ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

SLBC tunnel collapse: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఘోర ప్రమాదం..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్

ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం

SLBC tunnel collapse: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఘోర ప్రమాదం..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్
ADVERTISEMENT

తెలంగాణలో జరిగిన ప్రమాద ఘటనలో, ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు.

వీరిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్‌తో మరో ఆరుగురు ఉన్నారు.

వీరిలో ఆరుగురు జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీకి చెందిన వారు కాగా, ఇద్దరు రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన వారు.

వీరంతా ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారుగా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది.

1.మనోజ్ కుమార్, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఉన్నావ్, ఉత్తర‌ప్రదేశ్), తండ్రి పేరు: అర్జున్ ప్రసాద్

2.శ్రీ నివాస్, సైట్ ఇంజినీర్(చందౌలి, ఉత్తరప్రదేశ్), తండ్రి పేరు: రామ్ క్రిత్

3.సందీప్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రిపేరు: జితు సాహు

4.జగ్తా జెస్, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: మఘే జెస్

5.సంతోష్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: కేశ్వర్ సాహు

6.అనూజ్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: రామ్ ప్రతాప్ సాహు

7.సన్నీ సింగ్, జనరల్ ఆపరేటర్ (జమ్మూ కశ్మీర్), తండ్రి పేరు: రామ్ సింగ్

8.గురుప్రీత్ సింగ్, ఎరక్టర్ ఆపరేటర్ (పంజాబ్), తండ్రి పేరు: విర్సా సింగ్

సొరంగంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఏవిధంగా బయటకు తీసుకొచ్చారనే దానిపై కూడా అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.

ప్రమాదానికి ముందు భారీ శబ్దం వచ్చినట్లు కార్మికులు చెప్పారని మంత్రి తెలిపారు.

దోమలపెంట వద్ద సొరంగం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరిశీలించారు.

ప్రమాదం ఘటనపై సమీక్షించిన మంత్రి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.

”శనివారం ఉదయం పనులు ప్రారంభం కాగానే ఒక వైపు నుంచి నీళ్లు టన్నెల్‌లోకి రావడం మొదలైంది.

నీళ్లు, మట్టి కలిసిపోయి బురదమయంగా మారినట్లు తెలుస్తోంది” అని చెప్పారు.

ఘటనకు కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు.

”బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కింద పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి చీకటిగా మారింది” అని మంత్రి తెలిపారు.

ఆచూకీ లేని ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్లు మంత్రి ప్రకటించారు.

సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది.

ఈ మేరకు టన్నెల్ వద్దకు సింగరేణి రిస్క్యూ టీం చేరుకున్నట్లుగా అధికారులు చెప్పారు.

ప్రత్యేక మార్గం ద్వారా ఆక్సిజన్ సరఫరాతో టన్నెల్ లోనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.

అయితే, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా ఉందని అమ్రాబాద్ సీఐ తెలిపారు

.ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని, పూర్తి సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎంవో తెలిపింది.

ప్రమాద ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.

సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి.

ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు సొరంగంలో ఏడుగురు కార్మికులు ఉన్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోపలికి పరిగెత్తారు.

ప్రమాద సమయంలో పలువురు కార్మికులు పనులు చేస్తుండగా పైకప్పు పడిపోవడంతో వారంతా గాయపడ్డారు. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఏడాదిలోపు పనులు పూర్తి కావాలన్న ప్రభుత్వ టార్గెట్‌తో ఇంజనీర్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇరగేషన్‌ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటనే దానిపై ఇరిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలని.. నులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పైకప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ హయాంలో పది కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వారని… ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని… అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇంకా 9 కిలోమీటర్లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.

Tags: #CM REVANTH REDDY#PM MODI#SLBC#Srisaiam#Telangana#TeluguNews#UTTAM KUMAR REDDYSlbc TunnelworksSrisailam Tunnel
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP Govt :చెత్త పన్ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

Next Post

Samantha : ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను!

Related Posts

Vijayasai Reddy Political Strategy
Big Story

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics
Big Story

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu
Big Story

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

Next Post
Samantha  : ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను!

Samantha : ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Vijayasai Reddy Political Strategy

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info