ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

TVK : తమిళనాడులో ‘విజిల్’ మోగింది: ఒంటరి పోరుకు దళపతి విజయ్ సమరశంఖం

TVK : తమిళనాడులో ‘విజిల్’ మోగింది: ఒంటరి పోరుకు దళపతి విజయ్ సమరశంఖం
ADVERTISEMENT

తమిళనాడులో మోజు క్రేజూ ఉన్న పార్టీగా దళపతి తమిళ సూపర్ స్టార్ విజయ్ నాయకత్వంలోని పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకేని అంతా చూస్తున్నారు. విజయ్ సినిమాలకు సూపర్ రియాక్షన్ జనంలో ఉంటుంది. అయిదు పదులు దాటిన ఈ హీరోకు ఇంకా ఎంతో సినీ కెరీర్ ఉండగానే రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా 2021లో పుట్టిన ఆలోచన అయిదేళ్ళ పాటు ప్రణాళికబద్ధంగా అమలు చేసుకుంటూ పార్టీని జనంలో ఉంచారు. ఇక మరి కొద్ది నెలలలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ రేసు గుర్రంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో తాజాగా మహాబలిపురంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే పోటీ మీద కూడా పొత్తుల మీద స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేవని తేల్చేశారు. మొత్తం 234 సీట్లకు గానూ టీవీకే పార్టీ పోటీ చేస్తుందని కుండ బద్ధలు కొట్టారు. టీవీకేకి ఎవరితోనూ పొత్తు ఉండదని, సొంతంగానే ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్ ధీమాను వ్యక్తం చేశారు.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేని ఓడించేది రాష్ట్రాన్ని పాలించేది టీవీకే మాత్రమే అని ఆయన స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో ఒక దుష్ట శక్తిగా డీఎంకే ఉందని అలాగే అవినీతి శక్తిగా అన్నా డీఎంకే ఉందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఈ రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటామని ఒంటరిగా నిలబడి గెలుపు గుర్రం ఎక్కుదామని ఆయన చెప్పుకొచ్చారు. రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని అందులో ఒకటి బీజేపీతో నేరుగా పొత్తులో ఉందని మరొకటి ఇండైరెక్ట్ గా సరెండర్ అయింది అని విజయ్ విమర్శలు గుప్పించారు.

కొత్త పార్టీ అయినా (TVK) టీవీకే మీద ప్రజలలో నమ్మకం ఉందని విజయ్ ధీమాగా చెప్పారు. తమిళ(Tamilnadu) ప్రజలను రక్షించడానికి తమిళ మట్టిని కాపాడడానికే తమ పార్టీ ఉందని ఆయన చెప్పారు. మొత్తానికి ఎవరితో పొత్తు లేదని విజయ్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా గెలిచేది తమ పార్టీయే అని అటు పార్టీ వారికి మరో వైపు తమిళనాడు రాజకీయ ప్రత్యర్ధులకు సంకేతాలు ఇచ్చారు. విజయ్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని ఒక వైపు ప్రచారం సాగింది, మరో వైపు చూస్తే బీజేపీ కూడా పొత్తునకు ప్రయత్నం చేస్తోంది అని కూడా చెప్పుకున్నారు. కానీ సోలోగా బరిలోకి దిగి విక్టరీ కొడతామని విజయ్ చెప్పడం బట్టి చూస్తూంటే తమిళనాడులో పొలిటికల్ హీట్ ఈసారి పీక్స్ లో ఉండే చాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి తమిళనాడు ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారో.

తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్యలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరనున్నాయి. దీంతో కొత్త పార్టీ పెట్టిన సినీ నటుడు దళపతి విజయ్ స్పీడ్ పెంచారు. తన పార్టీ తమిళగ వెట్రి కగజం (టీవీకే)కి కేటాయించిన ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మహాబలిపురంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేసిన విజయ్.. సమర శంఖం పూరించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేయడంతోపాటు తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలను పార్టీల మధ్య పోటీగానే చూడొద్దని, ఎన్నికలు అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రకటించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు పోటీ చేసి గెలిచే సత్తా తన పార్టీకి ఉందని టీవీకే అధినేత విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నా డీఎంకే ప్రత్యక్షంగా, అధికార డీఎంకే పరోక్షంగా కేంద్రంలోని అధికార బీజేపీకి తలొగ్గాయని ఆరోపించారు. తమిళనాడులో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే ప్రభుత్వాన్ని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు జరగబోయేది కేవలం ఎన్నిక కాదు, ఒక ప్రజాస్వామ్య యుద్ధం దీనికి నాయకత్వం వహించబోయే సేనాపతులు మీరే. ప్రస్తుతం అధికారంలో ఉన్న దుష్టశక్తుని గతంలో రాష్ట్రాన్ని పాలించిన అవినీతి శక్తిని ఎదుర్కొనే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని విజయ్ వెల్లడించారు.

ఇక ఈ సందర్భంగా ఎన్నికల పొత్తుపైనా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని, 234 స్థానాల్లో గెలిచే దమ్ము ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనను అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా కోసం ఎవరూ నిలబడరని అంటున్నారు. గత 30 ఏళ్లుగా ఈ పార్టీలు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ ప్రజలు తనపై నమ్మకం ఉంచుతున్నారు. నిర్ణయాత్మకంగా అంచనా వేస్తున్నారని విజయ్ కుండ బద్దలు కొట్టారు. అయితే ప్రజలు తననొక్కడినే కాకుండా తనతో ఉన్నవారిపైనా నమ్మకం ఉంచాలని కోరారు. ఎవరి కోసమో రాజీ పడకూడదని, అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కాగా, పార్టీ ఎన్నికల గుర్తును ఆవిష్కరించే సమయంలో విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజిల్ గుర్తును ఆవిష్కరించి ప్రజలను ఉర్రూతలూగించేలా విజిల్ వేశారు. ఆయన అలా విజిల్ వేస్తుండగా, వేదిక ముందు ఉన్న కార్యకర్తలు సైతం విజిల్ వేస్తున్నారు. అంతేకాకుండా 2019లో ఆయన నటించిన చిత్రం విజిల్ లోని కప్పు ముఖ్యం బిగిల్ అని డైలాగ్ వేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు విజిల్ గుర్తుపై అనేక నినాదాలు చేశారు. తమిళనాడులో మార్పు తీసుకొచ్చేది విజిల్ అంటూ నినదించారు. మొత్తానికి ఈ సభ ద్వారా పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తానని విజయ్ స్పష్టత ఇచ్చారని అంటున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. విజయ్ పోటీ అధికార, విపక్షాల్లో ఎవరి కొంప ముంచుతుందనే ఉత్కంఠకు తెరతీసింది.

Tags: #TamilNadu#ThalapathyVijay​#TVK#vijayactorpoliticsaiadmk vijaypoliticsdmkvsaiadmknoalliancestamilnaduelections dmktamilnadupolls whistlethalapathyvijayentry
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

WithLove:హీరోగా కొత్త నటుడు – హీరోయిన్‌గా అనస్వర రాజన్ | ‘విత్ లవ్’ మూవీకి గ్రీన్ సిగ్నల్

Next Post

Chiranjeevi : దేశానికి గర్వకారణమైన క్షణం: పద్మ విజేతలకు చిరంజీవి ప్రశంసల జల్లు

Related Posts

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation
Big Story

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Corruption
Big Story

Corruption: స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – సమాజాన్ని కూల్చేస్తున్న మౌన మహమ్మారి

Next Post
Chiranjeevi : దేశానికి గర్వకారణమైన క్షణం: పద్మ విజేతలకు చిరంజీవి ప్రశంసల జల్లు

Chiranjeevi : దేశానికి గర్వకారణమైన క్షణం: పద్మ విజేతలకు చిరంజీవి ప్రశంసల జల్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info