హైదరాబాద్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందుతూ ఉండడంతో అనేక ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలలో బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే అనేక నివాస ప్రాంతాలు ఉన్నాయి
హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రముఖ ఐటీ హబ్‌గా పేరుంది.ఇక్కడే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంది.ఉప్పల్ లో మెట్రో స్టేషన్ కూడా ఉంది.కాచిగూడ రైల్వే స్టేషన్ 8km ,చర్లపల్లి రైల్వే స్టేషన్ 9km ఉంటుంది. అపార్ట్ మెంట్ కాకుండా ఇండిపెండెంట్ ఇళ్లలో నివసించాలనుకునే మధ్య తరగతి వారికీ,బ్యాచిలర్స్ కు, బిజిగా ఉండే నగరానికి దూరంగా ఉండాలనుకునే వారికీ ఉప్పల్ చాల అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు.ఇక్కడ స్కూల్స్,కాలేజెస్,షాపింగ్ మాల్స్,హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
1 BHK రెంట్ చూసుకుంటే 4500 నుండి 7000 రూపాయిల వరకు ఉన్నాయి.
2 BHK రెంట్ చూసుకుంటే 11000 నుండి 16000 రూపాయిల వరకు ఉన్నాయి.
3 BHK రెంట్ చూసుకుంటే 16000 నుండి 22000 రూపాయిల వరకు ఉన్నాయి.
హైదరాబాద్ ఆరో నిజాం కుమార్తె పేరుతో బేగంపేట్ ప్రాంతం ఏర్పడింది.ఇక్కడ ప్రసిద్ధ బేగంపేట్ విమానా శ్రయం ఉంది.
బేగంపేట లో అనేక అంతర్జాతీయ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు,స్కూల్స్,హాస్పిటల్స్,రేల్వే స్టేషన్స్ ఉన్నాయి.బేగంపేట్ హైదరాబాద్ లో ఒక ముఖ్యమైన వాణిజ్య ప్రాంతంగా ఎదిగింది.ఇక్కడ అన్ని తరగతులవారు నివసించే ప్రాంతంగా గుర్తింపు పొందింది.
1 BHK రెంట్ చూసుకుంటే 4000 నుండి 17000 రూపాయిల వరకు ఉన్నాయి.
2 BHK రెంట్ చూసుకుంటే 12000 నుండి 26000 రూపాయిల వరకు ఉన్నాయి.
3 BHK రెంట్ చూసుకుంటే 16000 నుండి 36000 రూపాయిల వరకు ఉన్నాయి.
సోమాజిగూడలో తెలంగాణ గవర్నర్ అధికార నివాసం ఉంటుంది.మంచి మౌలిక సదుపాయాలు,రవాణాకు అనుకూలంగా,మంచి రక్షణ ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లోమంచి వాతావరణం ఉన్న నివాస ప్రాంతాల్లో ఒకటిగాచెప్పుకోవచ్చు.మంచి వాణిజ్య ప్రాంతాలు అయిన పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్ వంటి ప్రాంతాలు చాల దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ కూడా స్కూల్స్ ,మాల్స్,హాస్పిటల్స్ ఉన్నాయి.మ్యాజిక్ బ్రిక్స్ ప్రకారం రెంట్స్ చూసుకుంటే
1 BHK రెంట్ చూసుకుంటే 6000 నుండి 8000 రూపాయిల వరకు ఉన్నాయి.
2 BHK రెంట్ చూసుకుంటే 12000 నుండి 28000 రూపాయిల వరకు ఉన్నాయి.
3 BHK రెంట్ చూసుకుంటే 22000 నుండి 38000 రూపాయిల వరకు ఉన్నాయి.
హైదరాబాద్ లో ఉన్న అమీర్‌పేట్ అన్నింటికీ సెంటర్ గా చెప్పుకోవచ్చు.దాదాపు అన్ని ప్రాంతాలనుండి రవాణా సదుపాయం చాల అనుకూలంగా ఉంటుంది.అమీర్పేట్ విద్యార్దులకు,ఉద్యోగులకు చాల అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు.హైదరాబాద్‌లో అమీర్పేట్ ను విద్యా కేంద్రంగా పేరు పొందింది.ఇక్కడ మాల్స్,ఎడ్యుకేషన్ ఇస్టిట్యూషన్స్,హాస్పిటల్స్ ,షాప్స్ అనేక రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి.
1 BHK రెంట్ చూసుకుంటే 6000 నుండి 11000 రూపాయిల వరకు ఉన్నాయి.
2 BHK రెంట్ చూసుకుంటే 12000 నుండి 25000 రూపాయిల వరకు ఉన్నాయి.
3 BHK రెంట్ చూసుకుంటే 22000 నుండి 70000 రూపాయిల వరకు ఉన్నాయి.
హైదరాబాద్ లో మాదాపూర్ ఎక్కువ మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు.మాదాపూర్ సమీపంలో అనేక సాఫ్ట్ వెర్ కంపెనీలు ఉన్నాయి.ఇక్కడ నివసించేందుకు ప్రాచుర్యం పొందిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.ఉద్యోగ అవకాశాలు,వ్యాపార అవకాశాలు ఇక్కడ చాల ఎక్కువగా ఉంటాయి.ఉద్యోగుల కోసం లేదా వ్యాపారం కోసం నివసించేందుకు అత్యుత్తమ ప్రాంతంగా మాదాపూర్ చెప్పుకోవచ్చు.ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్,ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లు,ఇంటర్నేషనల్ హాస్పిటల్స్,శిల్పారామం,దుర్గం చెరువు మొదలుగునవి ఉన్నాయి.
1 BHK రెంట్ చూసుకుంటే 10000 నుండి 22000 రూపాయిల వరకు ఉన్నాయి.
2 BHK రెంట్ చూసుకుంటే 22000 నుండి 35000 రూపాయిల వరకు ఉన్నాయి.
3 BHK రెంట్ చూసుకుంటే 42000 నుండి 90000 రూపాయిల వరకు ఉన్నాయి.