ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

SLBC ప్రాజెక్ట్ : టన్నెల్ బోరింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

SLBC ప్రాజెక్ట్ : టన్నెల్ బోరింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
ADVERTISEMENT

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ వద్ద మూడు కిలోమీటర్ల మేర పై కప్పు కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మెషిన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్న క్రమంలోనే టన్నెల్‌ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 8 మంది ఆచూకీ మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి వినిపించే పేరు టన్నెల్ బోరింగ్ మెషిన్‌. సొరంగ మార్గాన్ని తవ్వేందుకు వినియోగించే ఈ బోరింగ్ మెషిన్‌ గురించే అంతా చర్చ జరుగుతుంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్‌ ఎలా ఉంటుంది…. ఎలా పనిచేస్తుంది…?అనే ప్రశ్నలు ప్రతీ ఒక్కరి మదిని తొలచివేస్తున్నాయి

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో సొరంగాన్ని తవ్వుతున్న యంత్రం గురించి ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఆ యంత్రం ఈ ప్రమాదంలో దెబ్బతినడం చర్చకు ప్రధాన కారణం.

ఈ ప్రాజెక్టులో వాడుతున్న యంత్రాన్ని టీబీఎం అంటే, టన్నెల్ బోరింగ్ మెషీన్ అంటారు. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీలో వినియోగిస్తోన్న ఈ మెషీన్ రకాన్ని డబుల్ షీల్డ్ టీబీఎం అంటారు.

”మిగిలిన అన్ని పద్ధతుల కంటే టన్నెల్ బోరింగ్ మెషీన్ ద్వారా శబ్దాలు తక్కువ వస్తాయి. పైన ఉన్న నల్లమల అడవిలో మరెక్కడా తవ్వకుండా, పైకి శబ్దాలు రాకుండా ఉండటానికి ఈ యంత్రాన్ని ఎంచుకున్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ చేయకుండా మట్టిని తొలగించడానికి ఈ యంత్రమే మంచిది. ముఖ్యంగా పరిసరాలు దెబ్బతినకుండా, పనిచేయడం ఈ యంత్రాల ప్రత్యేకత.”

”ఒక రకంగా ఇది భూమిలోపల చెక్కుకుంటూ, కలుగు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. కొన్ని దశాబ్దాల నుంచీ ఈ తరహా యంత్రాలు వాడుకలో ఉన్నాయి. ఇందులో మెషీన్ ముందు వైపు తిరిగే చక్రం ఒకటి ఉంటుంది. దాన్నే కటర్ హెడ్ అంటారు. తరువాత మేరింగ్ ఉంటుంది. అలాగే వచ్చిన వ్యర్థాలను పట్టే వ్యవస్థా ఉంటుంది.

మట్టి, రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం.. ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఈ యంత్రాల్లో రకాలు మారతాయి. కాంక్రీట్ లైనింగ్, మెయిన్ బీమ్, గ్రిప్పర్, సింగిల్ షీల్డ్, డబుల్ షీల్డ్, ఎర్త్ ప్రెషర్ బాలెన్స్, ఓపెన్ ఫేస్ సాఫ్ట్ గ్రౌండ్ ఇలా చాలా రకాల యంత్రాలు ఉంటాయి.” అని ఇంజినీర్ వివరించారు.

మధ్యలో ఎలాంటి యాక్సెస్ లేని ప్రపంచంలోనే పెద్ద టన్నెళ్ళలో ఒకటి ఎస్‌ఎల్బీసీ. దిల్లీకి చెందిన జేపీ గ్రూప్ (జయప్రకాశ్ అసోసియేట్స్) అనే కంపెనీ మొదటి నుంచీ ఈ ప్రాజెక్టు కాంట్రాక్టరు.

సొరంగం తవ్వే పనిని జేపీ గ్రూపు అమెరికాకు చెందిన రాబిన్స్ సంస్థకు అప్పగించింది. 2006 మే 26వ తేదీన ది రాబిన్స్ కంపెనీకి పని అప్పగించింది జేపీ గ్రూపు. మొత్తం రెండు టీబీఎంలు, కన్వేయర్ బెల్టు, బ్యాకప్ సిస్టం, స్పేర్ పరికరాలు ఇతరత్రా బాధ్యత అంతా ఈ సంస్థకే అప్పగించింది.

