గత ఏడాది జరిగిన ఎన్నికల్లో యువ నేతలకు టీడీపీ అధినేతగా చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించారు. ఎంతో మంది సీనియర్లను కాదని కూడా.. వారికి అవకాశం ఇచ్చారు. వీరిపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆ ఆశలు ఫలించేలా కనిపించడం లేదన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. నిజానికి కొత్త తరం ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కొన్నాళ్లుగా అబ్జర్వ్ చేస్తున్నారు. వారు ఎలా ముం దుకు సాగుతున్నారు? ప్రజలకు ఏమేరకు సేవ చేస్తున్నారు? అనే విషయాలపై సర్వేలు కూడా చేయిస్తు న్నారు.
సుమారు 48 మంది కొత్త నేతలకు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. వీరిలో వారసత్వంగా రాజకీయాల్లోకి వ చ్చిన వారు కొందరు మాత్రమే ఉన్నారు. అయితే.. కొత్త నేతలు చంద్రబాబు అనుకున్న రేంజ్‌లో ఆయన అంచనాలను అందుకోలేక పోతున్నారన్న చర్చ సాగుతోంది. ఇది చంద్రబాబు కూడా పదే పదే చెబుతు న్న మాట. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త నేతలను సెంట్రిక్‌గా చేసుకుని వచ్చే వర్షాకాల సమావేశాల్లో వర్క్ షాపు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. వారి పనితీరును ఈ సందర్భంగా చంద్రబాబు వివరించనున్నారు.
కేవలం కొత్త ఎమ్మెల్యేలకు మాత్రమే అదికూడా తెలుగు దేశం పార్టీ వారికి మాత్రమే మూడు రోజుల పాటు ఈ వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో వారి తప్పులు ప్రధానంగా ఎత్తి చూపడం తోపాటు.. వారినడవడిక, ఎలా వ్యవహరించాలి? భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలి? అనే విషయాలపైనా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కొత్తవారిలో దూకుడు ఎక్కువగా ఉన్నా.. అది పార్టీకి మైనస్‌గా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే.. అతి , లేకపోతే మౌనంగా ఉంటున్నారు.
దీనిని మార్చుకుని, ప్రజలకు చేరువ కావడంతోపాటు.. వచ్చే ఎన్నికల నాటికి బలమైన నాయకులుగా ఎదిగేలా చంద్రబాబు స్వయంగా వారికి దిశానిర్దేశం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి స్పీకర్ కూడా హాజరవుతారని అంటున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు వారిపై వచ్చిన ఆరోపణలను కూడా బహిరంగంగానే వెల్లడించడం.. వన్-వన్ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. తద్వారా వారిలో మార్పు కోసం చంద్రబాబు ప్రయత్నించనున్నట్టు పార్టీ చెబుతోంది.
క్షేత్రస్థాయిలో నాయకులు ముందుకు రావడం లేదు. అనుకున్న విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించ డం లేదు. ప్రభుత్వం తరఫున బలమైన వాయిస్ కూడా వినిపించడం లేదు. ఇదీ.. చంద్రబాబును వేధి స్తున్న అంశం. అయితే.. దీనికి కారణం.. తమకు ఎలాంటి గుర్తింపు లేదని నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇస్తామన్న పదవులు కూడా ఇవ్వలేదన్న ఆవేదన కూడా వారిలో ఉంది. దీంతో నాయకులు బయటకు రావడం లేదు. పైగా.. పార్టీ పై విమర్శలు వస్తున్నా చోద్యం చూస్తున్నారు.
దీనికి ప్రధానంగా నామినేటెడ్ పదవుల విషయంలో జరుగుతున్న తాత్సారమే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో 22 వేల పైచిలుకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 2 వేల పైచిలుకు మాత్రమే భర్తీ చేశారు. పోనీ.. నిధుల కొరతతో 10 వేల పోస్టులను భర్తీ చేయకపోయినా.. కీలక మైనమార్కెట్ యార్డు, దేవాలయాల కమిటీలను భర్తీ చేయొచ్చు. తద్వారా నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెంచే చర్యలు చేపట్టవచ్చు. అయితే.. దీనికి కూడా ప్రభుత్వం ఉత్సాహం చూపించడం లేదు.
ఇదే విషయాన్ని అనుకూల మీడియా తాజాగా హైలెట్ చేసింది. పదవులు ఇవ్వకపోతే.. ఎలా? అంటూ.. ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలనే సదరు పత్రిక ప్రచురించింది. దీనిపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము బహిరంగంగా చెప్పుకోలేని అనేక విషయాలను పత్రి క బయట పెట్టిందని అంటున్నారు. ఇది వాస్తవం కూడా. అనేక మంది నాయకులు.. గత ఎన్నికల్లో అప్పులు చేసి మరీ పార్టీ కోసం కష్టపడ్డారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది ఎప్పటినుంచో ఉన్న చర్చ.
“ఇప్పుడు మాకు పదవులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. దేవాలయాల కమిటీలను నియమించవచ్చు. మాకంటూ.. ఒక గుర్తింపు వస్తుంది. దీనిని ఆశించడం తప్పని మేం అనుకోవడం లేదు.“ అని ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మరి వారికి చంద్రబాబు కొంత ఆదరవు కల్పిస్తే.. ఆ తర్వాత వారు తమంతట తాముగా.. ప్రభుత్వానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.