రష్యాతో జరుగుతున్న యుద్ధానికి యుక్రెయినే అసలు కారణమంటూ అమెరికా అధ్యక్షుడు (Donald Trump) డోనల్డ్ ట్రంప్ ఆరోపించినట్లుగా కనిపిస్తోంది. ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి ఆయన (Ukraine) యుక్రెయిన్‌పై వరుసగా పదునైన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ పాపులారిటీ గురించి కూడా వ్యాఖ్యానించారు. యుక్రెయిన్‌లో షెడ్యూల్ చేసిన ఎన్నికలను మార్షల్ లా కారణంగా నిర్వహించలేదన్నారు. ఆ తర్వాత బుధవారం ఆయన మరిన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేసిన కొన్ని ఆరోపణలు, యుద్ధం గురించి సాధారణంగా రష్యా మాట్లాడే మాటలను తలపించాయి. దాదాపు మూడేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు రియాద్‌లో రష్యా, అమెరికా అధికారుల బృందం భేటీ అయింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆధునిక ప్రపంచంలో ప్రచన్నయుద్ధాల నుంచి నేరుగా యుద్ధాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాల దురుద్దేశాలు ఉండటమే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవ్వరూ ఊహించని షాకింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా మయామీలో మాట్లాడుతూ మూడో ప్రపంచ యుద్ధం గురించి కీలక కామెంట్స్ చేశారు. థర్డ్ వరల్డ్ వార్ రావటానికి ఎంతో దూరం లేదని అయితే తాను అధ్యక్షుడిగా ఉండగా దానిని సమర్థవంతంగా నివారిస్తానంటూ చేసిన కామెంట్స్ ప్రపంచ దేశాల నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సమ్మిట్‌లో ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఒక విధంగా వాస్తవానికి కొంత దూరంగానే ఉన్నాయనే వాదన ఉన్నప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరుగుతున్న పోరును చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కొట్టివేయలేనిదిగా చాలా మంది చెబుతున్నారు.
తన నాయకత్వంలో ఇలాంటి విపత్తును నివారిస్తానని అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి హామీ ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇరాక్ సహా ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని దేశాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను ఈ యుద్ధాలను ముగించి శాంతిని స్థాపించటం తన కర్తవ్యమని ట్రంప్ అన్నారు.
అందరూ చంపబడటం చూసి తాను తట్టుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధాలను అంతం చేయడానికి తాను అత్యవసర చర్యలు తీసుకుంటున్నానన్నారు.
ఈ క్రమంలో ట్రంప్ గత అధ్యక్షుడు జో బిడెన్ పై నిప్పులు చెరిగారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సంఘర్షలు పెరగడానికి బైడెన్ పరిపాలనే కారణమని ఆరోపించారు. బైడెన్ అధ్యక్షుడిగా మరో ఏడాది ఉండిఉంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదంటూ ట్రంప్ అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవను ప్రపంచం ప్రశాంతంగా ఉండటానికి తాను కృషి చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. యుద్ధాలను అంతం చేయటమే తన పరిపాలనలో లక్ష్యంగా ట్రంప్ పేర్కొనటం ప్రపంచ దేశాల నేతల నుంచి ప్రశంసలు కురిపిస్తోంది.
ఇప్పటికై రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నివారించటానికి అమెరికా చర్చలు జరుపుతోందని త్వరలోనే దీనికి పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రశంశించారు. తనకు ఇష్టమైన ఉక్రెయిన్ దేశాన్ని జెలెన్స్కీ అనే చెడ్డ నాయకుడు నాశనం చేశాడని కామెంట్ చేశారు.
ఈ క్రమంలో జెలెన్స్కీ అనవసరంగా లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి గత బైడెన్ ప్రభుత్వం ఏకంగా 350 బిలియన్ డాలర్లు అందించటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఇకనైనా అక్కడి ప్రజలకు శాంతిని అందించటానికి యుద్ధాలను ముగించాలని అన్నారు.
రష్యాతో జరుగుతున్న యుద్ధానికి యుక్రెయినే అసలు కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించినట్లుగా కనిపిస్తోంది. ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి ఆయన యుక్రెయిన్‌పై వరుసగా పదునైన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ పాపులారిటీ గురించి కూడా వ్యాఖ్యానించారు. యుక్రెయిన్‌లో షెడ్యూల్ చేసిన ఎన్నికలను మార్షల్ లా కారణంగా నిర్వహించలేదన్నారు. ఆ తర్వాత బుధవారం ఆయన మరిన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేసిన కొన్ని ఆరోపణలు, యుద్ధం గురించి సాధారణంగా రష్యా మాట్లాడే మాటలను తలపించాయి. దాదాపు మూడేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు రియాద్‌లో రష్యా, అమెరికా అధికారుల బృందం భేటీ అయింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.