన టీవీలు, పత్రికల్లో తనపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని అన్నారు.

Tags: #APpolitics#BreakingNews#CongressTelangana#HotPoliticalDebate#KCR#PhoneTapping#PoliticalControversy#PoliticalDrama#PoliticalScandal#SharmilaVsJagan#ShockingRevelations#SouthIndiaPolitics#SurveillancePolitics#TelanganaPolitics#TeluguStates#trs#VVSubbaReddy#ysjagan#Ysrcp#YSRFamily#YSRTP#YSSRSharmila
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Srinidhi Shetty: అతి జాగ్రత్త ఇలా చేసిందా..?

Next Post

Malavika Mohanan: అలా చూస్తూ ఉండిపోయా..!

Related Posts

#SatvikaVeeravalli, #సాత్వికవీరవల్లి, #DulquerSalmaan, #AakasamloOkaTara, #NagaChaitanya, #NC25, #AlluAravind, #GeethaArts, #Clax, #RamCharan, #Sukumar, #Tollywood, #TollywoodNews, #TeluguCinema, #News7Telugu
Entertainment

Satvika Veeravalli : సాత్విక వీరవల్లి క్రేజ్.. నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్!

Telangana
Big Story

Telangana : నాగార్జునసాగర్ నీటి వివాదం.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

PanchayatElections2026
Andhra Pradesh

PanchayatElections2026 : ఒక్క ఓటుతో గెలుపోటములు తారుమారు.. పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ!

Yanam :యానాం అభివృద్ధికి రూ.303.80 కోట్లు.. అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి కృష్ణారావు
Big Story

Yanam :యానాం అభివృద్ధికి రూ.303.80 కోట్లు.. అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి కృష్ణారావు

#PuducherryTourism, #PuducherryDevelopment, #MalladiKrishnaRao, #Yanam, #TourismDevelopment, #News7Telugu
Big Story

Puducherry : ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా పుదుచ్చేరి.. కేంద్ర నిధుల కోసం మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రయత్నాలు

Telangana
Big Story

Telangana : గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ! తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Next Post
Malavika Mohanan: అలా చూస్తూ ఉండిపోయా..!

Malavika Mohanan: అలా చూస్తూ ఉండిపోయా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#SatvikaVeeravalli, #సాత్వికవీరవల్లి, #DulquerSalmaan, #AakasamloOkaTara, #NagaChaitanya, #NC25, #AlluAravind, #GeethaArts, #Clax, #RamCharan, #Sukumar, #Tollywood, #TollywoodNews, #TeluguCinema, #News7Telugu

Satvika Veeravalli : సాత్విక వీరవల్లి క్రేజ్.. నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్!

Telangana

Telangana : నాగార్జునసాగర్ నీటి వివాదం.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

PanchayatElections2026

PanchayatElections2026 : ఒక్క ఓటుతో గెలుపోటములు తారుమారు.. పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ!

Yanam :యానాం అభివృద్ధికి రూ.303.80 కోట్లు.. అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి కృష్ణారావు

Yanam :యానాం అభివృద్ధికి రూ.303.80 కోట్లు.. అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి కృష్ణారావు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info