• వాటర్ విజన్-2047 పేరుతో రాష్ట్రాల రెండో ఇరిగేషన్ మంత్రుల సమావేశం.
• రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.
• కరువు నివారణకు ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వాటర్ పాలసీని వివరించనున్న మంత్రి నిమ్మల.
విజన్-2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ పాలసీను, రాజస్దాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ నగరంలో ఈనెల 18, 19 వ తేదీల్లో జరిగే రెండవ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో వివరించనున్నారు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. సోమ వారం రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ చేరుకున్న మంత్రి, వాటర్ విజన్-2047 పేరుతో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, ఆయా రాష్ట్రాల్లో నీటి సరఫరా,నిల్వల సమర్ద నిర్వహాణ, అనుసరిస్తున్న విధానాల గురించి తెలియజేసేలా, నిర్వహిస్తున్న సమావేశంలో ప్రసంగించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ఆంధ్ర ప్రదేశ్ లో వినియోగించబడుచున్న టెక్నాలజీ ద్వారా నీటి సరఫరా, నిల్వల సమర్ధ నిర్వహణ చేసే విధానం గురించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర రాష్ట్రాల మంత్రులకు వివరించనున్నారు. రాష్ట్రానికి ఒక పక్క కరువు, మరో పక్క వరదలు, అతి వృష్టి, అనావృష్టి తో తీవ్రంగా నష్టపోతుందని, వీటిని అధిగమించడానికి తీసుకునే ప్రణాళికలు, వాటర్ విజన్ 2047 పేరిట చేపట్టబోయే విధానాలను, భూగర్భజలాలు, నీటి పారుదలను పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాటర్ పాలసీని ప్రత్యేకంగా తెలియజేయనున్నారు. విజన్ 2047 లో భాగంగా నదుల అనుసంధానం, మైక్రో ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, ద్వారా చివరి ఎకరం వరకు సాగు నీరు, అదేవిధంగా ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించడం, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలు పెంపొందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యాచరణను ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు వివరిస్తారు.