ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Kavitha: సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం

Kavitha: సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం
ADVERTISEMENT

సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్ ఇచ్చిన కవిత

తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కవిత విజ్ఞప్తి

తెలంగాణ జాగృతి కార్యాలయంలో కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమం

సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈ ప్రక్రియలో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాము కూడా సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులు, మేధావులను కలుస్తామన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. మూడో సారి గెలిస్తే కేసీఆర్ గారు సామాజిక తెలంగాణ చేసే వారని కవిత అన్నారు. వారి అజెండాను జాగృతి ద్వారా ముందుకు తీసుకెళ్తామన్నారు.

*కేసీఆర్ కు షాక్*
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేసీఆర్ కు కవిత షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ మద్దతివ్వని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి కవిత మద్దతు పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఎంతో అవగాహన ఉన్నఆయన ఉపరాష్ట్రపతి గా ఎన్నికైతే…ఆ పదవికే వన్నె తెస్తారన్నారు. ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ గతంలో ఆ పదవికి ఎలా వన్నె తెచ్చారో…జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా పదవికి వన్నె తెస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

*రేవంత్ అవినీతి ని ప్రశ్నిస్తాం*

మొన్నటి వరకు కాళేశ్వరం కూలిందన్న రేవంత్ రెడ్డి…అదే ప్రాజెక్ట్ లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు ఎలా తెస్తున్నారని కవిత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తే 1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని గుర్తు చేశారు. కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ. 7500 కోట్లు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ ఇంటి సొమ్ము కాదన్నారు. ప్రాజెక్ట్ విలువ రూ. 7500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పే వరకు ప్రశ్నిస్తామన్నారు.

*ప్రజల్లో స్ఫూర్తి నింపిన కాళోజీ, చాకలి ఐలమ్మ*

కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కవిత నివాళులు అర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగాను ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అని అన్నారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారని అన్నారు. కవికి మరణం ఉండదని…కాళోజీ గారు అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకునేలా చేస్తున్నాయన్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. అలాంటి వీరత్వం తెలంగాణ రక్తంలోనే ఉందని…చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో ముందుకు కదలాలని సూచించారు. సమావేశంలో ప్రముఖ కవులు, రచయితలు ఉషారాణి, డాక్టర్ కాంచనపల్లి, డాక్టర్ చమన్ సింగ్, లక్ష్మీ నారాయణ, తిరుమల శ్రీనివాస్ ఆర్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Tags: #BRS#Kavitha#Telangana#TelanganaPolitics#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pushpa3: ఇప్పట్లో వచ్చేలా లేదుగా!

Next Post

Nepal: సోషల్ మీడియా పవర్..నేపాల్ ప్ర‌ధాని ప‌రార్..!

Related Posts

Vijayasai Reddy Political Strategy
Big Story

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics
Big Story

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu
Big Story

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

Next Post
Nepal: సోషల్ మీడియా పవర్..నేపాల్ ప్ర‌ధాని ప‌రార్..!

Nepal: సోషల్ మీడియా పవర్..నేపాల్ ప్ర‌ధాని ప‌రార్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Vijayasai Reddy Political Strategy

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info