పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వీట్ షాక్ ఇచ్చారు. వారు పార్టీ మారినట్లుగా ఆధారాల్లేవని తేల్చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను కొట్టివేశారు. తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు.
2023లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జులై 2025లో నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే మరింత గడువు కావాలని స్పీకర్ కోరారు. 4 వారాల్లో అంటే డిసెంబర్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరొక్క రోజు గడువు ఉండటంతో ఐదుగురిపై నిర్ణయం ప్రకటించారు.
గురువారం మరో ముగ్గురు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ పై దాఖలైన అనర్హతా పిటిషన్లపై కూడా తీర్పు చెప్పనున్నారు. వారికి కూడా సేమ్ తీర్పు వస్తుందని భావిస్తున్నారు. మిగిలినవారు దానం నాగేందర్, కడియం శ్రీహరి వారు ఇంకా విచారణకు హాజరు కాలేదు. గడువు కోరారు. తదుపరి సుప్రీంకోర్టు విచారణలో న్యాయమూర్తుల స్పందనను బట్టి వారిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


















