సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే చాలామంది హీరోయిన్లు కొన్ని కండిషన్లు పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తారు. అయితే ఇండస్ట్రీకి వచ్చే ముందు తమ తల్లిదండ్రులు ఇంటిమేట్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాల్లో నటించకూడదు అని కండిషన్స్ పెడుతుంటారని చెబుతూ ఉంటారు. వారి పేరెంట్స్ కండిషన్స్ మేరకే సినిమాల్లో ‘నో కిస్ పాలసీ’ ని ఫాలో అవుతూ ఉంటామని చెబుతూ ఉంటారు. అంతేకాదు కొంతమంది పేరెంట్స్ ఏమీ అనకపోయినా అలాంటి ఇంటిమేట్ సన్నివేశాలలో చేసినప్పుడు పేరెంట్స్ తో కలిసి ఆ సినిమా చూస్తే ఎలా ఉంటుందోనని మొహమాటపడి అలాంటి సీన్స్ చేయడానికి ఒప్పుకోరు. అయితే వాళ్ళు పెట్టుకున్న కండిషన్ల వల్ల ఎన్నో హిట్ సినిమాలు కూడా మిస్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి ఒక విషయం గురించే ప్రస్తావించింది నటి సోనమ్ బజ్వా.. కిస్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాల గురించి తన పేరెంట్స్ స్పందించిన తీరుకి షాక్ అయ్యాను అంటూ అందరూ ఆశ్చర్యపోయే విషయం చెప్పింది.మరి ఇంతకీ ముద్దు సన్నివేశాలపై సోనమ్ బజ్వా ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా ముద్దు సన్నివేశాలపై తన పేరెంట్స్ స్పందించిన తీరును వెల్లడిస్తూ.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ముద్దు సన్నివేశాలను చేయడానికి నేను నిరాకరించాను.దానివల్ల ఎన్నో హిట్ సినిమాల్లో ఛాన్స్ వదిలేసుకున్నాను.సినిమాల్లోకి వచ్చినప్పుడే ఇలాంటి సీన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మా పేరెంట్స్ తో కలిసి ఆ సినిమాలు చూసినప్పుడు అలాంటి ఇంటిమేట్ సీన్స్ వస్తే కాస్త అసౌకర్యంగా ఉంటుందని ముందే ఆ సీన్స్ చేయకూడదని కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశాను. అయితే ఈ కారణంగా ఎన్నో పెద్ద సినిమాల్లో ఛాన్స్ మిస్ చేసుకున్న తర్వాత ఒకసారి మా పేరెంట్స్ తో ఈ విషయం గురించి చర్చించినప్పుడు “ఇదంతా యాక్టింగ్ లో భాగమే.. నటిగా రాణించాలంటే ప్రతి ఒక్క సీన్ చేయగలగాలి.అందులో పెద్ద తప్పేముంది” అని స్పందించారు. వాళ్ళ రియాక్షన్ కి నేను కూడా షాక్ అయ్యాను.
వాళ్లను బాధపెడుతుంది అనే కారణంతో నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు మిస్ చేసుకున్నాను అని అనిపించింది. అయితే ఇలాంటి సీన్స్ ఒప్పుకోక పోవడానికి నా పేరెంట్స్ తో పాటు పంజాబీ ప్రేక్షకులు ఏమనుకుంటారో అని కూడా భయం ఉండేది. బాలీవుడ్ లో ఎన్నో పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.కానీ వాటిలో కిస్ సన్నివేశాలు ఉండేవి.అలాంటి సన్నివేశాల్లో నటిస్తే పంజాబ్ ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా.. ఒకవేళ ఆ సీన్స్ చేస్తే కుటుంబ కథా ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారు కావచ్చు అని నాకు నేనే ఫీల్ అయ్యి చాలా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు మిస్ చేసుకున్నాను.ఆ తర్వాత నా పేరెంట్స్ రియాక్షన్ చూసి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానని బాధపడ్డాను. అంటూ పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా చెప్పుకొచ్చింది.
సోనమ్ బజ్వా పంజాబ్, హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. అలా అక్కినేని సుశాంత్ నటించిన ఆటాడుకుందాం రా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేష్ తో బాబు బంగారం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక చివరిగా సోనమ్ బజ్వా హౌస్ ఫుల్ 5 అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే తో కలిసి ‘ఏక్ దివానీ కి దివానియత్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోనమ్ బజ్వా తన వ్యక్తిగత విషయాలని పంచుకుంది.