2008 మార్చిలో ఔట్‌లెట్ వైపు, 2009 అక్టోబరులో ప్రస్తుత ప్రమాదం జరిగిన ఇన్‌లెట్ వైపు మెషీన్ పని మొదలుపెట్టింది. విడిభాగాలను తీసుకెళ్ళి సైట్లోనే బిగించే పద్ధతిని ‘ఆన్‌సైట్ ఫస్ట్ టైమ్ అసెంబ్లీ’ విధానంలో చేశారు.

అప్పుడు వచ్చిన శ్రీశైలం వరదల్లో ఈ యంత్రం మునిగిపోయినట్టు కంపెనీ చెప్పింది. 2010 నుంచి చురుగ్గా ఈ యంత్రం పని చేయడం ప్రారంభించింది. ‘‘అత్యంత కఠిన పరిస్థితుల్లో సొరంగం తవ్వాల్సిన ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ’’ అని రాబిన్స్ సంస్థ చెప్పుకొచ్చింది.

2020 నవంబర్ నాటికి రెండు యంత్రాలూ కలిపి 70 శాతం పని పూర్తి చేసినట్టు ఆ సంస్థ ప్రకటించుకుంది.

సాధారణంగా ఈ టీబీఎంల ఖరీదు పదుల నుంచి వందల కోట్ల రూపాయలు ఉంటుంది. దీని తయారీకి కూడా నెలల నుంచి ఏళ్ళ సమయం పడుతుంది.

రాబిన్స్ సంస్థ తయారు చేసే నిర్మాణ యంత్రాలలో రూ. 43 కోట్ల నుంచి రూ. 850 కోట్ల వరకూ ఖరీదైన మెషీన్లు ఉన్నాయి. పన్నులు, రవాణా ఖర్చులు వీటికి అదనం. ఈ ధర ప్రతి యంత్రానికీ మారిపోతుంది.

”కఠినమైన నేల ఉండి, పని మాత్రం వేగంగా వెళ్లాలి అనుకున్నప్పుడు ఈ తరహా యంత్రాలు అవసరమవుతాయి. 1972లో ప్రపంచంలో మొదటి డబుల్ షీల్డ్ టీబీఎం తయారు చేసింది. అప్పటి నుంచీ మా యంత్రాలు ఎన్నో ప్రపంచ రికార్డులను అధిగమించాయి. టీబీఎంకి ముందు వైపు తిరిగే కటర్ హెడ్ ఉంటుంది. దాని తరువాత టెలిస్కోపిక్, గ్రిప్పర్, టేల్ అని మూడు షీల్డులు ఉంటాయి.” అని రాబిన్స్ సంస్థ చెప్పింది.

ప్రపంచంలో భూమి కింద నిర్మాణ పనులు చేపట్టే యంత్రాల తయారీలో పేరు ఉన్న సంస్థల్లో అమెరికాకు చెందిన రాబిన్స్ ఒకటి. కనీసం వెయ్యి సొరంగాల నిర్మాణంలో పాత్ర ఉన్నట్టు ఆ సంస్థ ప్రకటించుకుంది.

సొరంగాలు తవ్వే టన్నెల్ బోరింగ్ మెషీన్లు, మట్టి తరలించే కన్వేయర్ బెల్టులు, మైనింగ్ యంత్రాలు, కట్టర్లు వంటివి ఈ సంస్థ తయారు చేస్తుంది.

ఆంధ్రలో నిర్మాణంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ కూడా ఇదే యంత్రంతో తవ్వుతున్నారు.

ఈ తరహా టన్నెల్ బోరింగ్ మిషన్ల విషయంలో రాబిన్స్ ఎంత సమర్థవంతంగా చేస్తుందో చెప్పేందుకు తాజా ఎస్‌ఎల్బీసీ పనినే ఉదాహరణగా చెప్పుకుంది ఆ కంపెనీ.

ఈ టన్నెల్ నెలకు సుమారు 400 మీటర్లు పొడవు తవ్వితే అందుకు 14 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనీ, చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దాన్ని బట్టి ఈ యంత్రాల ఖర్చు ఎంతో అర్థం చేసుకోవచ్చు.

Tags: #news7telugu#SLBC#water
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ని ముమ్మరం చేసిన సర్కార్

Next Post

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

Related Posts

Telangana
Big Story

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

KTR BJP Alliance 2028
Big Story

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Assembly Speech
Big Story

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Telangana
Big Story

Telangana:వెయ్యి రోజుల ప్రజాపాలనపై ‘వినూత్న గణపతి’.. బాహుబలి తరహాలో రేవంత్ రెడ్డి ప్రతిమ

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Next Post
హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి  మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

naralokesh

NaraLokesh: ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిందే.. లోకేష్ కీలక ఆదేశాలు

Telangana

Telangana:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ.. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info